For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు నల్లగా ఉన్నారా?ఐతే తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్ మీకోసం

|

అందంగా సౌందర్యంగా కనబడుటలో చర్మ ఛాయ కూడా ఒక కారణం. చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి కొన్నిసులభమైన వంటింటి చిట్కాలు మనందరకీ తెలుసుంటాయి. చర్మాన్ని రక్షించుకోవడానికి తెల్లగా మారడానికి కొన్ని క్రీములను, హోం మేడ్ ఫేస్ ప్యాక్ లు మరియు స్ర్కబ్బింగ్స్ వంటి ఎన్నో ప్రయోగాలను మన చర్మరంగును మార్చుకోవడానికి, చర్మంలో మెరుపు తీసుకు రావడానికి ప్రయత్నించి ఉంటాం. అయితే సహజపద్దతిలో ఆరోగ్యకరమైన చిట్కాలను పాటించడం వల్ల చర్మం ఛాయను తెల్లగా మరియు ప్రకాశించే విధంగా మార్చుకోవచ్చు.

సాధారణంగా మేము తరచూ ఆరోగ్యం గురించి మరియు న్యూట్రీషియన్స్ గురించి సలహాలిస్తుంటాం. ఆహారాల్లో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, విటమిన్స్ అధికంగా ఉన్న పండ్లు మొదలగు వాటి గురించి ఎన్నో వ్యాసాలు ప్రచురించాం. అవికూడా చర్మ సంరక్షణలో భాగాలే. చర్మం మెరవడానికి, ఛాయ మారడానికి బాగా సహాయపడేవే. అయితే చర్మ సంరక్షణలో ఆహారంగా తీసుకొనే ఆ ఆహారాలతో పాటు ఎక్కువగా నీరు, ద్రవాలను త్రాగడంతో పాటు వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తుండాలి . ద్రావాలు లేదా నీరు శరీరంలోని మలినాలు, విషాలను బయటకు నెట్టివేసి చర్మాన్ని శుభ్రపరచి, చర్మం మెరిసేలా చేస్తాయి. ఇక వ్యాయామాలు రెగ్యులర్ గా చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం మెరిసేలా, సున్నితంగా, పట్టులా మెరిసేట్లు నేచురల్ గా జరుగుతుంది.

కాబట్టి రసాయనాలతో కూడిన ఫేస్ ప్యాక్స్, ఫేస్ స్క్రబ్స్ ఉపయోగించకుండా మీరు సహజపద్దతిలో తెల్లని చర్మ ఛాయను పొందాలనుకుంటే, కొన్ని హెల్తీ స్కిన్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోండి. వీటిలో విటమిన్ ఎ మరియు సి మరియు అధిక శాతంలో న్యూట్రీషియన్స్ ఉండి చర్మ ఛాయను పెంచడానికి బాగా ధోహదం చేస్తాయి. అందులో చర్మ రంగుపై ప్రభావితం చేసే ప్రోసెస్డ్ పుడ్స్ మరియు మొటిమలు మచ్చలకు కారణమయ్యే ఆయిల్స్ ఫుడ్స్ ను మినహాయించబడినది. మరి చర్మ సౌందర్యాన్ని పెంచే ఆ పవర్ ఫుల్ ఆహారాలేంటో ఒక్క సారి చూద్దామా...

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

క్యారెట్స్: క్యారెట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. కాబట్టి మెరిసేటటువంటి చర్మ సౌందర్యం పొందాలనుకుంటే ప్రతి రోజూ క్యారెట్ తినడం కానీ, లేదా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ చేయాలి.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

బొప్పాయి: బొప్పాయిలో విటమిన్ సితో పాటూ విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ లు మరియు చర్మసౌందర్యానికి ఉపయోగపడే యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచడంలో, డెడ్ స్కిన్ తొలగించి, ముడతలు, మచ్చలు మాయంచేయడంలో అద్భతంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఫేస్ ప్యాక్ గాను, ఫేస్ స్ర్కబ్ గాను ఉపయోగించవచ్చు. దీన్ని తినడం వల్ల చర్మ మంచి రంగు మాత్రమే కాదు మహిళల రుతుక్రమాన్ని క్రమం చేస్తుంది.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

టమోటో: ఈ తాజా, జ్యూసీ టమోటోలో లైకోపేన్(ఇది శరీరంలోని చేరిన తర్వత కెరోటిన్ గా మారుతుంది) అధిక శాతంలో ఉంటుంది. ఇది చర్మ రంగును మార్చడమే కాదు, అధిక బరువును తగ్గించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

కివి: కివి ఇది ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సహజంగా చర్మ ఛాయను మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ కివి పండును తాజాగా తినవచ్చు. మరియు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముఖంలో రంద్రాలు తొలగిపోయి, ముఖ్యం బ్యూటిఫుల్ గా కనబడుతుంది.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

బీట్ రూట్: రూట్ దుంపల్లో అధిక శాతంలో ఐరన్ మరియు విటమిన్స్ ఉండి, చర్మగ్రంధులను శుభ్రం చేయడానికి, రక్త ప్రసరణ జరగడానికి, ముఖంలో పింక్ గ్లో తేవడానికి సహాయపడుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగాలి. అలాగే దీన్ని ఫేస్ ఫ్యాక్ గా కూడా వేసుకోవచ్చు.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్/ఆకుకూరలు: గ్రీన్ వెజిటేబుల్స్ చాలా పవర్ఫుల్ ఫుడ్. ఇది చర్మ రక్షణ, సౌందర్యానికి మాత్రమే కాదు,మొత్తం శరీరానికే మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆ పవర్ ఫుడ్ లో విటమిన్స్, మినిరల్స్, న్యూట్రీషియన్స్ తో నిండి ఉంటుంది.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

స్ట్రాబెర్రీస్: ఈ జ్యూసీ సిట్రస్ ఫ్రూట్ లో అధిక శాతంలో విటమిన్ సి ఉండి. చర్మానికి మంచి మెరుపుతో పాటు తెల్లగా మార్చుతుంది. చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ ఫ్రూట్ ను ఆహారంతో పాటు తీసుకోవచ్చు. అలాగే ఫేస్ ప్యాక్ కూడా వేసుకోచ్చు.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

రెడ్ బెల్ పెప్పర్: ఎర్రని వెజిటేబుల్స్ అంటే రెడ్ బెల్ పెప్పర్(ఎర్రని క్యాప్సికమ్)వంటి వాటిలో అధిక శాతంలో లైకోపిన్ తో పాటు విటమిన్ సి ఉండటం వల్ల చర్మ రంగును మార్చడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

గ్రీన్ టీ: గ్రీన్ టీ ఒక హేర్బల్ డ్రింక్. ఇది నిజంగా చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సూర్యరశ్మినుండి చర్మాన్ని కాపాడుతుంది. ఇంకా చర్మాన్ని సున్నితంగా మార్చి. డార్క్ చర్మాన్ని వైట్ గా చేసి మచ్చలు లేకుండా కాపాడుతుంది.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

ఎల్లో బెల్ పెప్పర్: ఎల్లో బెల్ పెప్పర్ సి విటమిన్ అధికంగా ఉండే స్కిన్ ఫ్రెండ్లీ ఫుడ్. అంతే కాదు నేచురల్ యాంటీ ఎజింగ్ ప్రొండక్ట్. ఇందులో సిలికా అధికంగా ఉండటం వల్ల చర్మం రంగు మారి మెరిసేలా చేసి, వైబ్రాంట్ స్కిన్ అందిస్తుంది.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

సోయా ప్రొడక్ట్స్: సోయా ప్రొడక్ట్ లో కూడా విటమిన్ సి తో పాటు జింక్ కూడా అధికంగా ఉంటుంది. సోయా మిక్క్ మొటిమలు, మచ్చలు పోగొట్టి, చర్మసమస్యలను దూరం చేస్తుంది. నిర్జీవమైన చర్మాన్ని తాజాగా చేసి ఫ్రెష్ గా మార్చుతుంది. కాబట్టి సేయాబేస్డ్ ప్రొడక్ట్ , సోయా పాలు తాగడం మంచిది.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

బ్రొకోలి: కాలీఫ్లవర్ లా ఉండే ఈ గ్రీన్ వెజిటేబుల్ చర్మా ఛాయను నేచురల్ గా మార్చేస్తుంది. ఇందులో విటమిన్ సితో పాటు విటమిన్ ఇ మరియు యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల చర్మం శుభ్రపడి, కొత్త మెరుపులను తీసుకొస్తుంది.

తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

ఫిష్: ఫిష్ లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్సియల్ విటమిన్ప్ అధికంగా ఉండి చర్మం ఎల్లపుడూ తేమగా ఉండేలా చేస్తాయి. చర్మం మెరిసేలా, కాంతివంతంగా మార్చుతాయి. కాబట్టి వైట్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి చేపలు మీ ఆహారంలో చేర్చుకోవాలి.

English summary

Top 13 Power Foods To Get White Skin | తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్

We all want to know many remedies to get white skin easily and effectively. Be it creams, homemade face packs or scrubs, we try numerous ways to bring a white glow to our complexion. However, a healthy lifestyle is one of the primary remedies to get white and glowing skin naturally.
Desktop Bottom Promotion