For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిడ్డు చర్మం నివారించడం కోసం చాలా సింపుల్ టిప్స్

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆయిల్ స్కిన్ సమస్యను ఎదుర్కొంటున్నారు . చర్మం ఆయిల్ అధికంగా ఉన్నప్పుడు, మొటిమలు, మచ్చలు మరియు ఇతర చర్మం సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. చర్మం అదనపు నూనెను ఉత్పత్తి చేయడానికి అనేక కారణాలున్నాయి. టీనేజర్స్ లో ఆయిల్ స్కిన్ ఏర్పడటానికి ప్రధాన కారణం హార్మోనుల్లో మార్పులు. అదేవిధంగా వేడి, అధికంగా స్మోక్ చేయడం, ప్రెగ్నెన్సీ, మోనాపాజ్ మొదలగునవి ఆయిల్ స్కిన్ కు ప్రధాన కారణాలు.

కారణం ఏదైనప్పటికి, ఆయిల్ స్కిన్ ఒక చిరాకు తెప్పించే ఒక బాధాకరమైన సమస్య. మీ చర్మం మొటిమలు మొదలుకొని, చర్మ రంధ్రాల వరకూ మరియు చర్మానికి మేకప్ దీర్ఘ సమయం ఉండదు. కాబట్టి, మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, చర్మంలో అదనపు నూనెను సమర్థవంతంగా వదిలించుకోవడా చాలా అవసరం. మీరు ఒక ప్రకాశవంతమైన మెరిసే చర్మం పొందడానికి మీరు కొన్ని క్లెన్సింగ్స్ మరియు మెటిక్యులస్ ఉపయోగించి ప్రకాశవంతమైన మరయిు మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

ఆయిల్ స్కిన్ నివారించడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఈ క్రింది స్లైడ్ లో ఇస్తున్నాం..వాటి పరిశీలించి జిడ్డు చర్మాన్ని వదిలించుకోండి.

ముఖం శుభ్రం చేసుకోవాలి:

ముఖం శుభ్రం చేసుకోవాలి:

ముఖంలో అదనపు నూనెను తొలగించుకోవడానికి, మీరు కనీసం రోజుకు రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకోవాలి. అందుకు గోరువెచ్చని నీరు లేదా జెల్ బేస్డ్ క్లెన్సర్ ఉపయోగించి జిడ్డును తొలగించుకోవచ్చు. అలాగే ఫ్రీక్వెంట్ గా ముఖంను శుభ్రం చేయకండి అలా చేస్తే ముఖ చర్మంలోని నేచురల్ మాయిశ్చరైజర్ ను తొలగిస్తుంది.

మీ చర్మ తత్వానికి సరిపోయే స్కిన్ ప్రొడక్ట్స్:

మీ చర్మ తత్వానికి సరిపోయే స్కిన్ ప్రొడక్ట్స్:

వాటర్ బేస్డ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఆయిల్ గా ఉండవు. ఇవి మీ చర్మంలో ఏర్పడే సెబమ్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఆల్కహాల్ తో తయారుచేసిన టోనర్స్ ను చర్మ సంరక్షణకు ఉపయోగించకండి. ఇవి మీ చర్మాన్ని మరింత డ్రైగా మరియు రఫ్ గా మార్చుతాయి. అందుకు మ్యాట్ ఫైయింగ్ లోషన్స్ మరియు నేచురల్ మాయిశ్చరైజర్స్ ను ఉపయోగించండి.

లిక్విడ్ మేకప్ ను నివారించండి:

లిక్విడ్ మేకప్ ను నివారించండి:

పౌడర్ బేస్డ్ కాస్మోటిక్స్ ను ఉపయోగించాలి. ఇవి మీ ముఖంలో మ్యాట్ లుక్ ను అంధిస్తాయి. లిక్విడ్ మేకప్ వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోవడం లేదా చర్మంలో కళంకాన్ని ఏర్పడేట్లు చేస్తుంది. కాబట్టి లిక్విడ్ మేకప్ ను నివారించండి.

ఎక్స్ ఫ్లోయేట్:

ఎక్స్ ఫ్లోయేట్:

రెగ్యులర్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడం వల్ల మీ చర్మం నుండి డెడ్ స్కిన్ సెల్స్ నివారించబడుతుంది . మొటిమల వల్ల చర్మంలో రంద్రాలను ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. మట్టితో మాస్క్ వేసుకోవడం వల్ల మీ చర్మంలోని అదనపు ఆయిల్ ను నివారిస్తుంది. ఈ మాస్క్ లో కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ వేసి మాస్క్ వేసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా ఆయిల్ చర్మాన్ని నివారిస్తుంది. టీట్రీ ఆయిల్ ఒక అద్భుతమైన ఆస్ట్రిజెంట్, యాంటీసెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.

డైట్ :

డైట్ :

మీరు జిడ్డు చర్మ తత్వం కలిగి ఉన్నట్లైతే, ఆయిల్ స్కిన్ నివారించడానికి , ఎక్కువ కూరగాలయను, పండ్లను మరియు జ్యూసులను తినడానికి ప్రయత్నించండి . వీటితో పాటు చిరు ధాన్యాలు, పప్పులు మరియు ప్రోటీన్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో జోడించండి .

ఒత్తిడి తగ్గించుకోవాలి:

ఒత్తిడి తగ్గించుకోవాలి:

అధిక ఒత్తిడి వల్ల హార్మోనుల అసమతుల్యత ఏర్పడుతుంది మరియు శరీరంలో అధనపు నూనెల విడుదల అవ్వడానికి కారణం అవుతుంది . అందువలన మీరు సాధ్యమైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు మెడిటేషన్ మరియు యోగా వంటివి చేసి, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

English summary

Simple Tips To Get Rid Of Oily Skin

Many women experience problems with oily skin. Acne, pimples and such related problems arise due to too much of oil on the skin. There are a number of factors which causes skin to produce excess oil. In teenagers, oily skin is usually the result of hormonal changes.
Story first published: Friday, November 15, 2013, 12:46 [IST]
Desktop Bottom Promotion