For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో చర్మ సమస్యలను ఎలా నివారించాలి

By Super
|

చర్మ సంరక్షణ విషయానికి వచ్చేసరికి పురుషులు శ్రద్ద పెట్టకపోవటం ఇకపై ఉండదు. ఎందుకంటే నేటి పురుషులు ప్రకాశించే అందమైన చర్మం కలిగి ఉండటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శీతాకాలంలో చర్మ సంరక్షణ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సాదారణంగా పురుషులకు చర్మం పొడిగా మారటం, పొరలుగా ఊడటం వంటివి జరుగుతూ ఉంటాయి. అందువలన చల్లగా ఉన్నప్పుడు శీతాకాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ చర్మంపై తేమ లేకపోవడం వలన మీ ముఖం మరియు మీ శరీరం యొక్క ఇతర భాగాలలో తెల్లని దురద పాచెస్ ఏర్పడతాయి.

మీరు మీ శరీరంనకు మాయిశ్చరైజింగ్ లోషన్లు రాయటం ద్వారా తేమ ఉండేలా చేయవచ్చు. పురుషుల చర్మం మహిళల కంటే కఠినముగా ఉంటుంది. అందువలన పురుషులు కోసం తయారుచేసిన ఫార్ములాలకు ప్రాధాన్యత ఇస్తారు. మహిళలకు ఉద్దేశించబడిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా ఔషదాలు తక్కువ ప్రభావం కలిగి ఉంటాయి. అప్పుడు మళ్ళీ మీరు మీ ముఖమునకు మరియు మిగిలిన శరీరంనకు ఉద్దేశించబడిన రెండు వేర్వేరు లోషన్లు ఎంచుకోవచ్చు. మీ శరీరం యొక్క మిగిలిన చర్మంతో పోలిస్తే మీ ముఖ చర్మం విభిన్నంగా ఉంటుంది.

మీ పెదవులు తేమగా మరియు మృదువుగా ఉండటానికి మాయిశ్చరైజింగ్ బామ్స్ రాయటానికి సిగ్గుపడవద్దు. ఈ విధంగా చేయుట వలన మీ పెదవుల చర్మం పొరలుగా ఊడటం మరియు పగుళ్లు తగ్గుతాయి. చల్లని వాతావరణం కారణంగా పెదవులు ఆరిపోకుండా ఉండటానికి రాత్రి పూట మాయిశ్చరైజింగ్ క్రీం రాయాలి. శీతాకాలంలో మర్చిపోకుండా ఉండవలసిన విషయం ఏమిటంటే చల్లదనం మిమ్మల్నిఆర్ద్రీకరణ స్థితిలో ఉంచుతుంది. అందువలన అనేక చర్మ సమస్యలు వస్తాయి.

మొటిమలు

మొటిమలు

చల్లని వాతావరణం కారణంగా చర్మం పొడిగా మారుతుంది. మొటిమలతో బాధపడుతున్న పురుషులు శీతాకాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. పొడి కారణంగా మరియు తైల గ్రంథుల బ్రేక్ అవుట్ ఫలితంగా మరింత చమురు ఉత్పత్తి అవుతుంది.

చర్మం పొరలుగా ఊడుట

చర్మం పొరలుగా ఊడుట

చల్లటి వాతావరణం కారణంగా మీ చర్మం పొరలుగా ఊడి మీ చర్మమును వేగంగా పొడిగా మరియు దురద కలిగించే చర్మ పాచెస్ గా మారుస్తుంది. మీ చర్మం ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచేందుకు మరియు డెడ్ చర్మం శుభ్రం చేయడానికి రెగ్యులర్ గా ఎక్స్ ఫోలియట్ చేయటం ముఖ్యమైనది అని చెప్పవచ్చు.

పగిలిన పెదాలు

పగిలిన పెదాలు

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా మీ పెదవులు పొడిగా మారి పెదాలు పగులుతాయి. ఈ సమస్యను తగ్గించటానికి కొన్ని మాయిశ్చరైజింగ్ లిప్ బామ్స్ ను ఉపయోగించాలి.

చేతులు

చేతులు

చేతుల వెనుక వైపు చర్మం పల్చగా మరియు మృదువుగా ఉంటుంది. చల్లని వాతావరణం కారణంగా చర్మం పొడిగా మారటం,పగుళ్లు మరియు ముడుతలు ఏర్పడతాయి. అందువలన చేతులు తేమగా ఉంచటానికి చేతి తొడుగులు వాడటం ముఖ్యం.

సన్ స్క్రీన్

సన్ స్క్రీన్

శీతాకాలంలో SPF లోషన్లు వాడటం మంచిది. చల్లని వాతావరణము కారణంగా మీ చర్మం పొడిగా మారటం మరియు సూర్యుని నుండి రక్షించడానికి తక్కువ SPF లోషన్లు వాడాలి.

ఆవిరి స్నానాలు మానుకోండి

ఆవిరి స్నానాలు మానుకోండి

హాట్ ఆవిరి స్నానాలు లేదా షవర్ స్నానాలు హాయిగా ఉంటాయి. అయితే అప్పటికే పొడిగా మారిన చర్మంనకు ఎక్కువ నష్టం కలుగుతుంది. తేమను నిలిపి ఉంచడానికి గోరు వెచ్చని తేలికపాటి నీటిని ఉపయోగించండి.

మోకాలు మరియు మోచేయి

మోకాలు మరియు మోచేయి

మోకాలు మరియు మోచేతి మీద ముడుతలు ఉండుట వలన శీతాకాలంలో అదనపు జాగ్రత్త అవసరం. దానిని తేమగా మరియు మృదువుగా ఉంచడానికి షియా వెన్న,పెట్రోలాటమ్,మినరల్ ఆయిల్,టీ ట్రీ ఆయిల్ లేదా గ్లిసరాల్ కలిగిన ఉత్పత్తులను ఉపయోగించాలి.

పాదాల సంరక్షణ

పాదాల సంరక్షణ

శీతాకాలంలో మీ పాదాలు ఆరిపోయి మడమల్లో చాలా వేగంగా పగుళ్లు వస్తాయి. సుదీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే నొప్పి మరియు బాధాకరంగా ఉంటుంది. చిక్కని మాయిశ్చరైజర్ రాసి మరియు ఎల్లప్పుడూ సాక్స్ ను ఉపయోగించి కవర్ చేయండి.

తలపై చర్మం

తలపై చర్మం

తలపై చర్మం మీద సంరక్షణ ఎప్పుడు జుట్టుకు సంబంధించినది కాదు. శీతాకాలంలో చుండ్రు మరియు తలపై చర్మం మీద దురద కలిగిస్తుంది. దాని ఫలితంగా పొడి జుట్టు సమస్యలను ఎక్కువగా తీసుకువస్తుంది. మీ జుట్టు పొడిగా లేకుండా ఉండటానికి మాయిశ్చరైజింగ్ కండీషనర్ ను ఉపయోగించండి.

హైడ్రేషన్

హైడ్రేషన్

శీతాకాలంలో తగినంత నీరు త్రాగకపోతే హైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. మీకు శీతాకాలంలో చెమట పట్టక పోయినప్పటికీ మీ చర్మం మరియు శరీరంనకు హైడ్రేషన్ చాలా అవసరం. అందువల్ల మీరు శీతాకాలంలో మృదువుగా మరియు సులభంగా కదలటానికి నీరు తప్పనిసరిగా త్రాగాల్సిన అవసరం ఉంది.

English summary

Winter skin problems to avoid

Men no longer are outcast when it comes to skin care. Today’s men take pride and care in having a glowing and good looking skin.
Desktop Bottom Promotion