For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటూ తొలగించేందుకు సులభ చిట్కాలు..!

|

పచ్చబొట్లు (Tattoos) చర్మం మీద వేయించుకొనే ఒకరకమైన చిహ్నాలు. దీనిలో వివిధ వర్ణపదార్ధాలను సన్నని సూదుల ద్వారా గుచ్చి వేస్తారు. మనుషులలో ఇవి వారివారి అభిరుచులను బట్టి వేయించుకొనే గుర్తులు. ఈ పచ్చబొట్టు ఈ ఆధునిక కాలంలో టా టూస్‌గా దర్శనమి స్తోంది. ప్రస్తుతం టాటూలను ఎక్కువగా అమెరికా, ఐరోపాల్లో యువతరం పిచ్చిగా వేయించుకుంటున్నారు. శాశ్వతమైన మేకప్‌ లాగా కొంతమంది పచ్చ బొట్లు వాడుతున్నారు. టాటూస్‌ వచ్చాక పచ్చబొట్టు ప్రభ తగ్గిపోయింది. నగరాలు పట్టణాల్లో టాటూలు వేసే వారు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు.

టాటూస్‌! ఆధునిక అలంకరణలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఫ్యాషన్‌. బ్రాండెడ్‌ దుస్తులు, గాగుల్స్‌, పలురకాల హెయిర్‌ స్టయిల్స్‌, చెవిపోగులు, బ్రాస్‌లెట్‌...ఈ వరుసలో యువకుల అలంకరణలో టాటూలు వచ్చి చేరాయి. తెల్లని మెరిసే చర్మం మీద రంగురంగుల టాటూ చూడటానికి చాలా అందంగా కనబడుతుంది. ఇక అమ్మాయిలు కూడా నడుము, చేతులు, ఛాతీ ఇలా శరీరంలోని వివిధ భాగాలమీద టాటూలు వేయించుకుని తమ ప్రత్యేకతను, అభిరుచిని చాటుకుంటున్నారు. ఇది వరకు చేతిమీద మాత్రమే పండే గోరింట ఇప్పుడు ఒళ్లంతా పండుతోంది. యువతరంలో అత్యంత ఇమేజ్‌ తెచ్చుకుని తన హవా చూపిస్తున్న టాటూ వేసుకొన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ అది తొలగించాలంటే అంతే సులభమైన పని మాత్రం కాదు. దాన్ని హైడ్ చేయాలన్నా తొలగించాలన్నా అందుకు కొన్ని సులభ చిట్కాలున్నాయి.. అవేంటో ఒక సారి చూద్దాం..

Tattoos

లేజర్ ట్రీట్మెంట్: టాటూ తొలగించుకోవాలనే వాళ్ళ బాధను వైద్యులు అర్ధం చేసుకున్నట్టుకున్నారు. ఇందుకోసం కొత్తగా లేజర్‌ ట్రీట్‌మెంట్‌ను కనుగొన్నారు. ఖర్చు కూడా అతి తక్కువే. కేవలం రూ. 6 వేలు చెల్లిస్తే చాలు. 'క్యూ-స్విచ్‌డ్‌ ఎన్‌డి- యాగ్‌ లేజర్‌' అని పిలుస్తారు. కొత్తగా కనుగొన్న క్యూ స్విచ్‌డ్‌ లేజర్‌ విధానం వల్ల మంచి ఫలితం ఉంటుంది, ఇది ప్రస్తుతం ఢిల్లీలో తప్ప దేశంలో ఎక్కడా అందుబాటులో లేదు. ఈ లేజర్‌ ట్రీట్‌మెంట్‌ వల్ల కూడా ఎలాంటి సమస్య లేదని చెప్పలేమని హెచ్చరిస్తు న్నారు. టాటా తొలగింపుకోసం చేసే చికిత్సా పద్దతులు చర్మం పై పొరను తొలగించడం, వివిధ రకాల క్రీములను వాడడం, మరికొన్ని లేజర్‌ టెక్నిక్‌లు చర్మంపై అత్యంత ప్రభావాన్ని చూపుతాయి. అనుభవం లేనివారు ఈ పని చేస్తే చర్మంపై మచ్చ పడిపోవడంతోపాటు తీవ్ర హాని కలుగుతుందని లేజర్‌ స్పెషలిస్ట్‌ హెచ్చరించారు.

ఇంటెన్స్ పల్స్డ్ లైట్ థెరపీ: లేజర్ ట్రీట్మెంట్ కు ఇది ప్రత్యామ్నాయ పద్ధతి. టాటూలను విజయవంతంగా తొలగించవచ్చు. లేజర్ కు బదులుగా హై ఇంటెన్సిటి లైట్స్ ను ఉపయోగిస్తారు. మొదటగా, టాటూ వేసిన ప్రదేశంలో జెల్ ను అప్లై చేస్తారు. తర్వాత పచ్చబొట్టు ఉంచబడిన చోట పల్సెస్ ను విడుదల చేస్తారు. ఈ పద్దతి లేజర్ ట్రీట్మెంట్ కంటే తక్కువ నొప్పి కలిగి ఉంటుంది. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే IPLఖర్చు లేజర్ ట్రీట్మెంట్ కంటే ఎక్కువ ఉంటుంది.

టాటూ రిమూవల్ క్రీమ్స్: టాటూ వేసుకొన్న వారు టాటూ తొలగించుకోవడానికి ఖరీదైన లేదా నొప్పి కలిగించే పద్దతులకు దూరంగా ఉండాలనుకుంటే టాటూ రిమూవల్ క్రీమ్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రీములను అప్లై చేయడం వల్ల టాటూలు తొలగించుకోవడానికి కొంత సమయం ఎక్కువ పడుతుంది . అయితే ఇది చాలా ప్రభావంతమైన మరియు ఖర్చుకు అనుకూలమైన మార్గం. అయితే, మీరు ఖచ్చితంగా మంచి నాణ్యమైన టాటూ తొలగింపు క్రీములను ఎంపిక చేసుకోవాలి. నాణ్యత తక్కువ గల రసాయనిక క్రీములను ఎంపిక చేసుకోవడం వల్ల చర్మానికి హానికలిగిస్తుంది.

ఉప్పు నీళ్ళు: టాటూలను తొలగించుకోవడానికి లేజర్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టేంత డబ్బు మీ దగ్గర లేకపోతే లేదా టాటూ తొలగింపు క్రీముల మీద నమ్మకం లేనప్పుడు, మీరు ఒక మంచి హోం రెమడీని ప్రయత్నించవచ్చు. సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్ వల్ల సుదీర్ఘ కాలంలో మీ పచ్చబొట్టు వాడిపోవుటకు సహాయం చేస్తుంది. టాటూలను ఉప్పునీటితో శుభ్రం చేయడానికి ప్రదాన కారణం ఎటువంటి అంటు వ్యాధులు సోకకుండా మరియు టాటూ వేసుకొన్న ప్రాంతం సులభంగా శుభ్రం చేయడాని స్పాంజ్ ను సాల్ట్ వాటర్ లో వేసి రుద్దాలి. ఉప్పు నీటితో శుభ్రం చేసుకొన్న తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ మరియు బ్లీడింగ్ వంటి సమస్యలను నివారించవచ్చు.

English summary

Safe Ways To Remove Tattoos

So you want to remove that tattoo you got with so much enthusiasm. Since the tattoo epidemic started spreading, every Tom, Dick and Harry have gotten a tattoo. What was once something that made you stand out now makes you look desperate and wanna-be cool.
Story first published: Friday, June 28, 2013, 17:57 [IST]
Desktop Bottom Promotion