For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించుట, చర్మసౌందర్య వృద్దిలోనూ తేనె ఫస్ట్!

By Super
|

కొన్ని చుక్కల తేనే మీ చర్మంపై అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? మీరు టీ లో చక్కెర బదులుగా తేనెను వాడవచ్చు. అంతేకాక అందం కొరకు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తేనే మీ చర్మంపై వచ్చే వాపుకు ఉపశమనం కలిగిస్తుంది. దాని యాంటీ బాక్టీరియా మరియు హైడ్రేట్ లక్షణాలు వల్ల వయస్సుకు తగ్గ శక్తి మరియు మచ్చలను తగ్గిస్తుంది.

కేవలం చర్మం పైనే కాకుండా జుట్టు మీదకూడా తేనేను ఉపయోగించవచ్చు. మీ చర్మంపై మరియు జుట్టు కోసం మంచి ఆహారంగా తినడానికి ఆరోగ్యకరమైన ఒక 'సూపర్ పదార్ధం' గా తేనెను చెప్పవచ్చు. ప్రధానంగా మీ అందం సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుంది. జుట్టు మరియు చర్మం రెండిటి కొరకు ఇంట్లో తయారు చేసుకొనే కొన్ని తేనె ప్యాక్స్ గురించి తెలుసుకుందాము.

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

సిల్కీ జుట్టు కోసం: మీరు ముఖ్యంగా వర్షాకాలం సమయంలో సిల్కీ జుట్టు కొరకు మీ జుట్టుకు ఈ ప్యాక్ ను ఉపయోగించండి. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు,రెండు గుడ్లు,నిమ్మకాయ రసం మరియు ఐదు చుక్కల తేనె వేసి బాగా కలపండి. అప్పుడు మీరు ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు బాగా పట్టించండి. ఒక అరగంట తర్వాత శుభ్రంగా నీటితో వాష్ చేయండి.

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

ప్రకాశవంతమైన జుట్టు : తేనె ఉపయోగించి మరొక జుట్టు ప్యాక్ ను తయారుచేసుకోవచ్చు. ఆలివ్ నూనె లో తేనెను కలిపి మీ జుట్టుకు బాగా రాయండి. కొంత సమయం తర్వాత చల్లని నీటితో శుభ్రం చేస్తే జుట్టు ప్రకాశవంతముగా మారుతుంది.

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

అవాంఛిత వెంట్రుకలు: మీ ముఖంపై ఉన్న అవాంఛిత వెంట్రుకలను తొలగించుకోవాలంటే మీరు ఇంటిలోనే ప్రయత్నం చేయవచ్చు. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ తేనె,ఒక టేబుల్ స్పూన్ చక్కెర మరియు కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మృదువైన పేస్ట్ గా తయారుచేయండి. ఇప్పుడు మూడు నిమిషాలు మైక్రోవేవ్ లో వేడి చేయండి. ఎక్కువ వేడిగా కాదు. ఈ పేస్ట్ ను మీ ముఖం మీద వెంట్రుకలు పెరుగుతున్న దిశలో రాయండి. ఇప్పుడు ఒక క్లాత్ ముక్క తీసుకోని దాని మీద పెట్టి దానికి వ్యతిరేక దిశలో లాగాలి. అప్పుడు వెంట్రుకలు తొలగించబడి మీ ముఖం సుదీర్ఘకాలం పాటు వెంట్రుకలు లేకుండా ఉంటుంది.

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

చర్మంపై మచ్చలు: చర్మంపై మచ్చలు లేకుండా నునుపుగా ఉండాలంటే ఈ ప్యాక్ వేసుకోండి. ఒక గిన్నె తీసుకోని దానిలో తేనే,శనగ పిండి,మాలై,చందనం,రోజ్ ఆయిల్ అన్నింటిని బాగా కలిపి ముఖంనకు, మెడకు రాయాలి. కొంత సమయం అయిన తర్వాత అది బాగా ఆరి ఒక పొరలాగా ఉడిపోతుంది. అప్పుడు మలినాలు తొలగించబడి మీ చర్మం నునుపుగా,మృదువుగా ఉంటుంది. మీరు మంచి ఫలితాల కోసం వారంలో ఒకసారి తప్పకుండా ఈ ప్యాక్ ను వేసుకోవాలి.

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

చర్మశుద్ధి: సూర్యరశ్మి కారణంగా మీ చర్మానికి కలిగే పరిణామాలకు తేనే ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో తేనె,పాల పొడి,నిమ్మరసం మరియు బాదం నూనె సమాన పరిమాణంలో కలపాలి. ఆ మిశ్రమాన్ని మీ ముఖం మీద మరియు చేతులు మొదలైన వాటి మీద రాసి 20 నిమిషాలు తర్వాత శుభ్రంగా కడగాలి.

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

. కాలిన మచ్చలు : కాలిన మచ్చల మీద తేనే రాస్తే తేనెలో క్రిమినాశక లక్షణాలను కలిగి ఉండుట వల్ల తొందరగా నయం చేస్తుంది. ఈ విధంగా తేనే రాయుట వల్ల సాదారణంగా చాల తక్కువ మచ్చలు ఏర్పడతాయి.

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

మొటిమలు: చర్మంపై మొటిమలు వస్తే చాలా విసుగు మరియు ఇబ్బందికరముగా ఉంటుంది. వాటిని వదిలించుకోవటం కష్టం. అందువల్ల తేనె మరియు దాల్చిన చెక్క పొడి కలిపి పేస్ట్ చేయండి. దానిని మీ ముఖంపై మొటిమలు ఉన్న ప్రదేశంలో రాత్రిపూట రాసి ఉదయం మోస్తరు నీటితో కడగాలి.

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

జుట్టు, చర్మ సమస్యలకు తేనెతో శాశ్వత పరిష్కారం!

తేనె సులభంగా దుకాణాలలో అందుబాటులో ఉంటుంది.కానీ మీరు ఒక మంచి బ్రాండ్ ను కొనుగోలు చేయండి. చాలాసార్లు తేనెలో మలినాలు మరియు బెల్లం లేదా చక్కెర సిరప్, నీటిని కలిపి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుటవల్ల మీరు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. తేనె స్వచ్ఛమైనది అవునా కాదా అని పరీక్షించడానికి ఒక మంచి మార్గం ఉన్నది. స్వచ్ఛమైన తేనె ఎప్పటికి అధిక చిక్కదనము,జిగురు కలిగి ఉంటుంది. మీ తేనె జాడీని చీమలు ఆకర్షిస్తూ ఉంటే స్వచ్ఛమైన తేనె అని అర్దము. కానీ సమీపంలో చీమలు లేకపోతె అప్పుడు మలినాలతో ఉందని అర్దము. తనిఖీ చెయ్యడానికి మరో అంశం ఇది స్పటికములాగా ఉంటే అది చక్కెర కలిపినదని అర్దము. అయితే ఈ సంకేతాలను చూసి మీరు ఒక మంచి బ్రాండ్ కలిగిన తేనెను కొనుగోలు చేయండి.

English summary

Say goodbye to hair and skin problems with honey

Did you know that little drops of honey could work wonders for your skin? You may have substituted your sugar for honey in tea, now reap in its beauty benefits as well.
Desktop Bottom Promotion