For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేకప్ లేకుండానే సౌందర్యంగా కనబడటం ఎలా...?

|

ఎల్లప్పుడూ సహజమైన సౌందర్యం తో ఉండడం అంత సులభం కాకపోయినప్పటికీ క్రమ క్రమంగా ప్రయత్నంతో సాధించవచ్చు. అలా ఎప్పుడూ సహజంగా ఉండడం వల్ల మీరు అందంగా ఉంటారు. చాలా మంది అమ్మాయిలూ మేకప్ వేసుకుంటేనేఅందం అని అనుకుంటారు. కానీ అది తప్పు. మేకప్ మిమ్మల్ని అందంగాను గొప్పగాను చూపెట్టవచ్చు కాని నిజానికి సహజంగా ఉండటమే మంచిది.

ఈ కింద అయిదు విధానాల ద్వారా మీరు సహజంగానే అందంగా ఉండడానికి ప్రయత్నించవచ్చు.

సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం ఎలా?

క్లెన్సింగ్ లేదా మాయిశ్చరైజింగ్: ప్రతిరోజూ ముఖాన్ని క్లెన్సింగ్ మరియు మోయిస్చరిజింగ్ చెయ్యండి. ప్రతి రోజూ రెండు సార్లు ఈ ప్రక్రియ మీరు పాటించండి. ప్రతి ఉదయం మరియు రాత్రి మీరు పడుకోబోయే ముందు ఇది పాటించడానికి సరైన సమయాలు. ఈ ప్రక్రియ వల్ల మీ ముఖ చర్మము ఉత్తేజంతో తాజాగా ఉంటుంది. క్లెన్సర్ అనేది మీ చర్మ తత్వానికి తగిన విధంగా ఎంచుకోండి. ఒకవేళ మీకు క్లెన్సర్ పడకపోతే ఒక మైల్డ్ లేదా బేబీ సోప్ ని వాడండి. మీది ఆయిలీ స్కిన్ అయితే ఆయిల్ ఫ్రీ మోయిస్చరైజర్ లేదా మీది డ్రై లేదా కాంబినేషన్ స్కిన్ అయితే వాటికి తగ్గ మోయిస్చరైజర్ లని ఎంచుకోండి.

సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం ఎలా?

ముత్యాలాంటి పల్ల వరుస: అందమైన ముత్యాల లాంటి పలువరస ముఖసౌందర్యానికి చాలా ముఖ్యమైనది. అందమైన పలువరస కలిగిన ఒక చిరునవ్వు ఎంతో అందంగా చూపెడుతుంది. అందు కే రోజుకి రెండు సార్లు దంత ధావనం చేసుకోండి. మీ పళ్ళని తెల్లగా చేసుకోవడానికి వైట్నింగ్ టూత్ పేస్టు వాడి చూడవచ్చు.

సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం ఎలా?

నీరు/కొబ్బరి బోండాం: 8 గ్లాసుల లేదా రెండు లీటర్ల నీరు ప్రతి రోజు తప్పని సరిగా తీసుకోండి. సౌందర్యవంతంగా ఉండటానికి శరీరానికి నీరు చాలా అవసరం. 75 శాతం శరీరం నీటితోనే నిర్మితమైంది. అందువల్ల మూడు రోజుల కంటే ఎక్కువ కాలం నీరు లేకుండా జీవించలేరు. నీరు తాగడం వల్ల శరీరం మరియు చర్మం శుభ్రపడుతుంది. ఒక రెండు వరాలు రోజుకి 8 గ్లాసుల నీళ్ళు తాగి చూడండి. మీకు తప్పక దాని ప్రభావం కనబడుతుంది. ఎక్కువగా నీరు త్రాగినప్పుడు ఎక్కువసార్లు ముత్ర విసర్జన జరగడం సహజం.

సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం ఎలా?

డైలీ డయట్ లో ఉండాల్సిన ఆహారాలు: ప్రతి రోజు కనీసం అయిదు భాగాల పళ్ళు, కూరగాయలు తినడం ముఖ్యం. పళ్ళు, కూరగాయలు ముఖ్యమే కాదు ప్రాణాధారం కూడా. అవి తినడం వల్ల మీ చర్మం కాంతి వంతంగా ఉంటుంది. మీకు ఆపిల్ నచ్చకపోయనా తినండి.

సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం ఎలా?

వ్యాయామం: ట్రామ్పోలిన్ నుండి మీ కుక్కని షైరు కి తీసుకువెళ్ళడం వరకు అన్నిట్లోనూ వ్యాయామం ఉన్నది. సహజంగా వ్యాయామం అనగానే చాలా మంది ఒక మైలు పరిగెత్తడమే అనుకుంటారు. అది నిజానికి తప్పు. మీరు ఎప్పుడూ చురుకుగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండటం కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం ఎలా?

సంతోషంగా గడపడం: సహజంగా ఉండటం లో ని ముఖ్యమైన రహస్యం ఎప్పుడూ నవ్వుతూ ఉండటం. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మీరు చూసే ప్రతి ఒక్కరిని నవ్వుతో పలకరించండి. మీ అమ్మ కావచ్చు, మీ పెంపుడు కుక్క లేదా మీ టీచర్ కావచ్చు. అందరితో నవ్వుతూ పలకరించండి. ఈ నవ్వు అనేది మిమ్మలిని సంతోషంగా ఉంచడమే కాకుండా ఇతరులని కూడా మీ గొప్పతనాన్ని గుర్తించే విధంగా చేస్తుంది. మీ అంతర సౌందర్యాన్ని ప్రకాశించనీయండి.

English summary

How to be Naturally Beautiful | సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం ఎలా ?

Staying regularly natural can be hard but all you need is a bit of time and effort and you will be beautiful. Many girls think that make-up is beautiful but they are wrong. Make-up can make you look better and feel better but it's better if you go without it.
Story first published: Thursday, March 7, 2013, 11:37 [IST]
Desktop Bottom Promotion