For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

13 నేచురల్ హోం మేడ్ ఫేస్ ప్యాక్: తెల్లగా మారడానికి

|

చర్మానికి రక్షణ, టైట్‌నెస్‌, కాంతి, నిగారింపు ఇవ్వటంలో ఫేస్‌ప్యాక్‌ ఎంతో ప్రధానపాత్ర వహిస్తాయి. అనేక పండ్ల నుంచి ధాన్యాల నుంచి కాయగూరల నుంచి వీటిని చేసుకోవచ్చు. పైగా అలాంటి ఫేస్‌ప్యాక్స్‌ ఎంతో మంచివి, సురక్షితమైనవి కూడా. మంచి వన్నెని, చక్కటి కళను తెచ్చిపెడతాయి. చర్మాన్ని సౌందర్యవంతం చేస్తాయి. చర్మాన్ని శుభ్రం చేస్తాయి. చర్మ వ్యవస్థని బలోపేతం చేస్తాయి. పోషకాలు సమతుల్యంగా అందిస్తాయి.

ఫేస్ మాస్క్ చేసుకుంటే ఏమౌతుందో తెలుసా: క్లిక్ చేయండి

సాధారణంగా చర్మ సంరక్షణలో సహజసిద్దమైన ఫేస్ ప్యాక్ లు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రకృతిలోని సహజమైన తత్వాలతో తయారైన ఈ ఫేస్ ప్యాక్ లు ముఖ సౌందర్యాన్ని సంరక్షిస్తూ చర్మాన్ని ఆరోగ్యవంతంగా మెరిసేలా చేస్తాయి. వీటిల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇన్ని సుగుణాలున్న ఫేస్‌ప్యాక్‌లు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా!

ముఖ అందాన్ని రెట్టింపుచేసే రెడ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్:క్లిక్ చేయండి

 ఆపిల్‌మాస్క్‌

ఆపిల్‌మాస్క్‌

ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, గుడ్డులోని పచ్చసొన, ఒక టేబుల్‌ స్పూన్‌ ఎస్కోర్బిన్‌ ఆమ్లం, వెనిగర్‌, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె, వీటన్నింటిని ఒక బౌల్‌లో చేర్చి పూర్తిగా కలిసిపోయే వరకు కలిపి పేస్ట్‌లా చేయండి. ఆ తర్వాత ముఖానికి అప్ల§్‌ు చేయండి. మెడ చుట్టూ రాసుకోండి. ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీటితో వాష్‌ చేసుకోండి.

మడ్‌ మాస్క్‌

మడ్‌ మాస్క్‌

పుల్లర్స్‌ ఎర్త్‌, రెండుటేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ గ్లిజరిన్‌, టమోటా రసం. వీటన్నింటిని బాగా కలపాలి. కావలసినంత వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ముఖానికి పట్టించి బాగా ఆరిపోయాక ఇరవై నిమిషాలు అలానే ఉంచి ఆపై తాజా పాలతో ముఖాన్ని వాష్‌ చేసుకోండి. చర్మాన్ని మృదువ్ఞగా ఉంచ టంతో పాటు మంచి టైట్‌నెస్‌ని కూడా ఇస్తుంది. కొత్తగా ఫ్రెష్‌గా ఉంటుంది. మాస్క్‌లన్నింటిలోని అత్యుత్తమ మాస్క్‌ ఇది.

స్ట్రాబెర్రీస్‌

స్ట్రాబెర్రీస్‌

మూడు పెద్ద స్ట్రాబెర్రీలు. వీటిని బాగా చిదిమి గుజ్జుగుజ్జుగా చేయండి. దాన్ని ఫేస్‌కి మాస్క్‌లా వేసుకోండి.అరగంట సేపు ఉంచి తర్వాత వాటర్‌తో వాష్‌ చేసుకోండి. స్ట్రాబెర్రీలు కొంత ఆమ్ల త్వాన్ని కలిగి ఉండటంతో పాటు విటమిన్‌ సి కలిగివ్ఞంటాయి. విటమిన్‌ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

అవకాడో మాస్క్‌

అవకాడో మాస్క్‌

అవకాడో లోపల భాగాన్ని గుజ్జుగుజ్జుగా చేయండి. రసంలా చేసుకున్న తర్వాత ముఖానికి పట్టించండి. ఇరవై నిమిషాలు అలానే వ్ఞంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. మళ్లీ కొద్దిపాటి చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం సూక్ష్మరంధ్రాలు మూసుకొని పోతాయి. తద్వారా ముఖచర్మం ఆరోగ్యవంతంగా, సౌందర్యవంతంగా తయారవుతుంది

క్విక్‌ మాస్క్‌-శెనగపిండి లేద పెసరప పిండి

క్విక్‌ మాస్క్‌-శెనగపిండి లేద పెసరప పిండి

ఏదైనా రెండు టీ స్పూన్ల పిండిని తీసుకోండి. ఒక టేబుల్‌ స్పూన్‌ వేడిపాలు తీసుకోండి. ఆ రెంటిని మిశ్రమం చేయండి. పేస్ట్‌లా చేసుకున్న తర్వాత ముఖానికి, మెడకి రాయండి.అరగంట నుంచి పదినిమి షాల మధ్యలో ముఖం వాష్‌ చేసుకోండి. చర్మం మృదువ్ఞగా, బిగుతుగా తయారవుతుంది

బనానా మాస్క్‌

బనానా మాస్క్‌

బాగా పండిన ఒక అరటికాయను గుజ్జుగుజ్జుగా చేయండి. దానికి తగినంత తేనె కలపండి. పేస్ట్‌లా అయిన పదార్థాన్ని ముఖానికి రాయండి. ముఖ చర్మ సౌందర్యం కాంతివంతంగా తయారవుతుంది

ఆరెంజ్‌ మాస్క్‌

ఆరెంజ్‌ మాస్క్‌

కొంచెం ఆరెంజ్‌ జ్యూస్‌ని, పాలని తీసుకుని మిశ్రమంగా చేయండి. శుభ్రమైన కాటన్‌ తీసుకుని జ్యూస్‌ని ముఖానికి పట్టించండి. ఇలా రెగ్యులర్‌గా చెయ్యటం వల్ల ముఖ చర్మం మృదువ్ఞగా తయారవుతుంది

టమాటా ప్యాక్‌

టమాటా ప్యాక్‌

టమాటారసం ఒక అరకప్పు తీసు కోండి. ఒక టీస్పూన్‌ నిమ్మ కాయ రసం తీసుకోండి. రెండింటిని బాగా కలపండి. ఆమిశ్రమాన్ని ముఖానికి మెడకి రాసుకోండి. చల్లటినీటితో పదినిమిషాల తర్వాత కడగండి. కాంతివంతమైన చర్మంగా మారుతుంది.

ద్రాక్షప్యాక్‌

ద్రాక్షప్యాక్‌

రెండు లేదా మూడు ద్రాక్షపక్షని మధ్యకి కోసి ఒక్కో ముక్కని తీసుకుని ముఖంపై మెడపై రుద్దుకోండి. తర్వాత చల్లటి నీటితో వాష్‌ చేసుకోండి. ఎంత మార్పు. మీరే చూసుకోండి.

హనీ క్లెస్సింగ్‌ స్క్రబ్‌

హనీ క్లెస్సింగ్‌ స్క్రబ్‌

ఒక టీస్పూన్‌తేనె, రెండు టేబుల్‌ స్పూన్ల ఆల్మండ్‌ పొడి, అర టీస్పూన్‌ నిమ్మకాయ రసాన్ని బాగా కలిపి మిశ్రమంగా తయారుచేయండి. ఆ మిశ్రమం ముఖానికి అప్లయి చేయండి. ఇరవై నిమిషాల తర్వాత వాష్‌ చేసుకోండి.

 స్కిన్‌ మాయిశ్చరైజర్‌ -పెరుగు

స్కిన్‌ మాయిశ్చరైజర్‌ -పెరుగు

ఒకటేబుల్‌ స్పూన్‌ ఆరెంజ్‌ రసం, ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మ కాయ రసం, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగును బాగా కలపండి. మిశ్రమంలా చేసుకుని పేస్ట్‌లా వచ్చేలా చూసుకోండి. ఆ పేస్ట్‌ను ముఖానికి మాస్క్‌లా వేసుకోండి. అరగంట తర్వాత ఫేస్‌వాష్‌ చేసుకోండి. కావలసినంత నిద్రపోయి లేచినట్లు చక్కటి ఫ్రెష్‌నెస్‌ ముఖానికి, మనసుకి కూడా.

 డ్రై స్కిన్‌ మాస్క్‌-ఓట్ మీల్

డ్రై స్కిన్‌ మాస్క్‌-ఓట్ మీల్

ఇది పొడిచర్మం గలవాళ్లు మాత్రమే ఉపయోగించండి. బాగా ఉడకబెట్టిన ఓట్‌మీల్‌, తేనెలను బాగా కలిపి మిశ్రమముగా చేసి దాన్ని ముఖానికి పట్టించండి. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా, క్లెన్సర్‌ గానూ పనిచేస్తుంది. దీన్ని వేసుకోవటం వల్ల రెండు లాభాలు. ఒకటి కాంతివంతమైన చర్మం, రెండు చర్మ ఆరోగ్యం.

ట్యాంగిటోన్స్‌:పుదీనా

ట్యాంగిటోన్స్‌:పుదీనా

దోసకాయ సగం, పుదీనా రసం రెండు టేబుల్‌ స్పూన్స్‌, నిమ్మ కాయ రసం, రెండు లేదా మూడు చుక్కలు, దోసకాయని ముందుగా లిక్విడైజర్‌లో వేసి ద్రవంగా చేయండి. తర్వాత దాన్ని వడకట్టండి. దానితో పుదీనారసం కలపండి. నిమ్మకాయ రసం, వెనిగర్‌లను కూడా కలిపి మిశ్రమంగా చేయండి. తర్వాత దాన్ని వడకట్టండి. దానితో పుదీనారసం కలపండి. నిమ్మకాయ రసం, వెనిగర్‌లను కూడా కలిపి మిశ్రమంగా చేయండి. ఈ మిశ్రమంలో ఒక కాటన్‌గుడ్డను ముంచి దాంతో ముఖానికి పట్టించండి. ఇరవై నిమిషాలు వెయిట్‌ చేసి ముఖాన్ని వేడినీళ్లతో కడిగి ఓ రెండు నిమి షాలు గ్యాప్‌ ఇచ్చి వాటర్‌తో కూడా వాష్‌ చేసుకోండి. తెలిసిందిగా అందమైన ముఖానికి ఎలా ఫేస్‌ప్యాక్‌లను తయారుచేసుకోవాలో. ఆలస్య మెందుకిక. వెంటనే తయారుచేసి మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి.

Desktop Bottom Promotion