For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు, మచ్చలను మాయం చేసే మసాలా టీ

|

సాధారణంగా చాలా మంది నిద్రలేవగానే(బెడ్ కాఫీ లేదా టీ) కాఫీ, టీ త్రాగందే...ఆ రోజు వారికి మొదలకాదు. టీ అంటే అంత పిచ్చ ప్రేమికులు కూడా ఉంటారు. మరికొందరైతే కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఎవరూ తోడులేకున్నా ఒంటరిగానే రోజుకు ఐదారు లేదా అంతకుమించి ఎక్కువ కప్పుల టీ తాగేవారున్నారు.

తలనొప్పి నుంచి నిరాశ దాకా ఎన్నిటినో తగ్గించడంలో దోహదకారిగా పేరుపడ్డ టీ యొక్క వైద్యపరమైన ప్రయోజనాలు పరిశోధనల ద్వారా ఇంకా వెలుగులోకి వస్తూనే వున్నాయి. టీ ఆరోగ్య పరంగానే కాదు బ్యూటీ పరంగా కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. టీ తాగడం వల్ల మాత్రమే కాదు, టీను బ్యూటీ వస్తువుగా ఉపయోగించి వివిధ రకాలుగా ఉపయోగించుకోవడా, అప్లై చేయడం వల్ల, టీతో ముఖం కడుక్కోవడం వంటి వాటి వల్ల కూడా అందానికి మేలు జరుగుతుంది.

అయితే, మార్కెట్లో వివిధ రకాల టీ ఫ్లేవర్స్ ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. లావెండర్ టీ, స్పైస్ టీ, నుండి నార్మల్ మిల్క్ టీ వరకూ అన్ని రకాల వంటి టీలను మీ చర్మ సంరక్షణకోసం ఉపయోగించుకోవచ్చు. మీ చర్మ సంరక్షణలో నేచురల్ రెమడీస్ ను ఉపయోగించడం వల్ల మొటిమలుల, మరియు నల్ల మచ్చలు వంటి అనేక చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ నేచురల్ రెమడిని చర్మ సంరక్షణకు ఉపయోగించడం వల్ల మీరు పెద్ద మొత్తంలో డబ్బును మరియు బ్యూటీ ప్యార్లర్ కు వెళ్ళే సమయాన్ని సేవ్ చేయవచ్చు. అంతే కాదు కృత్రిమంగా పొందే బ్యూటీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా చేస్తుంది.

మరి బ్యూటీ కోసం టీని ఏవిధంగా ఉపయోగించాలో క్రింది విధంగా కొన్ని ఉపయోగకరమైన పద్దతులను అంధివ్వడం జరింది. మరి టీ వల్ల బ్యూటీ బెనిఫిట్స్ ఎలానో తెలుసుకోండి..

బ్లాక్ టీ:

బ్లాక్ టీ:

అధిక కాలుష్యంను ఎదుర్కొనే వారు బ్లాక్ టీని ఎక్కువగా తీసుకుంటుంటారు. బ్లాక్ టీ వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే చర్మానికి కూడా చాలా మేలు జరుగుతుంది. బ్లాక్ టీని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలో అధికంగా ఉండే నూనె గ్రంథులను పూర్తిగా తగ్గిస్తుంది . దాంతో మీ ముఖం జిడ్డుగా ఉండదు. కాబట్టి వారంలో ఒక్కసారైనా బ్లాక్ టీతో ముఖంను శుభ్రం చేసుకోవాలి.

టీ:

టీ:

పాలతో తయారుచేసి టీ, పొడిబారిన చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు సాఫ్ట్ గా ఉంటుంది. మీరు డ్రై స్కిన్ తో బాధపడుతున్నట్లైతే వారంలో రెండు సార్లు టీతో ముఖాన్ని మసాజ్ చేయండి. ఈ నేచురల్ రెమెడీలో పాలు మిక్స్ చేయడం వల్ల మీ చర్మాన్ని ఖచ్చితంగా బేబీ సాప్ట్ స్కిన్ గా మార్చుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

చర్మం సంరక్షణకు ఇది ఒక బెస్ట్ టీ. గ్రీన్ టీను హెల్త్ బెనిఫిట్స్ వల్ల తాగడం మాత్రమే కాదు, డర్టీ స్కిన్ ను తొలగించుకోవడానికి, చర్మంలో మలినాలను తొలగించడానికి ముఖానికి గ్రీన్ టీని అప్లై చేయాలి. అరకప్పు గ్రీన్ టీ మీ ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల మీ చర్మం ఫ్రెష్ గా మరియు రిలాక్స్డ్ గా ఉంటుంది.

మసాలా టీ:

మసాలా టీ:

సుగంధ పరిమళాలించే లవంగం, చెక్క, లేదా లవంగాలతో తయారుచేసే మసాలా టీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. అరకప్పు ప్లెయిన్ టీలో ఈ మసాలదినుసుల్లో ఏదో ఒకదాన్ని అరగంట పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత కాటన్ బాల్స్ ను ఈ టీలో డిప్ చేసి ముఖం మీద మసాజ్ చేయడం వల్ల మొటిమలు మరియు మచ్చల నుండి విముక్తికలిగిస్తుంది.

హెర్బల్ టీ:

హెర్బల్ టీ:

మీ చర్మంలో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ హెర్బల్ టీని మీ చర్మం సంరక్షణకోసం ఉపయోగించుకోవడం మర్చిపోకండి . గోరువెచ్చని హెర్బల్ టీ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చర్మ సంరక్షణకు సెజ్ హెర్బల్ టీ చాలా గొప్పది.

రోజ్ టీ:

రోజ్ టీ:

ముఖం చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు మెరిసేలా చేసే బ్యూటీ వస్తువుల్లో రోజ్ చాలా గొప్ప వస్తువు. మీకు కనుక ఆయిల్ స్కిన్ ఉన్నట్లైతే రోజ్ టీ ఈ సమస్యను తగ్గిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా, ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు మీరు రోజ్ టీతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఊలాంగ్ టీ:

ఊలాంగ్ టీ:

ఊలాంగ్ టీలో అనేక బ్యూటీ ప్రయోజనాలు దాగున్నాయి. ఊలాంగ్ టీ చాలా ఖరీదైనది కూడా, కానీ దీన్ని మీరు రెండు వారాలకొకసారి మీ చర్మానికి ఉపోగించడం వల్ల చర్మంలో మంచి గ్లో వస్తుంది.

వైట్ టీ:

వైట్ టీ:

స్వచ్చమైన టీలలో వైట్ టీ ఒకటి. వైట్ టీ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ టీని పదిహేను రోజులకొకసారి ముఖం మరియు మెడకు మసాజ్ చేయడం వల్ల, మీ చర్మం ఛాయ మెరుగుపడటంలో మార్పును మీరు గమనించగలరు.

బాదం టీ:

బాదం టీ:

బాదం చర్మానికి చాలా మంచిది. బాదంలో టీలో ఉండే జింక్ మరియు క్యాల్షియం కూడా చర్మం సంరక్షణకు చాలా ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఈ టీలో ఈ రెండు పోషకాంశాలు చర్మంలోని మలినాలను పూర్తిగా తొలగించి ఫెయిర్ నెస్ ను అంధిస్తాయి. ఉదయం నిద్రలేవగానే బాదం టీని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

ఫ్లేవర్డ్ టీ:

ఫ్లేవర్డ్ టీ:

ఫ్రూట్స్ తో తయారుచేసే టీలు రుకరంగా మాత్రమే కాదు, మంచి ఫ్లేవర్ ను కలిగి ఉంటాయి. ఈ ప్లేవర్డ్ టీని మీ ముఖానికి ఉపయోగించడం వల్ల ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తంది.

English summary

Tea Benefits For Skin Care


 There are a number of tea benefits for the skin, which many of us are not aware of. When we mention tea benefits, we do not mean consuming the tea! By tea benefits, we are actually talking about applying tea on your face or rinsing your face with it.
Story first published: Wednesday, September 25, 2013, 13:02 [IST]
Desktop Bottom Promotion