For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మసమస్యలన్నింటికి దివ్వౌషధం భారతీయ మసాలాలు

|

చర్మ సంరక్షణ విషయంలో చాలా మంది మహిళలు నేచురల్ రెమడీస్ ను ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ నేచురల్ హోం రెమడీస్ చర్మానికి ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చుతాయి. ప్రస్తుత రోజుల్లో మన చర్మ సమస్యలకు అన్ని రకాల నేచురల్ రెమడీస్ ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మెటిమలు తొలగించుకోవడానికి మరియు ముఖం ప్రకాశవంతంగా మార్చుకోవడానికి ఈ నేచురల్ రెమడీస్ బాగా సహాయపడుతాయి. సున్నితమైన చర్మతత్వం కలవారు కూడా, రసాయనిక ఉత్పత్తులను కాకుండా నేచురల్ రెమడీస్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. కాబట్టి హోం మేడ్ ఫేస్ ప్యాక్ తో చర్మ మీద మీకున్న అన్ని బాధలను తొలగించుకోండి.

చర్మం సంరక్షణ విషయంలో నేచురల్ గా ఉపయోగపడే కొన్ని ఇండియన్ మసాలాలను లిస్ట్ ఔట్ చేయబడింది. ఇండియాన్ మసాలు చర్మానికి సాధ్యం అయినంత వరకూ మంచి ఫలితాన్ని అంధిస్తాయి. వీటిలో కొన్నింటిని నీటితో లేదా తాజా పెరుగు లేదా రోజ్ వాటర్ తో మిక్స్ చేసి, ఫేస్ మాక్క్ లా వేసుకోవచ్చు. చర్మ సంరక్షణలో ఈ ఇండియన్ మసాలాలు చాలా గొప్పగా ఉపయోగపడుతాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవల్సిన విషయం ఏంటే?వాటిని ఎలా మిక్స్ చేయాలి, ఎలా ఉపయోగించాలి అనేవిషయం తెలుసుకోవాలి. ఈ మసాలాలను ఫేస్ ప్యాక్ గా వేసుకొన్నప్పుడు ఇవి కంటికి ఎటువంటి హాని కలిగించకుండా జాగ్రత్త తీసుకోవాలి. నేచురల్ రెమడీస్ ను కళ్ళ చుట్టూ, కళ్ళమీద అప్లై చేయకూడదు. మరియు ఫేస్ ప్యాక్ వేసుకొనేటప్పుడు మీ కురులు ముఖం మీద పడకుండా జాగ్రత్త గట్టిగా ముడివేసి పెట్టుకోవాలి. కొన్ని మసాలాలు మీ కేశాలకు బ్లీచ్ చేస్తుంది.

చర్మ సంరక్షణకు మేలు చేసే కొన్ని భారతీయ మసాలాలు..

పసుపు:

పసుపు:

ఇండియన్ మసాలాలు యాంటిసెప్టిక్ గుణాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపును మెత్తగా పొడి చేసి అందులో నీరుమిక్స్ చేసి పేస్ట్ లా కలుపుకొని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి . ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖంలో మొటిమలు సులభంగా తొలగిపోతాయి.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

ఈ ఇండియన్ మసాలాదినుసు కూడా చర్మానికి చాలా మంచిది. దాల్చిన చెక్కను పొడిలా చేసి, అందులో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి, పేస్ట్ లా తయారయ్యాక దీన్ని ముఖం, మెడకు ఫేస్ ప్యాక్ లా అప్లై చేయాలి. దాల్చిన చెక్కలో ఉండేటటువంటి యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలు మొటిమలను మరియు వేడి గుళ్ళలను నివారిస్తాయి.

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

చర్మ సంరక్షణలో మరొక ఇండియన్ మసాలా దినుసు బ్లాక్ పెప్పర్(మిరియాలు). ఈ ఇండియన్ మసాలా దినుసుల మాస్క్ ఎక్స్ ఫ్లోయేటింగ్ మాస్క్ లా ఉపయోగపడుతాయి . మిరియాలపొడిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. తడిఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

అల్లం:

అల్లం:

ముఖంలో అద్భుతమై కాంతి పొందాలంటే, ఈ ఇండియన్ మసాల దినుసును తప్పకుండా ప్రయత్నించాల్సిందే . ఈ మసాలా దినుసు స్కిన్ టోన్ పెంచడానికి బాగా సహాయపడుతుంది. తాజాగా ఉండే అల్లంను ముఖం మీద రుద్దాలి. 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఫెన్నల్(సోంపు):

ఫెన్నల్(సోంపు):

ఇండియన్ మసాలాలు సున్నితమైన చర్మానికి చాలా మంచిది. సోంపును మెత్తగా పొడిచేసి, పాలతో కలిపి పేస్ట్ లా చేసుకొన ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖంలో ఎరుదనం పోయి, చిరాకును తగ్గిస్తుంది.

లవంగాలు:

లవంగాలు:

చర్మంలో టాన్ తొలగించుకోవడానికి లవంగాలు బాగా ఉపయోగపడుతాయి. చర్మ సంరక్షణలో ఇండియన్ మసాలా దినుసులు బాగా ఉపయోగపడుతాయి. అంతే కాదు, ఇవి ప్రభావంతమైన క్లెన్సర్ గా కూడా ఉపయోగపడుతాయి.

పపరిక:

పపరిక:

ఇండియన్ మసాలా దినుసుల్లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి , ఇవి చర్మంలో ఇంకి, చర్మంలోని కొల్లాజెన్ తగ్గించేస్తుంది. కానీ పపరిక ముఖానికి అప్లై చేసినప్పుడు రిలాక్స్ గా మరియు తాజా అనుభూతిని పొందవచ్చు.

నువ్వులు:

నువ్వులు:

గుప్పెడు నువ్వులను మెత్తగా పేస్ట్ లా చేసుకొని, ముఖానికి మాస్క్ వేసుకోవడం వల్ల ముఖంలో ఏర్పడ్డ మొటిమలు తాలుకు మచ్చలను నివారిస్తుంది.

ఓరిగానో:

ఓరిగానో:

చర్మ రక్షణలో ఈ ఇండియన్ స్పైసీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓరిగానో పెరుగుతో మిక్స్ చేసి, మాస్క్ వేసుకోవడం వల్ల ముఖంలో స్కార్స్ ను తొలగిస్తుంది.

థైమ్:

థైమ్:

థైమ్ మరియు రోజ్ వాటర్ రెండూ మిక్స్ చేసి మాస్క్ వేసుకోవడం వల్ల, ఒక్క వారంలో మొటిమలు తగ్గడాన్ని మీరు గమనించవచ్చు.

English summary

Indian Spices For Skin Care

When it comes to skin care, most women believe in trying natural remedies to provide the best benefits to skin. Today, we try all kinds of natural remedies to treat our skin and ward off acne and blemishes.
Desktop Bottom Promotion