For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేచురల్ ఫేస్ బ్లీచ్ తో కాంతివంతమైన చర్మం..!

|

మీ చర్మ తత్వాన్ని కాంతివంతంగా చేయడానికి స్కిన్ బ్లీచింగ్ అనేది చాలా మంచి మరియు సులభ టెక్నిక్. మరియు కొన్ని రకాల చర్మ సమస్యలు స్కిన్ టానింగ్ మరియు స్కిన్ టోన్ వంటివి తగ్గిస్తుంది. అయితే సున్నితమైన చర్మతత్వానికి జాగ్రత్త వహించడం చాలా కష్టం. ఎందుకంటే సున్నిత చర్మానికి స్ట్రాంగ్ బ్లీచింగ్ ఏజెంట్స్ ను ఉపయోగించడం వల్ల చాల రకాల సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. కాబట్టి సున్నిత చర్మతత్వానికి నేచురల్ బ్లీచ్ ను ఉపయోగించడం వల్ల చాలా ప్రభావవంతమైన మార్పులను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసుకొస్తుంది. మీది చాలా సున్నిత చర్మం అయితే ఈ క్రింది నేచురల్ బ్లీచ్ ఐడియాస్ ను ఫాలో అవ్వండి ఇది మీకు తాజా మరియు గ్లోయింగ్ స్కిన్ ను అంధిస్తుంది.

సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

ఆరెంజ్ పీల్ మిల్క్ పేస్ట్: ఆరెంజ్ తొక్కను బాగా ఎండబెట్టి మెత్తగా పౌడర్ చేసి, దానికి పాలు మిక్స్ చేసి బాగా మెత్తగా పేస్ట్ తాయరు చేసి ముఖానికి పూర్తిగా అప్లై చేయాలి. మరియు శరీరంలో ఏ ఇతర బాగాలు నలుపుగా మారిన ప్రదేశం(మెడ, మోచేతులు, మోకాళ్ళు, వేళ్ళ) కాంతివంతంగా మార్చుకోవాలనుకుంటే అక్కడ కూడా ఈ పేస్ట్ ను అప్లై చేసి అరగంట అలాగే ఉంచి తర్వాత గోరు వెచ్చని లేదాచల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ తొక్క సున్నిత చర్మానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

టమోటో గుజ్జు: టమోటో చాలా అరుదుగా ఉపయోగిస్తుంటారు . మరియు ఇది స్కిన్ బ్లీచింగ్ ఏజెంట్. మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవాలనుకుంటే టమోటో గుజ్జును ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది బాగా అరే వరకూ అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది సున్నిత చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి టమోటో గుజ్జును ప్రతి రోజూ అప్లై చేయవచ్చు.

సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

నిమ్మరసం: నిమ్మ సిట్రస్ జాతికి చెందినది. ఇది నేచురల్ స్కిన్ బ్లీచ్ గా తక్షణ ప్రభావాన్ని చూపెడుతుంది. నిమ్మరసాన్ని పిండి ముఖానికి అప్లై చేయాలి. 10-15నిముషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం అప్లై చేసి శుభ్రం చేసుకొన్న తర్వాత తప్పనిసరిగా మాయిశ్చరైజర్ ను వాడాలి లేదంటే చర్మం పొడిబారీ పోతుంది.

సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

కీరదోసకాయ: ఇది చాలా ఎక్కువగా స్కిన్ బ్లీక్ ఏజెంట్ గా ఉపయోగిస్తారు. ఇది చర్మానికి, కళ్ళు చాలా మేలు చేస్తుంది. సున్నిత చర్మ తత్వం కలవారు సేఫ్ గా ఉపయోగించవచ్చు కీరదోసకాయను పేస్ట్ చేసి ఆ రసాన్ని లేదా అలాగే గుజ్జును ముఖానికి పట్టించవచ్చు. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

ఓట్ మీల్ బ్లీచ్: ఓట్ మీల్ ను మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసి, అవసరం అయితే కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

పెరుగు: పెరుగు చాలా మంచి ఎంపి. నేచురల్ ఫేస్ బ్లీచ్ గా సున్నిత చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంచి ఫలితాన్నందిస్తుంది. ముఖానికి పెరుగు పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ సెన్సిటివ్ స్కిన్ సేఫ్ మరియు బ్యూటిఫుల్. దీన్ని రెగ్యులర్ గా వేసుకోవచ్చు.

సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

పాలు మరియు బాదాం: బాదం మిక్సీలో వేసి పాలు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం మీద డైరెక్ట్ గా అప్లై చేయాలి. అప్లై చేసిన పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇంది సున్నిత చర్మానికి మంచి బ్లీచింగ్ ఏజెంట్ మరియు అద్భుతమైన కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.

సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

తేనె- బాదాం: తేనె పవర్ ఫుల్ నేచురల్ స్కిన్ బ్లీచ్ ఏజెంట్, స్కిన్ సాప్ట్ నర్. బాదాం కూడా చర్మాన్ని కాంతివంతంగా మర్చే అద్భుతమైన బ్లీచింగ్ ఏజెంట్. ఒక చెంచా తేనె, ఒక చెంచా బాదాం పౌడర్ లో ఒక చెంచా నిమ్మరసం కలిపి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి.

సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

రోజ్ వాటర్ -నిమ్మరసం: మిల్క్ వైట్ బ్యూటి ఫుల్ స్కిన్ పొందాలంటే మీర ఖచ్చితంగా నిమ్మరసం తీసుకొని అంతే మోతాదులో రోజ్ వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

చందనం: సాండిల్ వుడ్ పౌడర్ అద్భుతమైన బ్లీచింగ్ ఏజెంట్. ఈ నేచురల్ బ్లీచ్ పౌడర్ కు నిమ్మరసం, కీరదోసకాయ రసం, మరియు టమోటో రసం వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేస్తే అద్భుతమైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది.

English summary

Natural Face Bleach Ideas For Sensitive Skin | సున్నితమైన చర్మానికి నేచురల్ ఫేస్ బ్లీచ్..!

Skin bleaching is the best and easy technique to make your skin tone lighter by reducing the visibility of certain skin problems like blemishes, tanning and uneven skin tone. But, when it comes to a sensitive skin, things become more difficult because, there are chances that you may get many side-effects of the strong bleaching agent.
Desktop Bottom Promotion