For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వచ్ఛమైన..తెల్లని చర్మఛాయ పొందడానికి షుగర్ స్ర్కబ్

|

సాధారణంగా మన జీవినశైలి, ఆహారపు అలవాట్లలో పంచదారను ఒక అనారోగ్యకరమైనదిగా భావిస్తారు. షుగర్ ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు బరువు పెరగడం, మధుమేహం, సెల్యులైట్ మరియు చర్మ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే, ఓరల్ గా పంచదారను అప్లై చేయడం వల్ల చర్మానికి ఒక బెస్ట్ బ్యూటీకేర్ ప్రొడక్ట్ గా నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా ప్రభావాన్ని చూపెడుతుంది. ఉదాహరణకు, పంచదార ఒక ఉత్తమ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. అందువల్లనే, చాలా మంది పంచదారను చర్మశుభ్రపరచుకోవడానికి ఒక మంచి స్ర్కబ్బింగ్ గా ఉపయోగిస్తుంటారు.

పంచదారను ముఖ చర్మానికి అలాగే డైరెక్ట్ గా అప్లై చేయడం లేదా ఇతర స్కిన్ కేర్ పదార్థాలతో మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల చర్మం క్లియర్ గా మరియు స్వచ్చమైనదిగా పొందవచ్చు. షుగర్ వల్ల మరో ప్రయోజనం ఏంటంటే చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది . మీరు బ్రౌన్ షుగర్ మరియు ఆలివ్ ఆయిల్ ను స్ర్కబ్బింగ్ గా ఉపయోగించడం వల్ల, చర్మం సాఫ్ట్ గా మరియు క్లియర్ స్కిన్ పొందడానికి చాలా సహాయకారిగా ఉంటుంది.

ముఖ్యంగా, చర్మానికి పంచదార ఒక యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుండి. ఎందుకంటే ఇది ఒక ఎక్స్ ఫ్లోయేట్ చర్మాన్ని స్వచ్చంగా శుభ్రపరుస్తుంది. చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేస్తుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మం నుండి స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. టాక్సిన్ చర్మానికి ఎటువంటి దుష్ర్పభావాన్ని చూపించదు. షుగర్ స్ర్కబ్ ను దీర్ఘకాలం పాటు పాటించినట్లైతే ఒక యవ్వన సౌందర్యం పొందడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

కాబట్టి, మీరు వంటగది వస్తువులను క్లియర్ స్కిన్ పొందడానికి మరియు ఇతర స్కిన్ బెనిఫిట్స్ పొందడానికి, షుగర్ స్ర్కబ్ ను వివిధ రకాలుగా ఎలా ఉపయోగించాలో ఒక సారి పరిశీలించండి....

పంచదార:

పంచదార:

మీరు చర్మం సంరక్షణకు తీసుకోండానికి సమయం లేనప్పుడు, మీరు ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకొని, పంచదారతో ముఖం మీద స్ర్కబ్ చేయాలి.5నిముషాల తర్వాత చల్లటి నీటితో కడగడం వల్ల స్వచ్చమైన మెరిసేటి చర్మం పొందవచ్చు.

క్లెన్సర్:

క్లెన్సర్:

మీ క్లెన్సర్ తో పాటు కొద్దిగా షుగర్ ను కూడా మిక్స్ చేసి, పక్కన పెట్టుకొని, చల్లటి నీటితో ముఖం కడిగి తర్వాత ఈ క్లెన్సర్ ను ముఖం మీద అప్లై చేయాలి. 5నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

ఒక కప్పులు నిమ్మరసాన్ని పిండి అందులో కొద్దిగా షుగర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మ సంరక్షణకు ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. నిమ్మరసానికి షుగర్ మిక్స్ చేయడం వల్ల ఒక బెస్ట్ క్లీనింగ్ స్క్రబ్ గా మారుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం కూడా తెల్లగా మారుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి మరియు చర్మం మీద ఏర్పడ్డ స్కార్స్ టిష్యులను తొలగిస్తుంది. గ్రీన్ టీ ఆకులను కొద్దిగా ఉడికించి, చల్లార్చి, వడగట్టి, అందులో కొద్దిగా షుగర్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముడుతలు లేని క్లియర్ స్కిన్ మరియు బిగువైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో కొద్దిగా పంచదార మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ఒక బెస్ట్ హోం మేడ్ స్ర్కబ్బర్ గా ఉపయోగపడుతుంది. మీరు స్ర్కబ్బింగ్ కోసం ఇతర ఆయిల్స్ అంటే బాదం, రోజ్మెరీ, జోజోబా ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ ను కూడా ఉపయోగించవచ్చు.

పాలు:

పాలు:

పాలతో పంచదారను మిక్స్ చేసి అందులో కొద్దిగా సాండిల్ వుడ్ పౌడర్ కూడా వేసి, మిక్స్ చేయాలి. ఇది ఒక ఉత్తమ హోం మేడ్ షుగర్ స్ర్కబ్. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు చర్మం తెల్లగా మారుతుంది.

బాదం:

బాదం:

బాదంను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి, ఉదయం నీరు వంపేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ కు కొద్దిగా పంచదార మిక్స్ చేసి కొద్దిగా బాదాం ఆయిల్ కూడా వేసి, బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ బాదం స్ర్కబ్ చర్మాన్నిశుభ్రం చేస్తుంది.

English summary

Homemade Sugar Scrubs

Sugar is considered as an unhealthy item as it leads to many health problems like weight gain, diabetes, cellulite and skin problems. However, applying sugar orally is one of the best skin care products that is natural and effective too.
Story first published: Wednesday, November 6, 2013, 16:51 [IST]
Desktop Bottom Promotion