For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిల్కీ వైట్ స్కిన్ పొందాలంటే.. ఇవి తినాల్సిందే...

|

ఎక్కువగా మహిళలకు అందమైన ముఖ సౌందర్యం ఉంటే అందరూ చాలా బాగుందంటారు. దీనికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది విటమిన్లు చర్మాన్ని తాజాగా వుంచుతాయి. చర్మ సౌందర్యానికి సహజసిద్ధంగా ప్రకృతి అందించే ఆకుకూరలు, కూరగాయలు పండ్లలో ఉండే ఎన్నో పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే తీసుకునే చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే ప్రొటీన్లు గల చేపలు, పౌల్ట్రీ, కోడిగుడ్లు, బీన్స్, పప్పులు, సోయా, మాంసం వంటివి రెగ్యులర్ గా తీసుకోవాలి.

ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారంతోనే మనకు శక్తి చేకూరుతుంది. అంతే కాదు... మనలోని రక్షణ వ్యవస్థ అయిన వ్యాధి నిరోధకశక్తిని కల్పించేది కూడా మనం తీసుకునే ఆహారమే సహాయపడుతుంది. అన్ని పోషకాలతో కూడిన మంచి ఆహారం మనల్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి కోటగోడలాంటి మొదటి అవయవం.. చర్మం. మరి అంత కీలకపాత్ర పోషించే చర్మ ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారం గురించి, చర్మానికి మంచి చేసే పదార్థాల గురించి తెలుసుకోవల్సిన అవసంర ఎంతైనా ఉంది... చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దీర్థకాలంతో పాటు యవ్వనంగా కనిపించడానికి ఈ ఆహారం దోహదపడుతుంది. ఆ ఆహార వివరాలను పరిశీలిస్తే..

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

యాపిల్ యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

ఆరెంజ్: ఆరెంజ్ అరటి, నారింజ, జామ వంటి తాజా పండ్లలో అన్నిరకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

అవొకాడో: అవొకాడో పండు తినడానికి మాత్రమే కాదు. అవొకాడోలో బయోటిన్ పుష్కలంగా ఉన్నందు వల్ల, దీని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల పొడిబారిన చర్మాన్ని, చిట్లిన కురులను, చిట్లిన గోళ్ళ సంరక్షణ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడైతే ముఖానికి అప్లై చేస్తామో అప్పటి నుండి చర్మం తేమగా మారి కాంతి వంతంగా మారుతుంది.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

దానిమ్మ: చర్మ సంరక్షణలో మరొక ఆరోగ్యకరమైన ఆహారం దానిమ్మ. దానిమ్మ గింజలను పేస్ట్ చేసి ముఖానికి రాయడం వల్ల ఇందులోని యాంటిఆక్సిడెంట్ చర్మ పగుళ్ళ నుండి కాపాడి, చర్మాన్ని ఎల్ల వేళలా తేమగా ఉంచుతుంది.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

బొప్పాయి: చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పా యి గుజ్జు తో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీస్ తీసుకోవడం ద్వారా నిత్య యవ్వనులుగా ఉండొచ్చునని ఓ పరిశోధనలో తేలింది.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

కివి: కివి ఇది ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సహజంగా చర్మ ఛాయను మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ కివి పండును తాజాగా తినవచ్చు. మరియు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముఖంలో రంద్రాలు తొలగిపోయి, ముఖ్యం బ్యూటిఫుల్ గా కనబడుతుంది.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

తాజా టమోటోలు తాజాగా దొరికే టమోటోలు చర్మ సంరక్షణలో ఉపయోగపడుతాయంటే ఆశ్చర్యమే. ఎందుకంటే టమోటోలను తినడం వల్ల కొల్లెజాన్ ఉత్పత్తి చేస్తుంది. టమోటో గుజ్జులో లైకోపిన్ అధికంగా ఉండటం వల్ల సన్ బర్న్ నుండి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి టమోటో గుజ్జును ఆలివ్ ఆయిల్ తో చేర్చి ముఖానికి పది వారాల పాటు అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

బాదాం, చేపలు అవిశలు: బాదం, చేపలు, అవిశగింజల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. చేపల్లో ఉన్న ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ చర్మానికి బాగా ఉపయోగపడుతుంది.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

వాల్ నట్స్: ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒక్క ఫిష్ లో మాత్రమే కాదు వాల్ నట్స్ లో కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో వాల్ నట్స్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల చర్మం నునుపుగా మారడమే కాకుండా కురులకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. దాంతో యంగ్ గా కనబడేలా చేస్తుంది.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

గ్రీన్ టీ: గ్రీన్ టీతో బరువు తగ్గడమే కాదు.. చర్మ కాంతిని కూడా పెంచుకోవచ్చు. గ్రీన్ టీలో చర్మ సంరక్షణకు కావలసినన్ని ఫోలిఫినోల్స్ కలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఫ్రెష్ గా, తేమగా ఉండేలా కాపాడుతుంది. కాబట్టి రోజులు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీకి తాగడానికి అవకాశం ఇవ్వండి.

వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

గుడ్లు: గుడ్లు ఇది ఒక పౌష్టికాహరం. కోడిగుడ్లలో జింక్ అధికంగా ఉంటుంది. జింక్ చర్మానికి కాంతివంతంగా ఉంచేందుకు బాగా సహయపడుతుంది.

English summary

Twelve Best Foods to get Milky White Skin | వీటితో మిల్కీ వైట్ స్కిన్ సాధ్యం....

Another tip to whiten our skin is to eat food containing abundant vitamin C, such as fresh date, tomato, orange and green vegetables, etc. Vitamin C is one of the earliest additive agents used in skin whitening products. It can be made use of to solve many skin problems like making our skin white and resilient.
Story first published: Monday, February 4, 2013, 18:41 [IST]
Desktop Bottom Promotion