For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖాన్నిఅందవిహీనంగా మార్చే నల్ల మచ్చల తొలగింపు ఇలా..!

|

సాధారణంగా మనం అందరం అద్భుతంగా మెరిసే చర్మం ఉండాలని కోరుకుంటాం. మనం ముఖాన్ని అలా ఉంచుకోవలనే మన కలని కొన్ని అందవిహీనంగా మార్చుతాయి. మన సహజ అందాన్ని పాడు చేయడంలో మొటిమలు, మచ్చలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు ఇంకా కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ముఖం మీద నల్ల మచ్చలు ఉంటే కనుక మొత్త ముఖ అందాన్ని మార్చేసి చూడటానికి చాలా అసహ్యంగా మార్చేస్తాయి. అందుకు చింతించాల్సిన పనిలేదు. ముఖం మీద ఏర్పడ్డ నల్ల మచ్చలను(డార్క్ స్పాట్స్ )ను తగ్గించుకోవడానికి అవకాశం ఉంది.

నల్ల మచ్చలు తొలగించి ఆ ప్రదేశంలో చర్మం మెరిసేలా చేయడానికి కొన్ని చర్మ జాగ్రత్తలు తీసుకోవాలి . మీకు మార్కెట్లో అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండవచ్చు . అయితే అవేమి మీకు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. మరీ ముఖ్యంగా, చాలా మందికి మార్కెట్లో దొరికె రసాయనిక బ్యూటీ క్రీమ్స్ అలర్జీకి దారితీస్తుంది. కాబట్టి హోం రెమడీస్ ను ఉపయోగించడం చాలా ఉత్తమ పద్దతి. ఇది నేచురల్ మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

డార్క్ స్పాట్స్ ను తగ్గించడానికి మరియు అవి చర్మం మీద కనబడనియ్యకుండా చేయడానికి , సహజంగానే ముఖం కాంతివంతంగా మెరిపించడానికి కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. వంటగది వస్తువులు ఉదా: తేనె, నిమ్మరసం, పాలు, సాండిల్ వుడ్ పౌడర్, బంగాళదుంప వంటివి ప్రతి ఒక్కరింట్లోను చాలా సులభంగా లభ్యం అయ్యేటటువంటి, నిల్వ ఉన్నటువంటి వస్తువులు. కాబట్టి, మీరు చేయాల్సిందల్లా ఈ వంటగది వస్తువులను ఉపయోగించి ముఖం మీద ఏర్పడ్డ డార్క్ స్పాట్స్ (నల్ల మచ్చలను) సహజంగా తగ్గించుకోవడమే. మరి మీ ముఖం మీద డార్క్ స్పాట్స్ తగ్గించే ఆ హోం రెమడీస్ ఏంటో ఒక సారి పరిశీలించండి....

అలోవెరా

అలోవెరా: డార్క్ స్పాట్స్ తొలగించుకోవడానికి ఈ బ్యూటీ ప్రొడక్ట్ ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కలబంద మాత్రమే కాకుండా, కలబంద నుండి తీసే కలబంద గుజ్జు(అలోవెర జెల్) కూడా చర్మ ఛాయను మార్చుతుంది మరియు మొటిమలను తగ్గిస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే ఆ ఘాటైన వాసనే చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. వెల్లుల్లిలో సల్ఫర్ ఉన్నందు వల్ల అంత ఘాటుగా వాసన వస్తుంది. ఇంత ఘాటు ఉండే వెల్లుల్లి అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను కలిగి ఉంది. డార్క్ స్పాట్స్ ను కనబడనియకుండా చేస్తుంది.

గ్రీన్ టీ

డార్క్ స్పాట్స్(నల్ల మచ్చల)మీద గ్రీన్ టీ ఆకులను అప్లైచేయడం వల్ల, డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. మరియు చర్మ ఛాయ పెరుగుతుంది.

తేనె

ఈ బ్యూటీ ప్రొడక్ట్ ను అనేక హోం రెమడీస్ తో కలపి అనేక చర్మ , జుట్టు, డార్క్ స్పాట్ వంటి సమస్యలను తగ్గించడానికి చికిత్సకు ఉపయోగిస్తారు.

నిమ్మరసం

నిమ్మరసం ముఖంమీద ఏర్పడ్డ నల్లమచ్చలను తొలగించడం మాత్రమే కాదు, చర్మానికి కాంతిని పెంచుతుంది, మంచి రంగును అందిస్తుంది. ఇంకా నిమ్మ రసం మొటిమలు మరియు మచ్చలను చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

పాలు

పాలతో ముఖం మీద మసాజ్ చేయడం వల్ల మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . మరియు డార్క్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

ఉల్లిపాయ

డార్క్ స్పాట్స్ (నల్ల మచ్చల) మీద ఉల్లిపాయ పేస్ట్ ను అప్లై చేయడం వల్ల, నల్లమచ్చలను మాయం చేయడంతో పాటు చర్మంలో కొత్త కాంతిని నింపుతుంది. సహజ చర్మ ఛాయను రెట్టింపు చేస్తుంది.

బంగాళదుంప

బంగాళదుంపను మెత్తగా పేస్ట్ లా చేసి అందులో నుండి వచ్చే రసాన్ని డార్క్ స్పాట్ లేదా ముఖం మెత్తానికి కూడా అప్లై చేయవచ్చు. డార్క్ స్పాట్స్ ను కనబడనియ్యకుండా చేయడంలో ఇది ఒక మంచి హోం రెమడీ.

సాండిల్ ఉడ్ పౌడర్

ఒక చెంచా పెరుగ మరియు ఒక చెంచా నిమ్మరసం తీసుకొని దానికి కొద్దిగా సాండిల్ ఉడ్ పౌడర్ మిక్స్ చేసి, ఆ పేస్ట్ ను ముఖానికి బాగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు కనబడకుండా పోతాయి.

పెరుగు

ఒక టేబుల్ స్పూన్ పెరగుకు మరో టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లమచ్చలు తొలగిపోయి, మెరిసేటి కాంతివంతమైన చర్మం మీరు సహజంగానే పొందవచ్చు.

English summary

Homeremedies to Reduce Dark Spots..

We all desire for a flawless glowing skin. This is a dream as our face has some or the other flaws that spoils our beauty. Acne and pimple are not the only skin problems we face. Having dark spots on the face can spoil your overall appearance and look bad.
Desktop Bottom Promotion