For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు లేకుండా మీ ముఖంను శుభ్రంగా ఉంచుకోవటం ఎలా?

|

మొటిమలు సమస్యగా ఉందా? మొటిమలు లేకుండా అందమైన ముఖం ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.ఈ క్రింది దశలను పూర్తిగా పాటిస్తే చర్మం తిరిగి క్లియర్‌గా,అందంగా,ఆకర్షణీయమైన ముఖంగా మారటానికి సహాయపడుతుంది.

దశలు

ముఖాన్ని సాలిసిల్లిక్ ఆసిడ్ తో శుభ్రంగా కడగాలి.ఈ ఆమ్లం మొటిమలు తగ్గటానికి సహాయపడుతుంది.ఇది బాధా నివారక లవణాలు గల ఆమ్లము అని నిర్ధారించుకోండి.

మీ ముఖం నుండి మృత చర్మం కణాలను తొలగించటానికి నేరేడు పండు స్క్రబ్ ఉపయోగించండి. ఈ స్క్రబ్స్ మృత చర్మ కణాలను తొలగించి చర్మం మెరుగ్గా కనపడటానికి సహాయపడుతుంది

గ్రీన్ టీ స్క్రబ్ ఉపయోగించుట వల్ల ఎర్రగా కందటం తగ్గి ,మరియు మొటిమల వల్ల వచ్చే గుంటలను తగ్గిస్తుంది.

కుకుంబర్ మాస్క్ వేసుకొంటే మీ ముఖం చాలా బాగా మెరుగవుతుంది. కుకుంబర్ మాస్క్ వేసుకొన్న తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఆరే వరకు ఉంచుకోవాలి. మీ ముఖం పూర్తిగా ఆరినదని నిర్దారించుకుని, ముఖమును గోరు వెచ్చని నీటితో కడగాలి.

మొటిమలు ఉన్న చోట ఐస్ ను ఉంచితే పరిమాణం మరియు ఎరుపుదనము తగ్గడానికి సహాయం చేస్తుంది.

ఒక కాటన్ బడ్ ని తీసుకుని పెరాక్సైడ్ లో ముంచి మొటిమలు ఉన్న చోట రాయాలి. మీ ముఖం మీద మొటిమలు తగ్గటానికి బాగా సహాయపడుతుంది. అలాగే మీరు ఆల్కహాల్ ను ఉపయోగించవచ్చు.కానీ ఆల్కహాల్ వలన కొంత బాధ కలుగుతుంది.

Stridex ఎక్కడైనా దొరుకుతుంది. Stridex అంటే సాలిసిల్లిక్ ఆసిడ్ మరియు కొన్ని రకాల పదార్దాలతో తయారైన ఒక కాటన్. దీనిలో ఆల్కహాల్ లేకుండా చూసుకుంటే మనకు బాధ కలగదు. ప్రతి రోజు ముఖం శుభ్రం చేసుకుని దాన్ని ముఖం మీద రాస్తే డ్రై అయిపోయి మన చర్మం టైట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది బాగా పనిచేస్తుంది. మొదట్లో కొన్ని సార్లు పొడి బారిన భావన కలుగుతుంది. తర్వాత మన చర్మం అలవాటు పడుతుంది.

Acne Free Face

చిట్కాలు

మీ చేతులు కడుక్కొన్న తర్వాత మాత్రమే మీ ముఖాన్ని ముట్టుకోవాలి.

మీ రోజువారీ ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు మీ ముఖం క్లీన్ అండ్ క్లియర్ గా ఉండడానికి
సహాయపడుతుంది.

ఒత్తిడిని నివారించండి. ఒత్తిడి మొటిమలకు కారణమవుతుంది.

హెచ్చరికలు

ప్రతి రోజు ఈ పద్ధతి ఉపయోగించకండి. వారానికి ఒకసారి లేదా ప్రతి కొన్నిరోజులకు పొడి చర్మం నివారించడానికి చేయండి.

మీ మొటిమలు ఒక రోజులో తగ్గుతాయని అనుకోవద్దు, కొంత సమయం పడుతుంది.

మీ చేతులు శుభ్రంగా లేకపోతె మీ ముఖాన్ని స్పృశించడం మానుకోండి.

మీ ముఖం మీద భయంకరమైన మొటిమల మచ్చలు ఎక్కువగా కనిపిస్తే మాత్రం ఒక తాత్కాలిక పరిష్కారాన్ని ఇవ్వవచ్చు.

English summary

How to Get a Clean, Acne Free Face | మొటిమలు లేని ముఖాన్ని సొంతం చేసుకోవడం ఎలా..?

Have bad acne? Can't seem to find a way to get that flawless face? Read this article to find out how to get that perfect looking face. As it may take time to have a completely clear face, following these steps can help lead up to the clean, clear face you've been wanting.
Story first published: Monday, March 25, 2013, 11:50 [IST]
Desktop Bottom Promotion