For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గమ్మడితో ఘుమఘుమలే కాదు..ముఖ కాంతిని కూడా మెరిపించవచ్చు..

|

సాధారణంగా బ్యూటీ విషయంలో ఎవ్వరూ రాజీపడరు. వారి అందం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. తమ అందాలను (చర్మ మరియు కేశ సౌందర్యం)మెరుగుపరుచుకోవడం కోసం చాలా ట్రీట్మెంట్ లను ప్రయత్నించి ఉంటారు. అందులో ముఖ్యంగా పండ్లు..కూరగాయలు(ఉదా: పపాయ, మామిడి, స్ట్రాబెరి, అరటి, అవకాడో, క్యారెట ఇలా మరికొన్ని...) దాదాపు అన్నివాడేసుంటారు. అయితే మీకు తెలుసా గుమ్మడిలో కూడీ అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా...?

గుమ్మడి కాయ వంట చేయని ఇళ్ళంటూ ఉంటుంది. ఇది పోషకాల పుట్టుగొమ్మ. అంతే కాదు బ్యూటీ విషయంలోనూ అంతే ప్రయోజనాలను అంధిస్తుంది. సాధారణంగా మన రెగ్యులర్ డైట్ లో గుమ్మడిని అంతగా చేర్చుకోము. గుమ్మడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఇందులో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్, న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడిలో విటమిన్ ఎ, సి, ఇ లు మరియు యాంటీయాక్సిడెంట్స్ ఉండి మొత్తం శరీర ఆరోగ్యనాకి మేలు చేస్తుంది.

గుమ్మడికాలో ఇంకా ఆల్ఫా మరియు బీటా కెరోటిన్, ఎక్స్ఫ్లోయిట్స్ గా వ్యవహరించే రెటోనోయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. గుమ్మడిని ముఖానికి అప్లై చేసినట్లైతే, చర్మం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఎక్స్ ఫ్లోయిట్స్ చేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మరి ముఖ్యంగా గుమ్మడి వల్ల చర్మానికి తగినంత మేలు చేస్తుంది. సన్ టాన్ మరియు సన్ బర్న్ నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ వెజిటేబుల్స్ హెయిర్ రీ గ్రోథ్ కు కావల్సిన పొటాషియంను శరీరానికి పుష్కలంగా అంధించడంలో అద్భుతంగా సహాయం చేస్తుంది. గుమ్మడి ముక్కలతో తలకు మర్ధన చేయడం వల్ల హెయిర్ ఫాల్ ను అరికట్టవచ్చు మరియు హెయిర్ గ్రోథ్ ను మెరుగుపరుచుకోవచ్చు.

గుమ్మడి గురించి ఇన్ని బ్యూటీ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత ఈ వెజిటేబుల్ ను ఉపయోగించడానికి మీరు ఖచ్చితంగా బ్యూటీకి ప్రయత్నించి మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవడానిక, అందాన్ని రెట్టింపుచేసుకోవడానికి చర్మాన్ని నేచురల్ గా మాయిశ్చరైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీకోసం కొన్ని గుమ్మడి ఫేస్ ఫ్యాక్స్ అంధిస్తున్నాం..మీరు కూడా ప్రయత్నించి మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి...

గుమ్మడి ఫేస్ ప్యాక్ తో ఫర్ ఫెక్ట్ స్కిన్...!

గుమ్మడి గుజ్జు: గుమ్మడికాయను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మీ చర్మ శుభ్రపడటంతో పాటు, చర్మ కాంతి పెరుగుతుంది.

గుమ్మడి ఫేస్ ప్యాక్ తో ఫర్ ఫెక్ట్ స్కిన్...!

గుమ్మడి -గుడ్డు ఫేస్ ప్యాక్: ఒక గుడ్డులోని తెల్ల సొనకు గుమ్మడి గుజ్జు, పాలు, తేనెను చేర్చి బాగా మిక్స్ చేసి ముఖం మరియు మెడకు అప్లై చేసి 15నిముషాల పాటు అలాగే ఉంచేసి, చల్లటి నీటి శుభ్రపరచుకోవడం వల్ల చర్మ కాంతివంతంగా మెరుస్తుంటుంది మరియు ఎటువంటి మొటిమలు లేకుండా రక్షణ కల్పిస్తుంది.

గుమ్మడి ఫేస్ ప్యాక్ తో ఫర్ ఫెక్ట్ స్కిన్...!

గుమ్మడి-యాపిల్ సైడర్ వెనిగర్: మీది ఆయిల్ చర్మం అయితే, మరి ఈ గుమ్మడి ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. గుమ్మడిపేస్ట్ లో కొన్నొ చుక్కల తేనె మరియు యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేస ముఖానికి అప్లై చేయాలి. 20నిముషాల అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇది ఆయిల్ స్కిన్ చర్మ తత్వం కలవారికి అద్భుతంగా పనిచేస్తుంది.

గుమ్మడి ఫేస్ ప్యాక్ తో ఫర్ ఫెక్ట్ స్కిన్...!

గుమ్మడి-పంచదార-పాలు: చర్మం కాంతివంతంగా మార్చుకోవడానికి గుమ్మడిగుజ్జులో అరచెంచా పంచదార వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత ముఖం మీద స్ర్కబ్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ మొటిమలకు , డార్క్ స్పాట్స్ తొలగించడానికి మరియు స్కిన్ కాంప్లెక్సన్ మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది.

గుమ్మడి ఫేస్ ప్యాక్ తో ఫర్ ఫెక్ట్ స్కిన్...!

గుమ్మడి మరియు శెనగపిండి: ఈ రెండి మిశ్రమాన్ని స్ర్కబ్ గా లేదా ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు. గుమ్మడి గుజ్జులో కొద్దిగా శెనగపిండి వేసి బాగా మిక్స్ చేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసం మరియు పాలు కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి 10-15నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అన్ని రకాల చర్మతత్వాలకు పనిచేస్తుంది. ఈ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు.

గుమ్మడి ఫేస్ ప్యాక్ తో ఫర్ ఫెక్ట్ స్కిన్...!

గుమ్మడి -పెరుగు: ఇది తక్షణం తయారు చేసుకో గల హోం మేడ్ ఫేస్ ప్యాక్ . గుమ్మడిగుజ్జులో కొద్దిగా పెరుగు మరియు నిమ్మరసం తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి మరియు మెడకు పట్టించాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

గుమ్మడి ఫేస్ ప్యాక్ తో ఫర్ ఫెక్ట్ స్కిన్...!

గుమ్మడి మరియు బాదాం: ఈ ఫేస్ ప్యాక్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ఇచ్చినంత ఎఫెక్ట్ ను ఇస్తుంది. బాదాం పౌడర్ లో గుమ్మడి గుజ్జును మిక్స్ చేసి కొద్దిగా తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖం మీద మసాజ్ చేయాలి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

గుమ్మడి ఫేస్ ప్యాక్ తో ఫర్ ఫెక్ట్ స్కిన్...!

గుమ్మడి మరియు సాండిల్ ఉడ్ పౌడర్: మొటిమలను నివారించుకోవాలనుకుంటున్నారా?మరి ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. సాండిల్ ఉండ్ పౌడర్ మొటిమలను దాని తాలూకు మచ్చలను పోగొడుతుంది. సాండిల్ ఉడ్ పౌడర్ ను గుమ్మడి గుజ్జతో మిక్స్ చేసి అందులో కొన్ని చుక్కల తేనె కూడా కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. దీన్ని 20నిముషా పాటు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి .

English summary

Pumpkin Face Packs For The Perfect Skin! | గమ్మడితో ఘుమఘుమలే కాదు..ముఖ కాంతిని కూడా మెరిపించవచ్చు..

There are many fruits and vegetables that are used for beauty treatments. From skin to hair care, we use several fruits and veggies like papaya, mangoes, strawberries, avocado, carrots etc. Did you know that pumpkin too can offer various skin and beauty benefits?
Story first published: Friday, May 17, 2013, 15:55 [IST]
Desktop Bottom Promotion