For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో డార్క్ లిప్స్(పెదాల నలుపు)నివారించే టిప్స్

|

సాధారణంగా మనందరం అందవిషయంలో ఏ మాత్రం రాజీపడం. ముఖ్యంగా స్త్రీలు. ప్రస్తుత రోజుల్లో స్త్రీలతో సరిసమానంగా, పురుషుల కూడా తమ అందవిషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందం అనాగానే తెల్లఉండటం మాత్రమే కాదు, ముక్కు, మూతి, కళ్ళు, పెదాలు ఇవన్నీ కూడా వాటికవే ఒక ప్రత్యేక స్థాన్ని కల్పించుకుంటాయి. మనం అందరం ముఖంలో కళ్ళ అందంతో పాటు, పెదాలకు కూడా ప్రత్యేక శ్రద్ద చాలా అవసరం. మనందరం కూడా మన పెదాలు పింక్ గా మరియు ఎటువంటి స్పాట్స్ లేకుండా ఉండాలిన కోరుకుంటాం. పెదాలు కళ్ళకు అందంగా కనబడాలనే కాదు, అందంగా, ఆరోగ్యంగా కూడా ఉంచుకోవాలి. డార్క్ లిప్స్ మీ అందాన్ని హరించడమే కాదు మరియు ఆకృతిని కూడా పాడుచేస్తాయి. డార్క్ లిప్స్(పెదాలు నల్లగా)మారడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ధూమపానం. సిగరెట్ తాగడం వల్ల పెదాల మీద ఉండే చాలా సున్నితమైన చర్మాన్ని వర్న్ చేయడం వల్ల పెదాలు డార్క్ గా మారుతాయి.

నికోటిన్, దీనికి ఒక అత్యంత వ్యసనపరుడైన వారిలో పెదాల యొక్క సహజ రంగును ప్రభావితం చేసేవాటిలో ఆల్కలాయిడ్ ఒక ప్రధానకారణం. ధూమపానం కారణంగో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం మరియు ముఖం మరియు పెదాలకు ఆక్సిజన్ మరియు రక్త ప్రవాహాన్ని తగ్గించడం వల్ల ముఖం మరియు పెదాలు రంగును పాడు చేస్తాయి. చర్మం దాని సహజరంగును కోల్పోవడానికి ప్రధాన కారణం సిగరెట్ లోని నికోటిన్, ఇది ఐరన్ శోషణను తగ్గిస్తుంది. దాంతో చర్మం యొక్క సహజ రంగును కోల్పోతుంది.

కొన్ని సంర్భల్లో డెడ్ స్కిన్ సెల్స్ కూడా పెదాలు నల్లగా మర్చుతాయి. స్మోకింగ్ లేదా సరైన లిప్ కేర్ తీసుకోకపోవడం వల్ల చాలా వరకూ పురుషులు డార్క్ లిప్స్ కలిగి ఉంటారు. కాబట్టి పురుషులు కూడా తమ పెదాల సంరక్షణ కోసం తీసుకోవల్సి జాగ్రత్తలను తెలుకోవల్సి ఉంది. డార్క్ లిప్స్ వల్ల మొత్తం మీ ముఖం అందాన్ని చెడగొడుతుంది. పురుషుల డార్క్ లిప్స్ తో పోల్చితే, మహిళలు తమ పెదాలు మృదువుగా ఉంచుకోవడానికి చాలా జాగ్రత్తలు మరియు టిప్స్ పాటిస్తుంటారు.

పురుషుల తమ డార్క్ లిప్స్(నల్లని పెదాల)ను నివారించడానికి చాలా రకాలో హోం రెమడీస్ కూడా ఉన్నాయి. వాటిలో చాలా ముఖ్యంమైన రెమడీ ఏంటంటే ముఖ్యంగా పొగతాడం మానేయాలి. పురుషులు ఖచ్చితంగా స్మోకింగ్ ను నిలిపివేయాలి మరియు లిప్ కేర్ కోసం కొన్ని గ్రూమింగ్ టిప్స్ ను అనుసరించాలి. ఉదాహరణకు, నిమ్మతొక్కను తీసకొని మీ డార్క్ మరియు రఫ్ లిప్స్ మీద స్ర్కబ్ చేయాలి. ఎందుకంటే నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. డార్క్ లిప్స్ ను లైట్ చేస్తుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

కాబట్టి పురుషుల కోసం, డార్క్ లిప్స్ ను లైటెన్ చేసే మరికొన్ని బెస్ట్ హోం రెమడీస్ ఇక్కడున్నాయి...

తేనె:

తేనె:

పింక్ కలర్ మరియు మృదువైన పెదాలు పొందడానికి, పెదాల మీద తేనెను అప్లై చేయాలి. తేనె పెదాలమీద నలుపును తొలగించి మృదువుగా చేస్తుంది. కాబట్టి రాత్రి నిద్రించే ముందు పెదాలకు తేనెను అప్లై చేయాలి.

బీట్ రూట్:

బీట్ రూట్:

రెడ్ కలర్ వెజిటేబుల్స్ మీ పెదాలను సహజంగా రెడ్ కలర్ లో మారేందుకు సహాయపడుతాయి. కాబట్టి పురుషులు వారి డార్క్ లిప్స్ మీద బీట్ రూట్ ముక్కతో రబ్ చేయాలి. దాంతో పెదాలు మృదువుగా, లైట్ రెడ్ కలర్ లోనికి మార్పు చెందుతాయి.

నిమ్మ:

నిమ్మ:

పురుషల డార్క్ లిప్స్ ను నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమడీ. నిమ్మతొక్కతో డార్క్ లిప్స్ మీద మసాజ్ చేయాలి. పెదాల మీద డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి నిమ్మ తొక్క మీద చిటికెడు ఉప్పును చిలకరించండి.

స్ట్రాబెరీ లిప్ బామ్:

స్ట్రాబెరీ లిప్ బామ్:

ఇది మరొక సింపుల్ హోం రెమడీ. డార్క్ లిప్స్ ను నివారించడానికి పురుషులు దీన్ని ప్రయత్నించవచ్చు. స్ట్రాబెరీని మెత్తగా చిదిమి, అందులో కొద్దిగా పెట్రోలియం జెల్లీని మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ రాత్రి పడుకొనే ముందు పెదాలకు అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సహజంగానే పెదాలు పింక్ కలర్ లోని మార్పు చెందుతాయి.

రాస్బెర్రీ:

రాస్బెర్రీ:

బెర్రీస్ నేచురల్ లిప్ కేర్ వస్తువు. ఇది పెదాల కలర్ ను నేచురల్ గా మార్చతుంది. రాస్బెర్రీని తేనె లేదా అలోవెరా జ్యూస్ తో మిక్స్ చేసి పెదాలకు అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల పెదాలు పింక్ కలర్ లోనికి మర్పు చెందుతాయి.

క్యాస్టోర్ ఆయిల్:

క్యాస్టోర్ ఆయిల్:

ఎసెన్సియల్స్ ఆయిల్స్ డార్క్ లిప్స్ మాయిశ్చరైజింగ్ కోసం మాత్రమే కాదు, ఈ నూనెలు డార్క్ లిప్స్ ను లైట్ గా పింక్ కలర్ లోనికి మార్చుతాయి.

కాబ్టట్టి క్యాస్టోర్ ఆయిల్(ఆముదం నూనెను)పెదాలకు అప్లై చేయండి.

ఐస్ క్యూబ్స్:

ఐస్ క్యూబ్స్:

ఐస్ క్యూబ్స్ తో మీ పెదాలను మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి మరియు పెదాలు మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతాయి.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

డార్క్ లిప్స్ ను నివారించడం కోసం బాదం ఆయిల్ ను రోజుకు మూడు, నాలుగు సార్లు పెదాలకు అప్లై చేయాలి. పెదాలు లైట్ గా మారి, పెదాలకు తగినంత తేమను అందిస్తుంది.

English summary

Remedies For Dark Lips Of Men

We all desire to have pink and shiny spotless lips. They not only look appealing to the eyes, but are welcoming as well! Dark lips can tarnish your image and spoil your overall appearance. There are many causes of dark lips one of which is smoking. It burns the sensitive layer of the skin thus darkening it.
Desktop Bottom Promotion