For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ స్పాయిల్ చేసే కొన్ని విషయాలు

By Lakshmi Perumalla
|

సాధారణంగా మన చర్మ సమస్యలకు ప్రధాన కారణాలు సూర్యుడు, పొడి గాలులు మరియు కాలుష్యం అని చెప్పవచ్చు. కానీ IANS నివేదిక ప్రకారం, చర్మంనకు మరింత ముఖ్యమైన అనేక చర్మ స్పాయిలర్స్ ఉన్నాయి. ఆరోగ్య మరియు సంరక్షణ సంస్థ అయిన నాష్ డిటాక్స్ డెలివరీ యొక్క CEO మరియు స్థాపకుడు గీతా సిద్ధూ-రోబ్ శరీరం యొక్క అతిపెద్ద అవయవం అయిన చర్మం గురించి హాని కారకాల జాబితాను చెప్పెను.

హార్మోన్లు కూడా చర్మం స్పాయిలర్స్ గా పనిచేస్తాయి.మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిల మార్పులతో చర్మం లోపల ముఖ్యమైన మార్పులు కూడా జరగవచ్చు.ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి తగ్గి చర్మం పొరలు సన్నబడతాయి. ఈ విధంగా చర్మం ఆర్ద్రీకరణ,బలం ​​మరియు స్థితిస్థాపకత నిర్వహించలేకపోతుంది. మీరు చర్మం సంరక్షణ చిట్కాలను శోధిస్తు ఉంటే,కనుక ఇక్కడ యాంటీ స్పాయిలర్స్ యొక్క జాబితా ఉంది.

యాంటీఆక్సిడెంట్లు

యాంటీఆక్సిడెంట్లు

మీ ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు జోడించడం అనేది "ఫ్రీ రాడికల్స్" ఎదుర్కొనడానికి మరియు పోరాడటానికి ఉపయోగకరమైన చర్మ రక్షణ చిట్కాలలో ఒకటి. క్యారట్లు,చిలకడ దుంప,పాలకూర మరియు బ్లూ బెర్రీస్, నేరేడుకాయలు,కృష్ణ బెర్రీలు వంటి రంగుల కూరగాయలలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మరియు యాంతోసైనిన్లు సమృద్ధిగా ఉంటాయి.

పండ్లు

పండ్లు

మీ చర్మం మీద పండ్లను రాయటం వలన చర్మ రక్షణకు సహాయం చేస్తుంది. ఒక పండిన అవోకాడో పండును మెత్తగా చేసి ముఖానికి ప్యాక్ లా వేసి 15-20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. ఇది సహజ నూనెలు కలిగిన ఒక అత్యంత తేమ గల ప్యాక్. ఇది మార్దవకరమైన మరియు విటమిన్ E తో కూడిన తేమ లక్షణాలు కలిగి ఉంటుంది.

సన్ స్క్రీన్

సన్ స్క్రీన్

కనీసం 15 SPF కలిగి మంచి నాణ్యత గల సన్ స్క్రీన్ ను ఉపయోగిస్తే మీ చర్మం సంరక్షణలో సహాయం చేస్తుంది. ప్రత్యక్ష సూర్యకాంతి అనేది మీ చర్మంను పరిరక్షించటానికి ముఖ్యమైన చర్మ రక్షణ చిట్కాలలో ఒకటి.మీరు ప్రత్యక్ష సూర్యకాంతి పొందడానికి ఒక గంట ముందు సన్ స్క్రీన్ రాయాలి. అంతేకాక ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ రాయలని గుర్తుంచుకోండి.

ధూమపానం మానివేయాలి

ధూమపానం మానివేయాలి

ధూమపానం మీ చర్మంపై ముడుతల ఏర్పాటులో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

ధూమపానం వలన చర్మం పొరలలో చిన్న రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త ప్రవాహంను తగ్గిస్తాయి. తద్వారా ఆక్సిజన్ తగ్గి కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ కు నష్టం కలుగుతుంది. ఇలా అన్ని ఉపయోగకరమైన చర్మ రక్షణ చిట్కాలలో ధూమపానం మానివేయడం అనేది ఒకటి.

ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారం

ఒక సమతుల్య ఆహారం మీ చర్మం సంరక్షణ కోసం గొప్పగా పనిచేస్తుంది. మీరు చర్మం సంరక్షణ చిట్కాల కోసం ఎదురు చూస్తూ ఉంటే, మీరు చేయాల్సిన మొదటి విషయం ఏమిటంటే మీ ఆహారంలో చర్మం అనుకూలమైన ఆహారాలను చేర్చాలి. మీ ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉన్న ఆహారాలు, పండ్లు,కూరగాయలు,తృణధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్లు చేర్చండి. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారంనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అంతేకాక అనారోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రాసెస్ లేదా శుద్ధి పిండి పదార్ధాలు ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.

రిలాక్స్

రిలాక్స్

ఒత్తిడి హార్మోన్ల మీ చర్మంనకు గొప్ప శత్రువులుగా చెప్పవచ్చు. మీరు మీ రోజువారీ జీవితంలో కొన్ని చర్మ రక్షణ చర్యలు అమలు చేయలని అనుకుంటే,అప్పుడు సులభమైన మార్గం రిలాక్స్డ్ మరియు ప్రశాంతంగా ఉండటమే అని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన చర్మం మరియు ఒక ప్రశాంతమైన మనస్సు ప్రోత్సహించడానికి మరియు మీ ఒత్తిడి నిర్వహించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలి. వ్యాయామం మరియు యోగా మీ చర్మం సంరక్షణ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మీ చర్మం హైడ్రేట్

మీ చర్మం హైడ్రేట్

తగినంత నీరు త్రాగటం అనేది మీ చర్మ సంరక్షణ కోసం చాలా ముఖ్యం. మీ చర్మంను ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచటం అనేది ముఖ్యమైన చర్మ రక్షణ చిట్కాలలో ఒకటి. మీ చర్మంను తేమగా ఉంచటానికి మరియు చర్మం స్థితిస్థాపకత నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది ముడుతలను నిరోధిస్తుంది. అంతేకాక మీ చర్మం మృదువుగా మరియు యవనంగా ఉండేలా చేస్తుంది.

English summary

Skin spoilers to watch out for

Generally we consider exposure to sun, dry winds and pollution as the major culprits for skin problems. But, according to a report in IANS, there are other skin spoilers too, which makes skin are more important.
Desktop Bottom Promotion