For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ సౌందర్యాన్ని పాడుచేసే 7 చెడు అలవాట్లు

By Super
|

చర్మాన్ని అతిగా ఎక్స్ ఫోలియేట్ చేయడం నుంచి ఆశుభ్రంగా వున్న మేకప్ కిట్ వాడడం దాకా మీరు నివారించాల్సిన సాధారణ చర్మ దోషాలు ఇవిగో. రోజంతా బాగా అలసిపోయాక రాత్రికి మొహం కడుక్కోకుండా ఎన్నిసార్లు మానేస్తాం? లేదా ఎక్స్పైరీ డేట్ కనీసం చూడనైనా చూడకుండా ఎన్నిసార్లు పాత మేకప్ కిట్ లు కొని వుంటాం?

మంచి ఆరోగ్యానికి మొదటి సంకేతం మెరిసే యవ్వనవంతమైన చర్మం, స్త్రీల చర్మ దురలవాట్ల వల్ల జరిగే లోపాల జాబితా ఇదిగో :

 పొగ తాగడం :

పొగ తాగడం :

ఇది చర్మాన్ని పాడు చేసే అతి పెద్ద నేరాల్లో ఒకటి. పొగ తాగడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ తగ్గిపోవడమే కాకుండా మీ చర్మం, రక్తం నేరుగా విషపదార్ధం ప్రభావానికి గురౌతాయి. పైగా, ఈ అలవాటు చర్మం మీద ముడతలు తెచ్చి, మొద్దు బారేలా చేస్తుంది. పదేళ్ళ పాటు పొగ తాగితే, రెండున్నరేళ్ళ వయసు పెరుగుతుందని పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి.

వేడి నీటి స్నానం చేయడం :

వేడి నీటి స్నానం చేయడం :

నిజానికి ప్రతి వారికి చాలా సేపు వేడి నీళ్ళ స్నానాలు చేయడానికి ఇష్ట పడతారు, కానీ అది హాయిగానే వున్నా, అది మీ మొహం మీది చర్మాన్ని బాగా పాడు చేస్తుంది. మొహం మీది చర్మం సున్నితంగా వుంటుంది, వేడి నీటి వల్ల నరాలు బలహీనపడి, మొహం మీద పొడి చర్మం వచ్చి ఎర్రబారుతుంది. ఈసారి మీకు వేడి నీటి స్నానం చేయాలనిపిస్తే మీ మొహం మీది చర్మం గురించి జాగ్రత్త తీసుకోండి.

మద్యపానం :

మద్యపానం :

ఇది చాలా ప్రమాదకరమైనది. రోజూ తాగే అదనపు మద్యం వల్ల స్త్రీలలో బ్రెస్ట్ కాన్సర్ ప్రమాదం సగటున ఆరు శాతం పెరుగుతుదని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి, మొత్తం మీద ఏటా 5000 కాన్సర్ మరణాలు కూడా మద్యపానం వల్లనే జరుగుతాయి. చర్మం మీద వుండే దుష్ప్రభావం వల్ల కూడా మద్యానికి దూరంగా వుండడం మంచిది. అతిగా మద్య పానం వల్ల మొహం మీద చర్మం మొద్దు బారడమే కాక చర్మంలో తేమ పోయి, సహజ తైలాలు పోయి పొడిగా తయారౌతుంది. మద్యపానం మొహం మీది రక్తనాళాలు పల్చగా అయిపోయేలాగా చేసి, ఒక్కోసారి పగిలిపోయి శాశ్వత హాని జరుగుతుంది.

మురికిగా వుండే మేకప్ బ్రష్ ల లాంటివి వాడడం :

మురికిగా వుండే మేకప్ బ్రష్ ల లాంటివి వాడడం :

మీ మేకప్ కిట్ ను శుభ్రం చేసుకునే శ్రమ కూడా మీరు తీసుకోకపోతే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి దారి తీసే మొటిమల లాంటివి వస్తాయి. అందువల్ల వారానికి ఒక సారి బ్రష్ లను మృదువైన షాంపూ తో కడిగి రాత్రంతా ఆరబెట్టాలి.

హాయిగా నిద్ర పోక పోవడం :

హాయిగా నిద్ర పోక పోవడం :

చర్మవైద్యుల ప్రకారం నిద్ర లేమి వల్ల వత్తిడి కలిగి, మొటిమలు, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు కలుగుతాయి. ఎనిమిది గంటల నిద్ర ప్రతి వారికీ అవసరం ఎందుకంటే రాత్రి పూట శరీరంలో పగటి పూట పాడైన కణాలు పునరుత్తేజితం అయ్యేది అప్పుడే.

మొటిమలు గిల్లడం :

మొటిమలు గిల్లడం :

మొటిమలు గిల్లాలని బాగా అనిపిస్తుంది, కానీ దాని వల్ల అవి చర్మంలో మరింత లోపలి వెళ్తాయి. బాక్టీరియా రంధ్రాలలో లోపలికి పోయి ఇన్ఫెక్షన్ కలుగజేసి బాగా మొటిమలు, మచ్చలు పడిపోతాయి. మురికి, తైలం కూడా మొటిమలకు కారణం కావచ్చు, అందుకని ఒక మృదువైన ఫేస్ వాష్ తో రోజుకు రెండు సార్లు చర్మాన్ని శుభ్రం చేసుకోండి.

నిత్యం ఫోన్ లో మాట్లాడడం :

నిత్యం ఫోన్ లో మాట్లాడడం :

నమ్మండి, నమ్మకపోండి, మీ ఫోన్ మీ చర్మాన్ని పాడు చేస్తుంది. మీ చెక్కిలిని ఫోన్ కి ఆనించి వుంచడం, ఫోన్ శుభ్రంగా, బాక్టీరియా రహితంగా వున్నా లేకపోయినా మొటిమలకు దారి తీస్తుందని ఒక అధ్యయనం చెప్తోంది. ఫోన్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడి, రాపిడి మొటిమలకు దారి తీస్తుంది.

English summary

Top skin sins you commit everyday

From over exfoliating to using an unclean makeup kit, here are common bad skin habits that must be avoided How often one skips washing our face at night due to a tired day? Or even buy older makeup without casting a glance at its expiry date?
Desktop Bottom Promotion