For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్ని ప్రకాశవంతంగా మార్చే 17 ఉత్తమ ఆహారాలు

By Mallikarjuna
|

ఒకరి చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. ఇంకొకరి చర్మం పేలవంగా కనిపిస్తుంది. ఏమిటీ తేడా? బహుశా చర్మం నిగనిగలాడేవారు ఖరీదైన సౌందర్యసాధనాలు వాడుతారేమో! అస్తమానం సౌందర్యశాలలను సందర్శిస్తారేమో! అనుకుంటారు. కాని అదంతా నిజం కాదు. చర్మం నిగారింపు పైపై పూతలతో రాదు. ఖరీదైన క్రీములతో వెలిగిపోదు. కాలానుగుణంగా వాతావరణంలో జరిగే మార్పులను తట్టుకుంటూ చర్మం జీవకళతో నవనవలాడాలంటే మనం రోజూ తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మనం తినే ఆహారం ద్వారానే చర్మానికి కావలసిన పోషణ లభిస్తుంది.

ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్నికి 12 ఉత్తమ పండ్లు:క్లిక్ చేయండి

‘చర్మం పేలవంగా, ముడతలు పడ్డట్టుగా, ఉన్నదానికన్నా వయసు మీద పడినట్టుగా కనిపిస్తోందంటే ఆహారం పట్ల మనం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నమాట' ఆహారానికి తోడు వాతావరణంలో కాలుష్యం, ఎండలు మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం, తెల్లని మచ్చలు రావడం, గరుకుగా తయారవడం, వంటివి జరగవచ్చు. ఇలాంటి దుష్ప్రాబావాలన్నింటి నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే..ఆహారంలో కొన్ని సూపర్ ఫుడ్స్ ను చేర్చుకోవాలి. మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

గుడ్లు:

గుడ్లు:

గుడ్లు: ఫీరాడికల్స్ డామేజ్ వల్ల చర్మ సమస్యలను కాపాడటానికి గుడ్డులోని ప్రోటీన్స్ బాగా పనిచేస్తాయి. గుడ్డులో అధిక శాతంలో ప్రోటీలు కలిగి ఉంటాయి. ఇంకా చర్మ ఆరోగ్యానికి కావల్సిన బయోటిన్, ఎసెన్సియల్స్ విటమిన్స్ కలిగి ఉండి వయస్సు పైబడనియ్యకుండా.. చర్మం పొడిబారినియ్యకుండా కాపాడుతుంది.

క్వీనా:

క్వీనా:

క్వీనా: ఈ క్వీనా ను ఉడికించి తీసుకొనేటుటివంటి ఆహారం. క్వీనా వందశాతం ప్రోటీన్ రిచ్ ఫుడ్, 9 రకాల అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి అందానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

 బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్: ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్స్ కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉతపత్తి పెంచవచ్చు.

గుమ్మడి

గుమ్మడి

గుమ్మడి: గుమ్మడి కాయ, మరియు గుమ్మడి విత్తనాలు రెండూ కూడా సూపర్ పుడ్ లోఒకటి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, డ, కె మరియు ఇ మరియు మెగ్నీషియం అధికంగా ఉంటాయి. వీటితో పాటు పొటాషియం మరియు ఐరన్ కూడా ఎక్కువే . ఇవి ఓస్టిరియోపోసిస్ , ప్రొస్టేట్ సమస్యలు, డిప్రెషన్ మరియు క్యాన్సర్ వంటి సమస్యలను నివారిస్తాయి.

ఆరెంజెస్:

ఆరెంజెస్:

ఆరెంజెస్: అరటి, నారింజ, జామ వంటి తాజా పండ్లలో అన్నిరకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది.ప్రతి మనిషికి రోజుకు 200 గ్రాముల విటమిన్ 'సి' అవసరమవుతుంది. కాబట్టి నారింజ జ్యూస్ తాగటం కన్నా పండు రూపుంలో ఆరగిస్తే ఉత్తమం. ఈ పండును తినటం వల్ల సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం మన చర్మం పై ఉండదు. అంతేకాదు చర్మం ముడతల పడకుండా, బిగుతుగా ఉండేదుకు సహకరిస్తుంది.

 బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీ: ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి రక్తాన్ని శుద్ది చేయడంతో పాటు, శరీరంలో ఆరోగ్యానికి హానికలిగించే టాక్సిన్స్ మరియు మలినాలను తొలగిస్తాయి .

 వాల్ నట్స్:

వాల్ నట్స్:

వాల్ నట్స్: ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒక్క ఫిష్ లో మాత్రమే కాదు వాల్ నట్స్ లో కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో వాల్ నట్స్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల చర్మం నునుపుగా మారడమే కాకుండా కురులకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. దాంతో యంగ్ గా కనబడేలా చేస్తుంది.

 పెరుగు:

పెరుగు:

పెరుగు: పెరుగు లో విటమిన్ సి మరియు మిక్క్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే క్యాల్షియం మరియు ప్రోటీన్స్ కలిగిన ఈ డైరీప్రొడక్ట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి.

 గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీ : గ్రీన్ టీతో బరువు తగ్గడమే కాదు.. చర్మ కాంతిని కూడా పెంచుకోవచ్చు. గ్రీన్ టీలో చర్మ సంరక్షణకు కావలసినన్ని ఫోలిఫినోల్స్ కలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఫ్రెష్ గా, తేమగా ఉండేలా కాపాడుతుంది. కాబట్టి రోజులు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీకి తాగడానికి అవకాశం ఇవ్వండి.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరలు: గ్రీన్ వెజిటేబుల్స్ చాలా పవర్ఫుల్ ఫుడ్. ఇది చర్మ రక్షణ, సౌందర్యానికి మాత్రమే కాదు,మొత్తం శరీరానికే మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆ పవర్ ఫుడ్ లో విటమిన్స్, మినిరల్స్, న్యూట్రీషియన్స్ తో నిండి ఉంటుంది.

 ఓట్స్:

ఓట్స్:

ఓట్స్: హై కొలెస్ట్రాల్ హార్ట్ డిసీజెస్ ను నివారించుకోవడానికి బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ మరియు బౌల్ మూమెంట్ వంటి సమస్యలను నివారించడానికి, అలాగే క్యాన్సర్ రిస్క్ ను నిరోధించడానికి బరువును కంట్రలోల్ చేయడానికి సహాయపడే ఓట్స్ ను తప్పనిసరిగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఫ్లాక్ సీడ్స్

ఫ్లాక్ సీడ్స్

ఫ్లాక్ సీడ్స్: ఫ్లాక్ సీడ్స్ లో ఫైబర్ అద్భుతంగా ఉంటుంది. అంతే కాదు ఓమేగా తీ ఫ్యాటీ యాసిడ్స్, నేచురల్ లాక్సాటివ్స్ కలిగి ఉంటాయి. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాలో లెవల్స్ ను తగ్గిస్తాయి మరియు డయాబెటిస్ నుండి రక్షణ కల్పిస్తాయి.

వీట్ గ్రాస్:

వీట్ గ్రాస్:

వీట్ గ్రాస్: వీట్ గ్రాస్ ఎల్లప్పుడు చాలా గొప్పది. వీట్ గ్రాస్ నే గోధుమ గడ్డి అంటారు. ఈ ఆహారం లివర్ ను శుభ్రపరుస్తుంది. హీమోగ్లోబిన్ ను ఉత్పత్తికి సహాయపడుతుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. గాయాలను మాన్పుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్:సాల్మన్ ఫిల్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఈ ఒమేగా యాసిడ్స్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడి, కొలాజెన్ ఉత్పత్తి పెరగటానికి తోడ్పడే వీటిని మన శరీరం తయారుచేసుకోలేదు. మనం తినే ఆహారం ద్వారానే వీటిని సమకూర్చాలి. చేపలు (ముఖ్యంగా సాల్మన్, ట్యునా వెరైటీ), జీడిపప్పు, బాదాం పప్పు. ఇది కొలాజెన్ ఉత్పత్తికి ఎంతో కీలకమైనది. సాల్మన్ ఫిష్ లో హెల్తీ ప్రోటీన్ పుష్కలంగా ఉంది. మరియు మరో కోల్డ్ వాటర్ ఫిష్, ఇవి చర్మానికి వైద్యపరమైన లక్షణాలను కలిగిస్తాయి.

టమోటో:

టమోటో:

టమోటో: ముఖ చర్మం కోమలం గా కనిపించేందుకు ప్రక్రుతి ప్రసాదించిన టమాటో చాలు . తాజా గా ఉన టమాటో లను బాగా చితకకొట్టి అలా వచ్చిన రసానికి రెండు చెంచాల పాలు కలుపగా వచ్చిన గుజ్జును ముఖానికి రాసుకుని పది , పదిహేను నిముషాలు ఉంచి ఆ పైన నీటితో కడుక్కోవాలి . దీనివలన చర్మం పైన మ్రుతకనాలు తొలగించబడతాయి . పైగా చర్మం లోపలికి వెళ్లి శుభ్రం చేస్తుంది . ముఖం పైనుండే జిడ్డు తొలగిపోయి చర్మానికి తాజాదనాన్ని , కాంతిని ఇస్తుంది.

 అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లు: అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అరటి పండు ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని పెంచడమే కాదు. చర్మాన్ని శుభ్రపరచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ రెగ్యులర్ ఒక అరటిపండు తినాలి. పొడి చర్మానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడటమే కాకుండా చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది. బాగా పండిని అరటి పండును, చేత్తో మెత్తగా గుజ్జులా చేసి ఫేషియల్ మాస్క్ వేసుకోవాలి. పదినిముషాల తర్వాత శుభ్రం చేసి చూడండి మార్పు మీకే తెలుస్తుంది. చర్మ బిగుతుగా అవ్వడంతో పాటు ముఖం కాంతివంతంగా మారుతుంది.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెరీస్ ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడగానే నోరూరిస్తూ ఎర్రని రంగులో చిరుపులుపుతో, స్వీట్ గా స్వభావం కలిగి, చక్కటి ఆకారం కలిగినటువంటి పండు స్ట్రాబెరీ. ఈ ఫ్రూట్ తినడానికి మాత్రమే కాదు సౌదర్య సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. స్ట్రాబెరీలతో ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబింబంలా వుంటుంది. చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు. దీని వలన ఫేస్‌ ప్రెష్‌ గా కనిపిస్తుంది.

Desktop Bottom Promotion