For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బైక్ ప్రయాణం చేసేవారి కోసం చర్మ&జుట్టు సంరక్షణ చిట్కాలు

|

చాలా దగ్గర ప్రదేశాలు ప్రయాణం చేయడానికి చాలా సాధారణ మార్గం బైకింగ్ లేదా సైక్లింగ్ . అలా ప్రయాణం చేసేవారిలో మహిళలున్నా వారు చర్మం సంరక్షణ గురించి అంతగా బాధపడరు. అలాగే నిటారుగా పడే సూర్యకిరణాల వైపే ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనం(బైక్)లో ప్రయాణం చేసేవారు, చర్మ సంరక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కఠిన సూర్య రశ్మి, కాలుష్యం, వర్షం, వాతావరణంలో వేడి, వంటివి వారి చర్మం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. ఇది అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది.

బైక్ లో ప్రయాణం చేసేవారు తరుచూ మొటిమలు, మచ్చలు, సన్ టాన్ మరియు డ్యామేజ్ స్కిన్ సమస్యలను ఎదుర్కోవడం చేస్తుంటాము. ఇంకా జుట్టు సమస్యలు కూడా జుట్టు పొడిబారడం, మరియు రఫ్ గా మారడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీ చర్మం మరియు జుట్టు కోసం ప్రత్యేకమైన సంరక్షణ పద్దతులను పాటించాలి.

సాధారణంగా చర్మం సంరక్షణలో ప్రాధమిక అంశాలైన క్లీనింగ్, టోనింగ్ మరియు మాయిశ్చరైజింగ్ వంటివి ముఖ్యంగా పాటించాలి. అలాగే బైకర్స్ చర్మం సంరక్షణ మరియు జుట్టు సంరక్షణ పద్దతులను పాటించిగలిగినప్పుడే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందగలరు.

చాలా మంది కాలేజీలకు మరియు ఆఫీసులకు వెళ్ళడానికి బైక్ లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అటువంటి వారికోసం ఇక్కడ కొన్ని చర్మ మరియు జుట్టు సంరక్షణ చిట్కాలను అందిస్తున్నాం. ఈ బ్యూటీ టిప్స్ స్త్రీలు మరియు పురుషులు ఇరువురికి ఉపయోగపడుతాయి...వీటిని అనుసరించి మీ అందాన్ని కాపాడుకోండి...

1. క్లెన్సింగ్:

1. క్లెన్సింగ్:

మీ చర్మ సంరక్షణ కొరకు ప్రతి రోజూ రెగ్యులర్ గా క్లెన్సింగ్ తో ప్రారంభించాలి. దాని వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తాయి.

2. టోనింగ్:

2. టోనింగ్:

చర్మ సంరక్షణలో పాటించాల్సిన మరో చిట్కా ఇది. ఈ చిట్కా బైకర్స్ కోసం మాత్రమే కాదు, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. టోనింగ్ వల్ల మొటిమలను నివారిస్తుంది మరియు తెరచుకొన్న చర్మ రంధ్రాలను మూసుకొనేలా సహాయపడుతుంది.

3. సన్ స్క్రీన్ లోషన్:

3. సన్ స్క్రీన్ లోషన్:

మీ చర్మ సంరక్షణకోసం స్కార్స్ ధరించినా, ధరించకపోయినా, బైకర్స్ మాత్ర వారి చర్మ సంరక్షణ కోసం, సన్ టాన్ నివారించడం కోసం, సన్ స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. సన్ స్క్రీన్ లోషన్ కళ్ళ చుట్టూ, ముఖం, మెడ, భుజాలు, చెవులు మరియు పాదాలకు అప్లై చేయాలి.

4. ఫౌండేషన్:

4. ఫౌండేషన్:

బైక్ నడిపే మహిళలు మరియు సైకిల్ తొక్కే వారు సన్ స్క్రీన్ రాసిన తర్వాత ఫౌండేషన్ క్రీమ్ రాసుకోవడం వల్ల చర్మానికి రక్షణ కల్పించవచ్చు.

5. చర్మాన్ని కప్పి ఉంచడం:

5. చర్మాన్ని కప్పి ఉంచడం:

కాలుష్యం మరియు గాలుల నుండి చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. దుమ్ము, ధూళి కణాలు అనేక చర్మ సమస్యలకు గురిచేసి, చర్మాన్ని రఫ్ గా మార్చుతాయి. కాబట్టి, బైకర్స్ స్కార్ఫ్ లేదా స్టోల్ తోటి ముఖంను కవర్ చేసుకోవాలి. ఫుల్ స్లీవ్ గ్లౌజ్ మరియు ప్యాంట్స్ ధరించిచాలి. దాంతో చర్మం బహిర్గతం కాకుండా ఉంటుంది.

6. లిప్ కేర్:

6. లిప్ కేర్:

మీ పెదాల మీద కూడా శ్రద్ద పెట్టడం చాలా అవసరం. పెదాలు చాలా త్వరగా ఎడిపోవడం, తడి ఆరిపోవడం, టానింగ్ వంటి సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి, పెదాలకు లిప్ స్టిక్ లేదా లిప్ గ్లాస్ అప్లై చేయడానికి ముందు ఎస్ పిఎఫ్ లిప్ బామ్ పెదాలకు అప్లై చేయండి.

 7. హెయిర్ కేర్:

7. హెయిర్ కేర్:

మీ జుట్టు సంరక్షణకోసం జుట్టును పైకి ముడు వేసి, హెల్మెంట్ పెట్టుకోవాలి. మహిళలు పోనీటైల్ , బ్రైడ్స్, పిన్స్ మరియు వ్రాప్స్ వంటవి చుట్టుకొని, జుట్టుకు రక్షణ కల్పించవచ్చు . డ్యామేజ్ ను అరికట్టవచ్చు.

8. ప్రయాణం చేసి వచ్చిన తర్వాత:

8. ప్రయాణం చేసి వచ్చిన తర్వాత:

ప్రయాణం చేసి వచ్చిన తరవ్ాత మీరు ఖచ్చితంగా మీ జుట్టును దువ్వుకోవాలి. ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇది ఖచ్చితంగా దుమ్ము ధూళిని నివారిస్తుంది. కాలుష్యం నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. చర్మ చికాకును తొలగిస్తుంది.

English summary

Skin n Hair Care Tips For Bikers

Biking and cycling are the most common ways of traveling. Even women do not bother about their skin and go out under the direct rays of the sun. Well, bikers need to take proper care of their skin. Wind, sun, rain, perspiration affects their skin. This prevents them from a lot of skin problems.
Desktop Bottom Promotion