For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల కోసం 10 ప్రభావ వంతమైన షేవింగ్ చిట్కాలు

|

పురుషులు చూడటానికి శుభ్రంగా,చక్కగా,మర్యాదగా ఉండాలని అనుకుంటే తప్పనిసరిగా ప్రతి రోజు షేవింగ్ చేయవలసిన అవసరం ఉంది. ఇది అద్భుతం కాదు. కానీ మీరు మంచిగా షేవింగ్ చేసుకుంటే గొప్ప ముద్దు మీకు ఎందుకు రాదు? అలాగే,ప్రతి మనిషి ఇటువంటి అసాధారణ పరధ్యానం ఉన్నా ప్రేమతో ఒక అద్భుతమైన ముద్దును కోరుకుంటారు. కానీ మీరు ఈ పనులను చేయాలంటే కఠినమైన గడ్డానికి దూరంగా ఉండాలి. కేవలం అప్పుడు మీరు దానిని చేయలేరు. మీరు ఎందుకు షేవింగ్ చేయరు.

మహిళలు చక్కగా మరియు స్మార్ట్ గా ఉన్న పురుషులను ఎక్కువగా ఇష్టపడతారని అందరికి తెలిసిన సంగతే. పురుషులకు అనేక షేవింగ్ చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే చర్మం మృదువుగా,నునుపుగా మరియు చక్కగా ఉండటానికి సహాయపడతాయి.

ఈ వ్యాసంలో పురుషులు కోసం 10 ప్రభావ వంతమైన షేవింగ్ చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు,షేవింగ్ నూనెలను ఉపయోగించటం,బ్రష్ ఉపయోగించటం,క్రీం ను వలయాలుగా వ్యాప్తి చెందించటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే చల్లని నీటికి బదులుగా వేడి నీటిని వాడాలి.

ఇక్కడ పురుషులకు అత్యంత సమర్థవంతమైన 10 షేవింగ్ చిట్కాలు ఉన్నాయి. వీటిని మీరు పాటించటం వలన మీ ముఖ చర్మం మృదువుగా,నునుపుగా మరియు చక్కగా సుదీర్ఘ కాలం ఉండటానికి సహాయపడుతుంది.

మీ ముఖ చర్మం స్థిరపడుతుంది

మీ ముఖ చర్మం స్థిరపడుతుంది

ఉదయం నడక తర్వాత, మీ చర్మం స్థిరపడేందుకు కొంత సమయం ఇవ్వటం ముఖ్యం. మీ చర్మం పొడి కారణంగా కొద్దిగా ఉబ్బినట్లు మరియు కఠినముగా ఉంటుంది. మీరు ముందుగా కొంచెం నీటిని ముఖం మీద చల్లుకుంటే మీ చర్మం స్థిరపడటం ప్రారంభమవుతుంది.

 వెచ్చని నీటిని ఉపయోగించాలి

వెచ్చని నీటిని ఉపయోగించాలి

చల్లని నీటికీ వ్యతిరేకంగా వెచ్చని నీటిని ఉపయోగించుట వలన చర్మం మొత్తం నిర్మాణం మరియు సున్నితత్వంనకు సంబంధించి మంచి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. అయితే వేడి నీరు అంటే గోరువెచ్చని నీరు అని అర్ధం. ఎందుకంటే వేడి నీటిని ఉపయోగిస్తే చర్మం చాలా పొడిగా తయారవుతుంది. స్నానం చేసే సమయంలో దీనిని దృష్టిలో పెట్టుకోవాలి.

ప్రతి రోజు షేవింగ్ చేయకూడదు

ప్రతి రోజు షేవింగ్ చేయకూడదు

మీరు ప్రతి రోజు షేవింగ్ చేయకూడదు. దానికి ప్రత్యామ్నాయంగా రోజు విడిచి రోజు షేవింగ్ చేసుకోండి. ప్రతి రోజు షేవింగ్ చేయుట వలన చర్మం ఉపరితలంపై ఉండే చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి.

ఒక షేవింగ్ బ్రష్ ఉపయోగించాలి

ఒక షేవింగ్ బ్రష్ ఉపయోగించాలి

క్రీమ్ వ్యాప్తి చెందటానికి ఒక షేవింగ్ బ్రష్ ఉపయోగించటం చాలా మంచిది. బ్రష్ చర్మం ఉపరితలం మెత్తదనం మరియు మీ ముఖం మీద షేవింగ్ క్రీమ్ సమానంగా పరచటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఒక బ్రష్ ఉపయోగించటం ద్వారా చర్మం ఎక్స్ ఫ్లోట్ జరగదు. నురుగు సులభంగా రావటం వలన వెంట్రుకలు బాగా కట్ అయ్యి షేవింగ్ సులభం అవుతుంది.

షేవింగ్ నెమ్మదిగా చేయాలి

షేవింగ్ నెమ్మదిగా చేయాలి

సాదారణంగా షేవింగ్ వేగంగా చేయుట వలన షేవింగ్ తర్వాత రేజర్ మంటలు వస్తాయి. అందువలన మీరు మీ షేవింగ్ ను నెమ్మదిగా చేయవలసిన అవసరం ఉంది. స్థిరమైన రేజర్ కదలికలు ఉంటే మృత కణాలను నిరోధిస్తుంది.

క్రీం ను వలయాలుగా వ్యాపి చెందించాలి

క్రీం ను వలయాలుగా వ్యాపి చెందించాలి

మీరు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన చిట్కా అని చెప్పవచ్చు. సాధారణంగా ముఖంపై జుట్టు పెరుగుదల వివిధ దిశల్లో జరుగుతుంది. అందువల్ల నురుగును వలయాలుగా సృష్టించడం ద్వారా షేవింగ్ సులభంగా మారుతుంది.

షేవింగ్ ఆయిల్ రాయాలి

షేవింగ్ ఆయిల్ రాయాలి

కొన్ని అధ్యయనాల్లో క్రీమ్ లేదా జెల్ తో పాటు ఒక షేవింగ్ ఆయిల్ ను ఉపయోగించుట వలన స్వచ్ఛమైన మరియు నునుపుగా షేవింగ్ చేయటానికి సహాయపడుతుందని తెలిసింది.

 పై పెదవి దగ్గర వెంట్రుకలు

పై పెదవి దగ్గర వెంట్రుకలు

పై పెదవి దగ్గర వెంట్రుకలను కూడా షేవ్ చేయాలనీ గుర్తుంచుకోండి. ఆ ప్రాంతంలో వెంట్రుకలు కఠినముగా ఉంటాయి. అందువల్ల ఫోమ్ లేదా క్రీమ్ జెల్ ఉపయోగించాలి. అప్పుడు పై పెదవి మీద ఉన్న వెంట్రుకలను సులభంగా షేవ్ చేయవచ్చు.

స్నానం చేసినప్పుడు షేవింగ్ చేయండి

స్నానం చేసినప్పుడు షేవింగ్ చేయండి

వేడి నీటి స్నానం చేసేటప్పుడు షేవింగ్ యొక్క ప్రయోజనాలు బాగుంటాయి. ఆవిరి వెంట్రుకలు మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే మృదువుగా షేవింగ్ చేయటానికి అనుమతి ఇస్తుంది.

మీ రేజర్ మంట తీవ్రముగా ఉంటే ఒక సున్నితమైన క్రీమ్ ను ఉపయోగించండి

మీ రేజర్ మంట తీవ్రముగా ఉంటే ఒక సున్నితమైన క్రీమ్ ను ఉపయోగించండి

రేజర్ మంటలను తగ్గించటానికి సున్నితమైన జెల్ లేదా క్రీమ్ ను ఉపయోగించటం మంచిది.

Desktop Bottom Promotion