For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి చర్మ నివారణకు సాల్ల్ స్క్రబ్ తో చిట్కాలు

By Lakshmi Perumalla
|

సాదారణంగా ఉప్పు అనేది ఇంట్లో స్క్రబ్స్ తయారుచేయటానికి అత్యంత ప్రభావవంతమైన గొప్ప వస్తువు అని చెప్పవచ్చు. ఇది ప్రత్యేకంగా మీ చర్మం శీతాకాలంలో తరచూ పొడిగా మారినప్పుడు మరియు చనిపోయిన చర్మకణాలు పేరుకుని ఉన్నప్పుడు సహాయపడుతుంది. చర్మంపై మచ్చలు మరియు పొడి చర్మం వదిలించుకోవటానికి ఉప్పు మరియు ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే పదార్థాలను ఉపయోగించి కొన్ని మూలికా మరియు సహజ స్క్రబ్స్ తయారుచేసుకోవచ్చు. మీరు స్వేచ్ఛగా ఏ సమయంలో నైన పూర్తి చేయవచ్చు. అలాగే పార్లర్స్ కంటే చాలా తక్కువ వ్యయం అవుతుంది.

ఈ సహజ స్క్రబ్స్ మార్గం ద్వారా చర్మం మరియు తాజా చర్మం యొక్క పెరుగుదల చికిత్సలో చైతన్యం నింపటానికి సహాయం చేస్తుంది. ఉప్పు స్క్రబ్స్ మురికి మరియు చర్మంపై పేరుకున్న విషాన్ని తొలగించుట, పొడి మరియు మృత చర్మం తొలగించటానికి సహాయపడుతుంది. మురికితో మూసుకుపోయిన చర్మ రంద్రాలను శుభ్రం చేయటానికి స్క్రబ్ సహాయపడుతుంది. మీ చర్మంనకు ఒక కొత్త గ్లో ను ఇస్తుంది. చర్మం షెడ్ అవటం,డెడ్ స్కిన్ పొరలు తొలగించడం మరియు కొత్త చర్మం పెరగటం కొరకు మార్గాలను అనుమతిస్తుంది.

ఇంట్లో ఉప్పు స్క్రబ్స్ తయారీ కొరకు షియా వెన్న,కొబ్బరి నూనె, ఆలివ్ నూనె మొదలైన తేమ గల వస్తువులు పొడి చర్మం పొరలు తొలగించిన తర్వాత ఆర్ద్రీకరణ స్థితిలో మీ చర్మంను ఉంచటానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఈ దినుసులు మీ చర్మంనకు పోషక విలువలు అందించడంలో సహజంగా సహాయపడతాయి. కొత్త చర్మం బాదం నూనె,మూలికలు,వోట్మీల్,గ్రేప్ సీడ్ వంటి మొదలైనవి పదార్థాలు నుండి పోషకాలను స్వీకరిస్తాయి.

Salt scrub recipes for dry skin

1. హెర్బల్ సముద్ర ఉప్పు స్క్రబ్

కావలసిన పదార్థాలు:

a. 1 పెద్ద ఎండిన హెర్బ్ (ఏదైనా)

b. 2-3 టేబుల్ స్పూన్ల సముద్ర ఉప్పు

c. ½ టీస్పూన్ ఆలివ్ నూనె (లేదా కొబ్బరి నూనె)

d. 4 టేబుల్ స్పూన్ల నీరు

ఒక కల్వంలో మీకు నచ్చిన ఒక హెర్బ్ తీసుకోని రోకలితో మెత్తగా పొడి చేయండి. దీనిలో సముద్ర ఉప్పు వేసి మరింత మెత్తగా చేయండి. ఇప్పుడు నీటిని వేసి బాగా కలపాలి. చివరగా ఆలివ్ నూనెను కలపండి. అంతే ఇది మీ చికిత్స కోసం సరిపోతుంది.

2. సాధారణ ఉప్పు స్క్రబ్

కావలసిన పదార్థాలు

a. ఎంపిక చేసిన ఉప్పు

b. ఎంపిక చేసిన ఆయిల్ (ఆలివ్,కొబ్బరి మొదలైనవి)

c. సుగంధ ద్రవ్యాలు

మీరు సముద్ర ఉప్పు, ఎప్సోమ్ ఉప్పు, కోషెర్ ఉప్పు లేదా పాత టేబుల్ సాల్ట్ లలో దేనినైనా ఎంచుకోవచ్చు. సాధారణంగా టేబుల్ సాల్ట్ చౌకగా ఉంటుంది. అంతేకాక చిన్న రేణువులుగా ఉంటుంది. ఒక కూజాలో మీ చర్మ రకం మరియు మీకు అందుబాటులో సరిపోయే విధంగా నచ్చిన నూనెతో ఉప్పును కలపాలి. ఆలివ్ నూనె,కొబ్బరి నూనె,బాదం నూనె,నువ్వుల నూనె మొదలైన నూనెలు చర్మంనకు మంచివి. పిప్పరమెంటు,లావెండర్,నారింజ వంటి సుగంధ ద్రవ్యాలలో ఒకదానిని ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న సెంట్ ను కొన్ని చుక్కలు కలపండి. మోకాలికి మరియు మోచేయి వంటి కఠినమైన ప్రాంతాలకు రాయండి. మీ చర్మం తేమ మరియు మృదువుగా మారాక స్నానం చేయండి.

3. డెడ్ సీ ఉప్పు స్క్రబ్

కావలసిన పదార్థాలు:

a. 4 ఔన్సుల కొబ్బరి నూనె

b. 1 ఔన్సుల షియా వెన్న

c. 3 ఔన్సుల ద్రవ నూనె (బాదం,కాస్టర్,జొజోబా,ఆలివ్ ...)

d. 1/3 ఔన్సుల మైనం

e. 16 ఔన్సుల సముద్ర ఉప్పు

f. ఎంపిక చేసిన 1/2 tsp సుగంధ తైలం (ఇష్టమైతే)

ఒక గాజు కంటైనర్ తీసుకోని కొబ్బరి నూనె,షియా వెన్న ద్రవ నూనె, మైనం వేసి అన్ని కలపాలి. ఒక డబల్ బాయిలర్ ఉపయోగించి ఆ పదార్ధాలను మెల్ట్ చేయాలి. తర్వాత వేడి తొలగించి సుగంధ తైలం మరియు సముద్ర ఉప్పు కలపాలి.

4. వోట్మీల్ & తులసి సముద్ర ఉప్పు స్క్రబ్

కావలసిన పదార్థాలు

a. 2 cups సముద్రపు ఉప్పు

b. 1/2 కప్పు వండని వోట్మీల్

c. 1/2 కప్పు పుదీనా నూనె

d. 1/2 కప్పు ఆలివ్ నూనె

e. 5-10 డ్రాప్స్ తులసి సుగంధ తైలం

స్వచ్ఛమైన పొడి గిన్నెలో ఉప్పు,వోట్మీల్ మరియు నూనెలను వేసి ఒక స్పూన్ తో బాగా కలపాలి. కొన్ని చుక్కల తులసి సుగంధ తైలం వేసి బాగా కలపాలి. దీనిని గాజు కూజాలో భద్రపరుచుకోండి. శరీరంపై ఎక్స్ ఫ్లోట్ ఉన్నప్పుడు ఓదార్పు కొరకు ఉపయోగించండి.

English summary

Salt scrub recipes for dry skin

Salt is a great ingredient to make some simple and highly effective homemade scrubs. It specially helps during winter when your skin gets dry quite often and accumulates dead skin.
Desktop Bottom Promotion