For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సన్ టాన్ వల్ల నల్లబడ్డచర్మం తిరిగి తెల్లగా మార్చే టిప్స్

|

ప్రస్తుతం వర్షాకాలం, ఈ వర్షాకాలం వలన, అంటే ఎటువంటి ఆందోళనలు లేకుండా బయట తిరిగవచ్చు అనుకోవడం చాలా పొరపాటు. వర్షాకాలంలో కూడా మీ చర్మం ఖచ్చితంగా టాన్ కు గురిఅవుతుంది, ఎందుకంటే వర్షాకాలంలో కఠినమైన సూర్య కిరణాలు ఉండవు కాదా, చర్మానికి ఎటువంటి హానీ కలగదు. కానీ వర్షాకాలంలో వెలువడే సూర్య కిరణాల వల్ల కూడా చర్మం నల్లబడుతుంది. అందుకు సన్ స్క్రీన్ ఒక్కటే రాయడం సరిపోతుంది. మీరు మీ ముఖానికి ఎంత సన్ స్క్రీన్ రాస్తారనేది వేరే విషయం, కానీ రోజులో చివరగా మీరు సన్ టాన్ కు గురి కావల్సింది. మరియు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చర్మ శుద్ది (సన్ టాన్) తొలగించుకోవడానికి అంత తేలిక కాదు. సన్ టాన్ తొలగించుకోవడం కోసం ఇంట్లో కొన్ని ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల అవి సన్ టాన్ కు వ్యతిరేకంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

సూర్య రశ్మిలోని, యూవీ కిరణాలు చర్మంలోని మెలనిన్ కంటెంట్ ను పెంచి, చర్మం ఎక్కువగా నల్లబడేలా చేస్తుంది. సన్ టాన్ వల్ల చర్మానికి కలిగి హాని, రూపు మాపుకోవడానికి మీరు ఉపయోగించే కొన్ని ఫేస్ ప్యాక్స్ వల్ల చర్మానికి కలిగిన ఈ డ్యామేజ్ ను నివారించుకోవచ్చు. సన్ టాన్ నివారించుకోవడానికి ముఖానికి, చేతులు, పాదాలు మరియు సూర్యుడు యొక్క కఠినమైన కిరణాలు బహిర్గతమయ్యే ఏ ఇతర శరీర భాగాల కూడా సన్ టాన్ వల్ల చర్మం డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు కొన్ని నేచురల్ ప్యాక్స్ ఉన్నాయి . ఈ ప్యాక్స్ చర్మం మీద ఏర్పడ్డ డార్క్ పిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో కూడా మీ చర్మం నల్లగా మారకుండా సన్ టాన్ నివారించడానికి కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని ఒక సారి పరిశీలించండి.

బట్టర్ మిల్క్(మజ్జిగ):

టానింగ్ నివారించడానికి సులభ పద్దతి, సన్ టాన్ కు గురియైన శరీర బాగాల్లో బట్టర్ మిల్క్ ను అప్లై చేయాలి. ఒక ఐదు నిముషాలు బాగా రుద్దాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతి టాన్ కనిపించకుండా చేయడం చాలా బాగా సహాయపడుతుంది.

టమోటో జ్యూస్:

సన్ టాన్ కు గురియైన ప్రదేశంలో టమోటో గుజ్జును అప్లై చేయడం వల్ల చాలా ప్రభావంతంగా పనిచేసి సన్ టాన్ వల్ల డ్యామేజ్ అయిన చర్మాన్ని తిరిగి యాథా స్థితికి తీసుకొస్తుంది. సన్ టాన్ కు గురైన ప్రదేశంలో టమోటోగుజ్జుతో పాటు, పెరుగును కూడా అప్లై చేయడం వల్ల ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది అప్లై చేసిన పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి:

టాన్ ను తొలగించడంలో బొప్పాయి ఎక్స్ లెంట్ హోం రెమడీ. మరియు మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది ఎఫెక్టివ్ క్లెన్సర్ కూడా. బాగా పండిన బొప్పాయిని తీసుకొని, బాగా మెత్తగా చేసి ముఖానికి మరియు శరీరానికి అప్లై చేసుకోవాలి. మంచి ఫలితం కోసం బొప్పాయిలో తేనె మిక్స్ చేసి తర్వాత చర్మానికి అప్లై చేసుకోవాలి.

పొటాటో:

సన్ టాన్ నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ పొటాటో. పొటాటోను స్లైస్ గా కట్ చేసి ముఖం మీద రబ్ చేసి పది నిముషాలు అలాగే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇంకా పొటాటో జ్యూస్ కు లెమన్ జ్యూస్ కూడా మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు.

కుంకుమ పువ్వు:

చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో మంచి లక్షణాలు ఈ కుంకుమ పువ్వులో ఉన్నాయని ప్రశంసించారు. టానింగ్ ను తొలగించుకోవడానికి కుంకుమ పువ్వు మరియు మిల్క్ క్రీమ్ ను కూడా మిక్స్ చేసి, చర్మ సమస్య ఉన్న ఏరియాల్లో అప్లై చేయాలి. తర్వాత మీ చర్మం ఖచ్చితంగా డీటాన్డ్ గా కనిపిస్తుంది.

పెరుగు-నిమ్మరసం:

టానింగ్ కు మరొక ప్రభావవంతమైన హోం రెమడీ, పెరుగు మరియు నిమ్మరసం మరియు తేనెను పేస్ట్ లా తయారు చేయడమే. ఈ మూడింటి మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం మంచి కాంతివంతంగా మారుతుంది.

నేచురల్ ఆయిల్:

సీస్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ మూడింటిని సమంగా తీసుకొని బాగా మిక్స్ చేసి, టాన్ కు గరియైన ప్రదేశంలో అప్లై చేసి పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఫేస్ వాష్ కోసం శెనగపిండి లేదా మంచి ఫేస్ వాష్ ను ఎంపిక చేసుకోవడం వల్ల ఆయిల్ తొలగిపోతుంది. కంప్లెక్షన్ ను మెరుగుపరుచుకోవడానికి ఒది ఒక అద్భుతమైన పద్దతి.

సాండిల్ వుడ్:

గందం పొడిని పేస్ట్ లా చేసి, ముఖానికి మెండకు అప్లై చేయాలి. సాండిల్ వుడ్ చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది. సన్ టాన్ తొలగిస్తుంది.

అలోవెరా జెల్:

కలబంద నుండి జెల్ తీసీ ముఖానికి అప్లై చేయాలి. టానింగ్ వల్ల నల్లబడ్డ చర్మాన్ని మెరుగు పరచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

పంచదార మరియు నిమ్మరసం:

నిమ్మతొక్కను పంచదారలో అద్ద ముఖం మీద స్ర్కబ్ చేయాలి. ఈ పద్దతి వల్ల మీ ముఖం శుభ్రపడటమే కాదు, టాన్ ను కూడా తొలగిస్తుంది.

English summary

Homemade Packs To Get Rid Of Sun Tan | సన్ టాన్ వల్ల నల్లబడ్డ చర్మం తిరిగి తెల్లగా మారాలంటే

Just because this is monsoon season, does not mean you can venture outside without any worries. Your skin will definitely get tanned, even if you think the sun is hidden behind the clouds. And simply lathering on sunscreen is not enough. No matter how much sunscreen you slather on your face, you will end up tanned at the end of the day. 
Desktop Bottom Promotion