For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాంతివంతమైన చర్మం కోసం రెడ్ ఫ్రూట్స్ తో ఫేస్ ప్యాక్

|

ఎరుపు రంగు చూస్తేనే మనకు డేంజర్ సిగ్నెల్ అని గుర్తుకు వస్తుంది. ఇది ఒక కలర్ కోడ్, కానీ మా బోల్డ్ స్కై ఈ ఎరుపు రంగుకో డేంజర్ కోడ్ కాకండా మరో పేరును పెడుతున్నాం. అదేంటంటే చర్మసంరక్షణకు ‘రెడ్ ఫుడ్'బెస్ట్ హోం రెమడీ. అందులో ముఖ్యంగా ఎర్రటి పండ్లు వివిధ రకాలుగా ఆరోగ్యానికి సహాయపడుతాయి. అదే సమయంలో ఫేస్ ప్యాక్ కూడా బాగా సహాపడుతాయి. రెడ్ ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీ, ఆపిల్స్, టమోటో వంటి మరికొన్ని ఇతర ఎర్రని పండ్లను కూడా చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు.

ఈ రెడ్ కలర్ ఫ్రూట్స్ లో కొన్ని ముఖ్యమైన మినిరల్స్ చర్మంలో మెరుపును తీసుకురావడానికి బాగా సహాయపడుతాయి మరియు చర్మ సమస్యలను నివారించి, నలుపుదనాన్ని పోగొడుతుంది. మీరు కనుక మొటిమలు, మచ్చలు, జిడ్డు చర్మం, నల్లగా ఉండే చర్మం మరియు ఇతర చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లైతే..ఈ నేచురల్ పద్దతులను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది . మీకున్నటువంటి అన్ని రకాల చర్మ సమస్యలను నివారించుకోవాలంటే క్రింది విధంగా కొన్ని రెడ్ ఫ్రూట్స్ లిస్ట్ ను పరిశీలించి వాటిని పాటిస్తే మేలు జరుగుతుంది.

అయితే చర్మ సంరక్షణకు ఉపయోగించే పండ్లకు ఏదేని తాజా క్రీం, పాలు లేదా రోజ్ వాటర్ వంటివి మిక్స్ చేసి ఫేస్ ఫ్యాక్ వేసుకోవాలి. రెడ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ను కనీసం వారంలో ఒక్కసారైనా వేసుకోవాలి. దాంతో ఏ సీజన్ లో అయినా మీరు చూడటానికి అందంగా ఉంటారు. మరి మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసి రెడ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ కొన్ని మీకోసం...

దానిమ్మ:

దానిమ్మ:

ఎరన్ని ముదురు రంగు పండ్లలో దానిమ్మ ఒకటి. దీన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు. ఒక కప్పు దానిమ్మ గింజలను పేస్్ట చేసి 3/4కప్పు క్రీమ్ మిక్స్ చేసి ముఖం, మెడ కు అప్లై చేయాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 20నిముషాలు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ తొలగిపోతుంది. చర్మం ప్రకాశవంతంగా క్లియర్ గా ఉంటుంది.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

చర్మ సంరక్షణకు ఉపయోగించదగ్గ ఒక బెస్ట్ రెడ్ ఫ్రూట్ ఇది. స్ట్రాబెర్రీ చర్మం మెరిసేలా చేస్దుంది. స్ట్రాబెరీను మెత్తగా చేసి, అందులో పాలు మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ లా వేసుకోవాలి. కళ్ళ చుట్టూ పెదాల చుట్టు కొంచెం అధికంగా అప్లై చేయాలి. అప్పుడు ముఖం మొత్తం ఒకే రంగుతో మెరుస్తుంటుంది.

చెర్రీస్:

చెర్రీస్:

ఎర్రగా ఉండే ఈ చిన్న చెర్రీ పండ్ల వల్ల చర్మ కాంతి రెట్టింపు అవుతుంది. ముఖంలో డార్క్ నెస్ ను తొలగితస్తుంది. చెర్రీఫ్రూట్ ఫేస్ ప్యాక్ మొటమలతో వచ్చే మచ్చలను కూడా పూర్తిగా మాయం చేస్తుంది. ఒక గుప్పెడు చెర్రీపండ్లను మెత్తగా పేస్ట్ చేసి, అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

టమోటో:

టమోటో:

టమోటో వల్ల చర్మానికి చాలా అధికంగానే ప్రయోజనాలున్నాయి. టమోటోను చేత్తోనే బాగా గుజ్జులా నలిపేసి దాన్ని అలాగే ముఖం మరయిు మెడ మీద అప్లై చేసుకోవాలి. ముఖం మీద టమోటో రసం ఎండిన తర్వాత పాలు లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

రెడ్ ప్లమ్ :

రెడ్ ప్లమ్ :

ముదురు వర్ణంలో ఉండే ఈ రెడ్ ఫ్రూట్ ను స్కిన్ కేర్ కు నిరభ్యరంతంగా ఉపయోగించవచ్చు. ఈ రెడ్ ప్లమ్ ఫ్రూట్ ను రెండు లేదా మూడు తీసుకొని మిక్సీలో వేసి కొద్దిగా పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఈ బ్యూటీ ట్రీట్మెంట్ ను వారానికొక సారి ఫాలో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాంతో ముఖంలో డార్క్ నెస్ మరియు మొటిమలు తొలగిపోతాయి.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

జ్యూసీ వాటర్ మెలోన్ ఒక మంచి రెడ్ ఫ్రూట్. ఇది ఆరోగ్య పరంగానే కాదు, సౌందర్య పరంగా కూడా ఎక్కువ మేలు చేస్తుంది. పుచ్చకాయను ముక్కలుగా కట్ చేసి ముఖం మీద మసాజ్ చేయాలి. తడి ఆరిన తర్వాత మరో తాజా ముక్కను తీసుకొని మల్లీ మసాజ్ చేయాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం శుభ్రపడటమే కాదు కాంతివంతంగా మారుతుంది.

ఆపిల్:

ఆపిల్:

ముఖ చర్మంలో అన్ని రకాల సమస్యలను నివారించడంలో రెడ్ ఆపిల్ చాలా బెస్ట్. మీ ముఖంలో స్కార్స్ ఉన్నట్లైతే, ఆపిల్ ఫేస్ మాస్క్ తో చెక్ పెట్టవచ్చు. పొట్టుతో సహా ఆపిల్ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి, ఒక స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

క్రాన్ బెర్రీస్:

క్రాన్ బెర్రీస్:

అన్ని రకాల చర్మ సమస్యలకు ఈ రెడ్ ఫ్రూట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా ముఖంలో ప్యాచెస్ ఉన్నప్పుడు ఈ రెమడీ ఫర్ ఫెక్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి తెల్లని ప్యాచెస్ నివారించుకోవడానికి ఈ రెడ్ ఫూట్ ఫేస్ ప్యాక్ ను వేసుకోండి. ఈ పండ్లతో తయారుచేసి గుజ్జును ప్యాక్ గా వేసుకోవడం కానీ లేదా రసంతో ముఖం శుభ్రం చేసుకోవడం కానీ చేయచ్చు.

రాస్బెర్రీ:

రాస్బెర్రీ:

ముఖంలో బ్లాక్ హెడ్స్ తొలగించడానికి అద్భుతంగా పనిచేసిది ఈ పండు. ఈ పండును ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల, బ్లాక్ హెడ్స్ ను పూర్తిగా తొలగించుకోచ్చు. రాస్బెర్రీ పండును తీసుకొని దాంతో అలాగే తాజాగా ముఖం మీద మర్ధన చేయాలి. పదిహేను నిముషాల పాటు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా రబ్ చేసిన తర్వాత పాలలో ముంచిన కాటన్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి.

రెడ్ గ్రేప్:

రెడ్ గ్రేప్:

స్కిన్ కేర్ కు రెడ్ గ్రేప్ అద్భుతంగా పనిచేస్తుంది. రెడ్ గ్రేప్ జ్యూస్ ను టీజోన్ ప్రదేశంలో అప్లై చేయవచ్చు. దాంతో ముఖంలో జిడ్డు వెంటనే తొలగిపోతుంది. దాంతో ముఖంలో నల్లటి వలయాలు, చారాలను తొలగించుకొని వయస్సు పైబడకుండా కనబడేలా చేస్తుంది.

English summary

Red Fruits Face Packs For Skin Care

The colour red normally stands for code danger, but what if we at Boldsky tell you that this colour is one of the best remedies for skin care. Red fruits which are in good number are healthy for various purposes. And, at the same time they are healthy as face packs too.
Story first published: Saturday, September 21, 2013, 16:13 [IST]
Desktop Bottom Promotion