For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రేజర్ కట్స్ నివారణకు షేవింగ్ టెక్నిక్స్ అండ్ చికిత్స

|

అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి షేవింగ్ ఒక సులభ పద్ధతి. అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి చాలా మంది ఈ పద్దతిని ఉపయోగిస్తుంటారు. అయితే, షేవింగ్ వల్ల చర్మం మీద దురద, ఎర్రగా దద్దుర్లులా, సోర్ నెస్(సలపినట్లు అనిపించడం) మరియు తెగడం వంటి చర్మ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. షేవింగ్ తర్వాత ప్రతి ఒక్కరూ ప్రధానంగా ఎదుర్కొనే చాలా సాధారణ చర్మ సమస్య రేజర్ కట్స్. చాలా వరకూ పురుషులు షేవింగ్ తర్వాత వారి ముఖంలో ఏర్పడే రెడ్ నెస్(చర్మం ఎరుపు రంగులో)మారడాన్ని ఎవ్వరూ ఇష్టపడరు.

ఈ రేజర్ కట్స్ ఎందుకు ఏర్పడుతాయంటే, షేవింగ్ చేసుకొనేటప్పుడు సరిగా దృష్టి పెట్టకపోవడం మరియు షేవింగ్ చేసుకోవడానికి సరైన టెక్నిక్స్ ను పాటించకపోవడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. రేజర్ బ్లేడ్స్ ఉపయోగించడం వల్ల చర్మం మీద ఉప్ప పైపొరను తెగేలా చేస్తుంది. చాలా మంది పురుషులు షేవింగ్ చేసుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకోకోపోవడం వల్ల షేవింగ్ చేసుకొన్న తర్వాత రేజర్ కట్స్ వల్ల చర్మ మీద మంటపుట్టి, ఎక్కువగా బాధకలిగిస్తుంటుంది. రేజర్ కట్స్ వల్ల ఏర్పడ్డ మంటను తగ్గించుకోవడానికి లోషన్స్ లేదా యాంటి సెప్టిక్ క్రీములు వాడినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంతే కాదు, ఒక్కోసారి రేజర్ కట్స్ వల్ల చర్మం మీద స్కార్స్ (చారలు)గా, అలాగే గుర్తులుగా మిగిలిపోతాయి.

కాబట్టి, రేజర్ కట్స్ వల్ల ఏర్పడే మంట మరియు ఇతర చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని బెస్ట్ హోం రెమడీస్ ఉన్నాయి. రేజర్ కట్స్ నుండి చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి వివిధ రకాల క్రీములు మరియు లోషన్స్ అప్లై చేయడానికి బదులు ఈ సింపుల్ వస్తువులను ఉపయోగించుకోవచ్చు. మరి రేజర్ కట్స్ నుండి మీకు ఉపశమనం కలిగించే ఆ నేచురల్ హోం రెమడీస్ ఏంటో ఒకసారి చూద్దాం....

చల్లటి నీళ్ళు:

చల్లటి నీళ్ళు:

షేవింగ్ చేసుకొన్న తర్వాత, తప్పనిసరిగా చల్లటి నీటితో ముఖం శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రేజర్ కట్స్ వల్ల ఏర్పడే వాపును మరియు మంట నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఆ వాపు, మంట చల్లారే వరకూ వేడినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోకూడదు.

అలొవెరా జెల్:

అలొవెరా జెల్:

షేవింగ్ తర్వాత అలొవెరా జెల్(కలబంద గుజ్జు)ను ముఖానికి అప్లై చేయాలి. షేవింగ్ చేసుకొన్న తర్వాత ముఖం అంతా లేదా మంట కలిగించే ప్రదేశంలో అలొవెరా జెల్(కలబంద గుజ్జు)ను అప్లై చేసి 15-20నిముషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఐస్ క్యూబ్స్:

ఐస్ క్యూబ్స్:

షేవింగ్ చేసుకొన్న తర్వాత ఐస్ క్యూబ్స్ తో ముఖం మీద మసాజ్ చేసుకోవాలి. రేజర్ కట్స్ వల్ల మంటను తగ్గించుకోవడానికి చల్లగా ఉండే ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

హాజెల్:

హాజెల్:

రేజర్ బర్న్ మరయు రేజర్ కట్స్ సహాజంగా, నేచురల్ ఆస్ట్రిజంట్ గా పనిచేస్తుంది విచ్ హాజెల్ మరియు వాటర్ మిశ్రమాన్ని రెజర్ కట్స్ మీద అప్లై చేయాలి. ఇది సహజంగానే ఉపశమనం కలిగిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

నీళ్ళకు ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి ముఖానికి ఉపయోగించడం వల్ల రేజర్ కట్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ:

షేవింగ్ చేసుకొన్న తర్వాత చర్మ పొడిబారడం సహజం. ఇది రేజర్ కట్స్ వల్ల జరగడం సహజం. కాబట్టి చర్మాన్ని మాయిశ్చరైజ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి రేజర్ కట్స్ నుండి సహజంగా ఉపశమనం పొందాలంటే షేవింగ్ తర్వాత పెట్రోలియం జెల్లీని ముఖానికి అప్లై చేయాలి.

షేవింగ్ తర్వాత:

షేవింగ్ తర్వాత:

రేజర్ కట్స్ వల్ల తరచుగా రక్తస్రావం జరుగుతుంది. షేవింగ్ తర్వాత ఆల్కహాల్లో ఉండే రక్తస్రావాన్ని నివారించడానికి రక్తస్రావనివారిణిగాను మరియు క్రిమినాశకంగాను పనిచేస్తుంది.

రేజర్ ను శుభ్రం చేయాలి:

రేజర్ ను శుభ్రం చేయాలి:

ఈ హోం రెమడీస్ ఉపయోగించడంతో పాటు, రేజర్ కట్స్ ను నివారించడాకి షేవ్ చేసే ప్రతి సారీ మీ రేజర్ పూర్తి శుభ్రం చేయాలి. షేవింగ్ పైనుండి మొదలు పెట్టి క్రిందికి చేసుకోవాలి. పైకి చేయకూడదు. సరైన షేవింగ్ టెక్నిక్స్ పాటించకపోవడం వల్ల కూడా రేజర్ కట్స్ కు దారితీస్తుంది.

English summary

Home Remedies To Treat Razor Cuts

Shaving has become one of the easiest methods of hair removal. Many people are opting for this hair removal method to get rid of unwanted body hair. However, shaving leaves behind some skin problems like itching, red bumps, soreness and cuts.
Story first published: Friday, September 20, 2013, 16:39 [IST]
Desktop Bottom Promotion