For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో వృద్ధాప్యం ఎదుర్కొనే యాంటీఏజింగ్ టిప్స్!

|

అందం కోసం స్త్రీలు మాత్రమే చిట్కాలు పాటించడంలో నిమగ్నమవుతారు. అయితే పురుషులు మాత్రం వయస్సు పెరుగుతున్నట్లు అనిపిస్తున్నా, అందం హరించుకుపోతున్నా వాటి గురించి అంతగా పట్టించుకోరు. కానీ పురుషుల కోసం యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటే కనుక ఆశ్చర్యకరంగా ఉంటుంది. స్త్రీలలాగా, పురుషులకు యాంటీఏజింగ్ ప్రొడక్ట్స్ ను లేవు, కాబట్టి వారు తమ చర్మాన్ని యవ్వనస్తులుగా సంరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

మహిళలు వారి చర్మంలోని ఏర్పడే మార్పులను అతి తేలికగా గుర్తిస్థారు. చర్మంలోని ముడతలతో ఏర్పడ్డ ఫైన్ లైన్స్, ఏజింగ్ స్కిన్ గుర్తించడం చాలా సులభం, కానీ పురుషుల్లో ఇలాంటివి కొన్ని మాత్రమే ఉంటాయి. సాధారణంగా వృద్ధాప్యం యొక్క జీవప్రక్రియ వారి సాధారణ ఆహారం మరియు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. వృద్ధాప్య లక్షణాలు స్త్రీల కంటే ముందుగా పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. స్త్రీల కంటే పురుషుల్లోనే వృద్ధాప్యం చాలా వేగంగా మొదలవుతుంది. అందుకే కొంత మంది పురుషులు వారి వాస్తవ వయస్సు కంటే ఎక్కువగా కనబడుతారు. మరి పురుషుల్లో చిన్న వయస్సులోనే ఏర్పడే ఈ వృద్ధాప్య లక్షణాలు ఎదుర్కోవడానికి కొన్ని నేచురల్ యాంటీఏజింగ్ లక్షణాలున్న చిట్కాలు ఉన్నాయి. వీటిని అనుసరించినట్లైతే పురుషులు కూడా యవ్వనస్తులుగా.. అందంగా ఉండేందుకు సహాయపడుతాయి.

స్మోకింగ్:

పురుషులకు బెస్ట్ యాంటీ ఏజింగ్ చిట్కా ఏంటంటే..పొగతాగేవారు, వెంటనే పొగతాగడానికి స్విస్తి చెప్పాలి. ధూమపానం మ్యాన్లినెస్ కు ఒక చిహ్నంగా అనుకొన్నప్పటికీ, ధూమపానం మీ వాస్తవ వయస్సుకు కొన్ని అధనపు సంవత్సరాలను జతచేస్తుంది. దాంతో మీ ముఖం ముడుతలతో మరియు పొడి చర్మంతో మీ అందం సర్వ నాశనం అవుతుంది.

షేవింగ్:

పురుషులు తరచూ షేవింగ్ చేస్తుంటారు. దాని వల్ల ముఖం చాలా కఠనంగా, పొడిబారినట్లు మరియు వయస్సు పైబడ్డట్లు కనిపిస్తుంది. కాబట్టి, పురుషులు తమ షేవింగ్ కొరకు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.మరియు షేవింగ్ తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి అలాగే షేవింగ్ తర్వాత లోషన్ ను అప్లై చేసి మర్ధన చేయాలి. ఇవి పురుషుల యాంటీఏజింగ్ టిప్స్ లో ముఖ్యమైనవి.

ద్రాక్షరసం:

పురుషుల కోసం వయస్సు పైబడనియకుండా చేసే నేచురల్ యాంటీఏజింగ్ టిప్..పురుషుల వారు తీసుకొనే రెగ్యులర్ డైట్ లోకి ద్రాక్షరసాన్ని చేర్చుకోవాలి. పురుషుల చర్మంలో సాగే గుణాన్ని కల్పించే యాంటీఆక్సిడెంట్స్ ద్రాక్షరసంలో ఉన్నందును ఇవి యవ్వనంగా మరియు నేచురల్ గా ఉంచుతుంది.

మద్యం:

మరో ప్రభావవంతమైన యాంటీఏజింగ్ టిప్. మద్యం తీసుకోవడం నివారించాలి. ఇది పురుషుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. పురుషులు మద్యం సేవించడంలో శరీరంలోని రక్తనాళాల్లోని ఆల్కహాల్ విస్తరిస్తుంది. దాంతో చర్మం కుంగిపోయిన విధంగా మరియు అతుకులుగా కనిపించడానికి కారణం అవుతుంది.

వ్యాయామం:

వయస్సు పైబడ్డం అనేది ముఖంలో మాత్రమే కనబడదు. కుంగిపోయిన కండరాలు కూడా ఏజింగ్ కు సాధారణ లక్షణంగానే అనిపి్తుంది . కాబట్టి, కుంగిపోయిన కండరాలను బాగుచేసుకొనేందుకు నేచురల్ యాంటీఏజింగ్ టిప్ ఏంటంటే వ్యాయామం. రెగ్యులర్ వ్యాయామం చేయడం వల్ల చర్మంతో పాటు, కండరాలను యవ్వనంగా ఉంచుకోవచ్చు.

క్లెన్సర్:

ఓ అద్భుత యాంటీఏజింగ్ చిట్కా. పురుషులు ఎల్లప్పుడు చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మ రంద్రాలను దుమ్ము, ధూళితో అడ్డుపడనియ్యకుండా చూడాలి. అందుకు ప్రతి రోజూ రెండు సార్లు పాలతో ముఖాన్ని మర్దన చేయాలి. దాంతో చర్మం శుభ్రపడటంతో పాటు, చర్మం యవ్వనంగా కనబడేలా చేస్తుంది.

మసాజ్:

శరీరంలో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా ఇలా వయస్సు మళ్ళినవారిలా కనబడేలా చేస్తుంది. కాబట్టి శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరగాలంటే, రెగ్యులర్ హెడ్ మసాజ్ లేదా బాడీ మసాజ్ చేసుకోడం ఉత్తం. ఇది పురుషుల్లో నేచురల్ యాంటీఏజింగ్ చిట్కాగా సూచించవచ్చు.

గ్రీన్ వెజిటేబుల్స్:

ఒక ప్రభావవంతమైన యాంటీఏజింగ్ చిట్కా. గ్రీన్ లీఫీ వెజిటేబుల్ డైట్ తో మెరుగుపరుచుకోవాలి. గ్రీన్ వెజిటేబుల్స్ ఆకుకూరలు లేదా బీన్స్ వంటివి చర్మంలోని ముడుతలను మరియు ఏజింగ్ లక్షణాలను రానియ్యకుండా కాపాడుతుంది.

సన్ ఎక్స్ పోజర్స్:

పురుషులకు ఓ అద్బుతమైన యాంటీ ఏజింగ్ చిట్కా. ఎండలో తిరగడం తగ్గించాలి. బయట వెళ్ళడానికి ముందు సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేయాలి. సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం వల్ల ముఖంలో ముడుతలు, డ్యామేజ్ స్కిన్, వృద్ధాప్య గీతలు(చర్మం మీద గీతలు)కనబడనియ్యకుండా కాపాడుతుంది.

నీళ్ళు:

ప్రతి రోజూ 8గ్లాసుల నీటిని తాగడం అంటే ప్రతి రోజూ 2లీటర్ల నీటిని తాగాలి. పురుషులకు ఇది ఒక గ్రేట్ యాంటీఏజింగ్ చిట్కా. తగినంత నీరు తాగడం వల్ల చర్మాన్ని తేమగా మరియు హెల్తీగా ఉంచుంతుంది. వృద్ధాప్య లక్షణాలు కలగకుండా రక్షణ కల్పించబడుతుంది.

English summary

Natural Anti-ageing Tips For Men | పురుషులను యవ్వనస్తులుగా మార్చే యాంటీఏజింగ్ టిప్స్

Women are not the only ones obsessed about their looks. Men care about looking old as well. It is no wonder that men feel left out when the cosmetic industry is bombarding women with anti-ageing products to delay the effects of time on their faces and skin.
Desktop Bottom Promotion