For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మానికి స్వాంతన కలిగించే హోం మేడ్ బామ్స్...!

By Super
|

అత్యంత చవకైన, సృజనాత్మక ఉత్పత్తి అయిన ఔషధ తైలాన్ని, వివిధ వృద్ది చెందే, విలాసవంతమైన పదార్ధాలతో ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. సాధారణంగా పెదాలు లేదా శరీరంలోని ఏ భాగాన్నైనా సాంత్వన కలుగాచేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఎక్కువ పనివల్ల, వాతావరణం, గార్డెనింగ్ వల్ల కలిగిన చర్మం పగుళ్ళను నిరోధించే రక్షణగా కూడా ఇది పనిచేస్తుంది.

ఇంట్లో ఔషధ తైలాన్ని తయారుచేయడం:

ఇంట్లో ఔషధ తైలం తయారుచేయడానికి కొచెం అనుభవం ఉండాలి, కానీ ఒకసారి మీరు తయారుచేసినట్లయితే, మీరు అనుకున్నట్లు మరింత సృష్టించవచ్చు. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా జోజోబా ఆయిల్ వంటి సాదా వెజెటబుల్ ఆయిల్ ఔషధ తైల తయారీకి మూలం. మరో ప్రధాన పదార్ధం మైనం ఇది తేలికగా నిల్వచేసి, వర్తింప చేస్తుంది.

Homemade balms to soothe your skin

విధానం:

మైనం పూర్తిగా కరిగేవరకు నూనె, మైనాన్ని కలిపి డబుల్ బాయిలర్ లో వేడి చేయండి. అది మరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం చల్లబడ్డ తరువాత, సుగంధ నూనెలు, ఎండబెట్టిన పువ్వులు లేదా పరిమళాల రూపంలో మీ సృజనాత్మకత జోడించండి.

ఇది పూర్తిగా చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని జార్లలో లేదా బాటిల్స్ లో నింపండి. ఇది ఇంట్లో ఔషధ తైలం తయారుచేయడానికి ప్రాధమిక మిశ్రమం, కానీ ఒక వ్యక్తీ ఎంపిక, అవసరాల ప్రకారం అనేక వైవిధ్యాలు సాధ్యపడతాయి.

శరీర ఔషధ తైలం, పెదాల ఔషధ తిలానికి కొన్ని సాధారణ పదార్ధాలు

కాలేన్డులా - నిమ్మ ఔషధ తైలం :

యంటి-ఫంగల్, యాంటి-వైరల్, యాంటి-ఇంఫ్లమేటరీ లక్షణాలు కలిగిన అంటురోగాల చికిత్సకు, నొప్పిని తగ్గించడానికి ఉపయోగించే ఔషధ తైలం. మీకు సగం కప్పు మైనం, 2 కప్పుల ఆలివ్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల షియా వెన్న, ¾ కప్పుల కలేన్డుల, నిమ్మ ఎండిన ఆకులు, 2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్ అవసరం.

విధానం: ఎండబెట్టిన ఆకులతో రెండు నూనెలను (కొబ్బరి, ఆలివ్) కలిపి 3 గంటలు తక్కువ మంటపై వేడిచేయండి. ఈ మిశ్రమాన్ని వడకట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు డబుల్ బాయిలర్ విధానాన్ని ఉపయోగించాలి, మైనం, వెన్న కలిపి కరిగించి వెంటనే నూనె డబ్బాలో పోయండి. బాగా కలపండి, టీ ట్రీ ఆయిల్, లవేందర్ ఆయిల్ కలపండి. ఇప్పుడు గోరువెచ్చని మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్ లలో లేదా అల్యూమినం కన్తైనర్లలో పోయండి.

రోజ్ లిప్ బామ్ :

ఇది పొడి వాతావరణంలో పెదాలను తేమగా ఉంచి, గులాబీ వాసన, పరిమళంతో పాటు పెదాలకు గోధుమ రంగును ఇస్తుంది. మీకు 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి లేదా స్వీట్ బాదం నూనె, 1 టేబుల్ స్పూన్ ఎండిన గులాబీ మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ కోకో వెన్న, ¼ టీస్పూన్ విటమిన్ ఇ ఆయిల్ లేదా 2 విటమిన్ ఇ కాప్సిల్స్, 2-3 చుక్కల గులాబీ లేదా వెనిల్ల ఆయిల్ అవసరం.

విధానం: ఒక చిన్న కుండలో ఎండిన గులాబీ మొగ్గలతో పాటు కొబ్బరి లేదా ఆల్మండ్ నూనెను తక్కువ మంటపై అరగంట సేపు వేడిచేయండి. ఈ ద్రవాన్ని వదకట్టండి. ఇపుడు కోకో వెన్న కరిగే వరకు డబుల్ బైలర్ పద్ధతిలో వేడిచేయండి. దీనిని వేడిచేసిన నూనె మిశ్రమంలో కలపండి, పేర్కొనబడిన ఎసెన్షియల్ నూనెలను కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక కంటైనర్ కు బదిలీ చేయండి.

ఈ సాధారణ ఇంట్లోని వస్తువులతో కఠినమైన వాతావరణం నుండి మీ చర్మ౦ కోలుకునేలా వినూత్నంగా మార్పుచేయబడవచ్చు.

English summary

Homemade balms to soothe your skin

Balm, the most inexpensive and creative product, can be made at home by infusing various nourishing and luxurious ingredients. Generally used for lips or to sooth any part of the body which requires immediate healing, they also act as a defensive barrier to the skin jagged by hard work, climate or gardening.
Desktop Bottom Promotion