For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందానికి కస్తూరి పసుపు ప్రాధాన్యత ఎంతో మీకు తెలుసా..?

|

Kasturi Turmeric Ubtans For Spotless Skin
పసుపుతో ప్రాచీన కాలం నుండి భారతీయులు వంటకాలలో పసుపుకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ ఈ తరంలో తెలియని తనం వల్ల పసుపు యెక్క ప్రాధాన్యతను కొందరు విస్మరిస్తున్నారు. పసుపు కేవలం వంటకానికి రంగును తెచ్చేది మాత్రమే కాదు. పసుపుతో నీరుకలిపి మెత్తగా పేస్ట్ లా చేసి క్రమంగాలోనికి తీసుకుంటే శరీరానికి చురుకుదనం పెరుగుతుందని ఆయుర్వేధం వెల్లడిస్తోంది.

పసుపును వాడిన ఆహారము చర్మరోగాలను హరిస్తుంది. కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారంలో విషపధార్థాలు లేక మలినపధార్థాలు కలిసి ఉండి మనలోకి వెళుతాయి. పసుపు కావాలిసినంతగా కలిపిన ఆహారం విష మరియు మలిన పధార్థాలను పసుపు తొలగిస్తుంది. గ్యాస్ట్రబుల్ మరియు కడుపులో మంటలాంటి సమస్యలను పసుపు ఓ చక్కని రోగనివారిణిగా గుర్తించబడుతుంది.

సౌందర్యాన్ని మెరుగు పరిచే పరిశ్రమలు కూడా పసుపుకు ఎంతో ఋణపడి ఉన్నాయి. మెత్తగా పేస్టులా కలిపి చర్మానికి రుద్దుకున్నట్లయితే చర్మం నునుపుగా మారి తేజోవంతమవుతుంది. అలా పసుపు బాహ్య మరియు అంతరప్రయోజనాలకు ఎంతాగానో ఉపయోగపడుతుంది.

పసుపును ఒక మొక్క తాలూకు వేళ్ల నుంచి తీస్తారు. పసుపు కొమ్ములుగా పేర్కొనే ఆ మొక్కల వేళ్లను పొడిగా మార్చి సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. వంటలోనూ పసుపు వాడతారు. తెలుగువారి ఎన్నో సాంస్కృతిక ఉత్సవాల్లో కాళ్లకు పసుపు రాసుకునే సంప్రదాయం ఉంది. ఇది కీటక వినాశనిగా పని చేస్తుంది. దానితోపాటు ముఖానికి కూడా సౌందర్యసాధనంగా పసుపు రాసుకుంటారు. అందువల్ల ముఖానికి మెరుగైన ఛాయ వస్తుంది. అయితే దీర్ఘకాలంపాటు పసుపును ముఖానికి రాయడం అంత మంచిది కాదు. దానివల్ల ముఖం తడి కోల్పోయి పొడిబారే అవకాశం ఉంది.

పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది. ఎక్కువ సేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, లేక ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపసమనం కలిగిస్తుంది.

పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి. శరీరంమీద ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటికి పూస్తే దురద తగ్గిపోతుంది.

పసుపు, చందనం రెండింటిని పాలమీది మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకొని తర్వాత చన్నీళ్ళలో శుభ్రంగా కడిగిన ముఖ ఛాయ పెరుగుతుంది. శరీరం కాంతివంతం అవుతుంది.

పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది. పసుపు, వేపచెక్క పట్టచూర్ణం, కరకాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయమవుతాయి.

పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, మరియు దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి. పసుపు, తులసి ఆకులరసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక వ్రణాలు మానిపోతాయి.

మొటిమలు : జామ ఆకులు పసుపు తో కలిపి నూరి రాయాలి దాంతో మొటిమలు మచ్చలు తొలగిపోతాయి. పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. * పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. * దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది. * పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.

English summary

Kasturi Turmeric Ubtans For Spotless Skin | మీ చర్మ సౌందర్యాన్ని కాంతివంతంగా మార్చే పసుపు..!


 Kasturi turmeric ubtans rejuvenates the skin wonderfully. Kasturi turmeric is a good choice for people who are looking for a reliable product for removing tan. It can be used to cure blackened lips and dark spots on the body.
Story first published:Tuesday, April 30, 2013, 11:16 [IST]
Desktop Bottom Promotion