For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్ధాప్యం ఆలస్యం చేయడానికి స్కిన్ డిటాక్స్ డైట్..!

|

చాల మంది బరువు తగ్గించుకోవడానికి డైట్ ను ఫాలో అవుతుంటారు. లోక్యాలరీ డైట్ తీసుకోవడం వల్ల కొన్ని పౌండ్లు మీరు తగ్గుతారు. కానీ, డైట్ అనేది డైరెక్ట్ గా బరువు తగ్గించే సంబంధం కలిగి ఉండదు. ఉదాహరణకు, డైట్ లో వివిధ రకాల డైట్ లు ఉన్నాయి. డయాబెటిస్ డైట్, బరువుతగ్గించే డైట్, స్కిన్ డిటాక్స్ డైట్ ఇలా..వివిధ రకాల కారణాలతో మీరు వివిధ రకాలైన డైట్ ను మీరు ఫాలో కావచ్చు. అందులో స్కిన్ డిటాక్స్ డైట్. ఇది వయస్సు మీద పడకుండా చేసే డైట్.

ముందు డిటాక్స్ అంటే ఏమిటి? సాధారణ స్నానం కన్నా సబ్బులతో రుద్దిన దానికన్నా ... డిటాక్స్ ట్రీట్ మెంట్ తో చర్మం ఎంతో పరిశుభ్రపడుతుంది. స్కిన్ ప్రొస్(చర్మ రంధ్రాలు) ఓపెన్ అయ్యి డీప్ గా లోపల ఉన్న మురికిని, టాక్సిన్స్ కు బయటకు పంపుతుంది. చర్మంపై ఉండే dead cells కూడా తొలగించబడతాయి. డిటాక్స్ కారణంగా ఉత్పన్నమయ్యే వేడిమి... కండరాల నొప్పుల్ని ... తగ్గిస్తుంది.'డిటాక్స్' ఫలితంగా శరీరంలో హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చర్మాన్ని పరిశుభ్రపరుస్తుంది. చర్మానికి మంచి గ్లో ఇస్తుంది. చెమట ద్వారా ఎన్నో టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. చర్మం మంచి మృధుత్వాన్ని పొందుతుంది. మొటిమలు, మచ్చలు రాకుండా రక్షిస్తుంది.

శరీరానికి, చర్మానికి రక్షణ కల్పించేందుకు డైట్ కూడా ఉంది. దాన్ని స్కిన్ డిటాక్స్ డైట్ అనిపిలుస్తారు. దీన్నే యాంటీఏజింగ్ డైట్ అని కూడా పిలవచ్చు. ఈ డిటాక్స్ డైట్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం, శరీరంలోని మలినాలు(వ్యర్థాలను )తొలగిస్తుంది. చర్మం ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది. మీ శరీరంలోని టాక్సిన్స్ ను అంతమొందించవచ్చడం వల్ల మీరు సహజంగానే వృద్ధాప్యం ఆలస్యం చేయవచ్చు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది సెలబ్రెటీలు స్కిన్ డిటాక్స్ డైట్ ను పాటిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ సెలబ్రెట జెన్నీఫర్ అనిస్టన్ మరియు బెయోన్స్ వంటి ఫేమస్ సెలబ్రెటీలు లెమన్ డిటాక్స్ డైట్ ను అనుసరించి, యవ్వనమైన చర్మ సౌందర్యాన్ని పొందారు.

అలాగే, ఈ యాంటీఎజింగ్ ఆహారాలు (డిటాక్స్ డైట్)వల్ల వృద్ధాప్యం ఆలస్యం చేయడంతో పాటు, బరువునుత కోల్పోవటానికి దారితీస్తుంది. శారీరంలో చాలా వరకూ టాక్సిన్ అనారోగ్యకరమైన కొవ్వులతో నిల్వ చేయబడతాయి. మరియు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి, అలాగే కొవ్వులను వదిలించుకోవటం కోసం ఈ డిటాక్స్ డైట్ చాలా బాగా సహాయపడుతుంది. స్కిన్ డిటాక్స్ డైట్ వల్ల శరీరంలోని క్యాలరీలను లెక్కింపు మరియు శరీరం శుభ్రపరచడం అద్భుతంగా సహాయపడుతుంది. వయస్సు మీదపడనియ్యకుండా ఆలస్యం చేయడం కోసం స్కిన్ డిటాక్స్ డైట్ లో మీరు తెలుసుకోవల్సిన కొన్ని బేసిక్ స్టెప్స్...

వృద్ధాప్యం ఆలస్యం చేసే స్కిన్ డిటాక్స్ డైట్.!

నిమ్మరసంతో రోజును ప్రారంభించండి: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనెతో మీ దినచర్య ప్రారంభించండి. ఈ మూడింటి మిశ్రం ఉదయం నిద్రలేవగానే పరగడుపున తీసుకోవడం వల్ల మీ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంతో పాటు పెద్ద ప్రేగు కదలికలను సాధారణంగా ఉంచి, మలినం తేలికగా విసర్జింపడానికి సహాయపడుతుంది.

వృద్ధాప్యం ఆలస్యం చేసే స్కిన్ డిటాక్స్ డైట్.!

ప్రాసెస్డ్ ఫుడ్ ను తీసుకోవడా తగ్గించాలి: మీ యాంటీఏజింగ్ డైట్ విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటే, మీరు మీ చర్మం యొక్క వయస్సును తెలుసుకొని ఉండాలి. ప్రాసెస్డ్ మరియు సెమీ కుక్కుడ్ ఆహారాలు మీ చర్మ వయస్సును తెలుపుతుంది. అంటే మీరు వయస్సు పైబడ్డవారిగా కనబడేలా చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఆహారాలను (డెలి మాంసాలు, కాల్చిన ఆహారాలు మరియు జంక్ ఫుడ్స్ )తీసుకోండి ఆపాలి.

వృద్ధాప్యం ఆలస్యం చేసే స్కిన్ డిటాక్స్ డైట్.!

సిట్రస్ మంచి ఆహారాలు: స్కిన్ డిటాక్స్ చేయడానికి సిట్రస్ ఫుడ్స్ చాలా మంచిది. కాబట్టి సిట్రస్ పండ్లు తీసుకోవడంతో పాటు వాటి రసాలను తరచూ తాగుతుండాలి . ప్రతి రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల ఇటు ఆరోగ్యానికి, అటు చర్మాన్నికి రెండింటికి మంచిది. ఇది తాగలేనప్పుడు తాజా ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు.

వృద్ధాప్యం ఆలస్యం చేసే స్కిన్ డిటాక్స్ డైట్.!

చెడు అవాట్లు మానుకోండి: కెఫిన్ మరియు నికోటిన్ వంటి వాటినికి మీరు బానిసలైతే మీరు స్కిన్ డిటాక్స్ డైట్ చేయలేరు. ఒక వేళ చేసినా నిరుపయోగమే. కాబట్టి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి. పొగతాగడం, మద్యం సేవించడం, కెఫిన్ కలిగిన పానీయాలు ఇవన్నీ కూడా మీరు వయస్సు మల్లేలా చేస్తాయి.

వృద్ధాప్యం ఆలస్యం చేసే స్కిన్ డిటాక్స్ డైట్.!

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రొకోలి, మరియు ఆకుకూరలు వంటివి చర్మానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ వెజిటేబుల్స్ లోని యాంటీఆక్సిడెంట్స్ రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకటి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తే, మరొకటి వయస్సును మీద పడనియ్యకుండా రక్షణ కల్పిస్తాయి.

వృద్ధాప్యం ఆలస్యం చేసే స్కిన్ డిటాక్స్ డైట్.!

నీళ్ళు: ప్రపంచంలో అత్యంత సహజసిద్దమైన వనరు నీరు. ఇది మన శరీరాన్ని శుభ్రపరచడం అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది . ఎప్పుడైతే మీరు తగినన్ని నీరు తాగుతారో అప్పుడు శరీరంలోని టాక్సిన్స్ తొలగించబడి, శరీరంతో పాటు చర్మం కూడా శుభ్రపడుతుంది.

వృద్ధాప్యం ఆలస్యం చేసే స్కిన్ డిటాక్స్ డైట్.!

జీర్ణక్రియకు సహాయపడే రసాలు: టాక్సిన్ మీ శరీరంలో జీర్ణం కావు. అలాగే నిల్వ ఉంటాయి. కాబట్టి, మీ జీర్ణక్రియను మంచి వర్కింగ్ కండీషన్ లో పెట్టుకోవాలి. అందుకు అల్లం, మరియు అజ్వైన్ వంటి వాటిని మీ భోజనం తర్వాత తీసుకోవడం ద్వారా మీ జీర్ణక్రియతో పాటు, శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడుతాయి.

వృద్ధాప్యం ఆలస్యం చేసే స్కిన్ డిటాక్స్ డైట్.!

మాప్లే సిరఫ్ థెరఫీ: స్కిన్ డిటాక్ కోసం డిమి మూర్, మాప్లె సిరఫ్ ను ఉపయోగించారు. ఒక చెంచా మాప్లే సిరఫ్ ను, గోరువెచ్చని నీటిలో వేసి ప్రతి రోజూ నాలుగు గ్లాసుల నీరు తీసుకోవాలి.

వృద్ధాప్యం ఆలస్యం చేసే స్కిన్ డిటాక్స్ డైట్.!

చక్ స్కిన్ కాంజెస్టింగ్ ఫుడ్స్: క్లియర్ స్కిన్ పొందడానికి మరియు మొటిమలు లేని ముఖం కలిగి ఉండటానికి చాలా మంది స్కిన్ డిటాక్స్ డైట్ ను ఫాలో అవుతారు. చర్మంలోని నూనె గ్రంథుల వల్ల మొటిమల రద్దీ పెరుగుదలకు కారణం అవుతుంది. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, అదనపు కొవ్వులు కలిగి ఉండే ఆహారాలు మరియు ఫాటీ ప్రోటీనులు కలిగిన మాంసం, చేపలు, క్రీమీ డైరీ ప్రొడక్ట్స్ ను తీసుకోవడం నివారించాలి.

వృద్ధాప్యం ఆలస్యం చేసే స్కిన్ డిటాక్స్ డైట్.!

హెర్బల్స్: చర్మాన్ని శుభ్రపరచడంలో కొన్ని మూలికలు చాలా శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు, కొత్తిమీర ఆకులు మీ చర్మం ప్రక్షాళ చేస్తుంది.

English summary

Skin Detox Diet To Delay Ageing

Most people go for a diet to lose weight. These end up being fad or low calorie diets that focus on making you lose pounds. But the meaning of the word diet is not directly associated with weight loss. For example, there are also skin detox diets.
Desktop Bottom Promotion