For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌందర్యాన్ని పెంచే ఫెయిర్ నెస్ క్రీమ్స్ వల్ల 5 దుష్ప్రభావాలు

|

సహజంగా మహిళలు సౌందర్యంగా కనబడుటకు ఫెయిర్ నెస్ క్రీమ్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది బ్యూటీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఒక ఆరోగ్యకరమైన మరియు కాంతివంతమైన చర్మం పొందడానికి ఫెయిర్ నెస్ క్రీమ్ ను తరచూ ఉపయోగిస్తుంటారు. మరియు చర్మకాంతికూడా మెరుగుపరిచి ఫర్ ఫెక్ట్ స్కిన్ అందిస్తుంది. కానీ, ఎప్పుడూ అందంగా కనబడుట కోసం ఫెయిర్ నెస్ క్రీమ్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

కానీ, ఎక్కువ కాలం ఫెయిర్ నెస్ క్రీమ్ వాడటం వల్ల సైడ్ఎఫెక్ట్స్ వల్ల మీ చర్మానికి బ్యూటీ సమస్యలకు గురిచేస్తుంది . దీని వల్ల ఫెయిర్ నెస్ క్రీమ్ వల్ల చాలా హానికరమైన దుష్ప్రభావాలే లేదా సైడ్ ఎఫఎక్ట్స్ గా చెబుతారు . ఇది చాలా నిధానంగా మరియు తక్కువగా ప్రారంభమైతుంది. మొదట చర్మం ఇన్ఫెక్షన్ తో ప్రారంభమైన హానికమైన స్కిన్ క్యాన్సర్ వరకూ దారితీస్తుంది.

ఫెయిర్ నెస్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత అకస్మాత్తుగా దుష్ప్రభావాలు కనబడినా లేదా దీర్ఘకాలిక ఎఫెక్ట్స్ ఉన్నా యి, ఫెయిర్ నెస్ క్రీమ్ ల యొక్క హానికరమైన ఎఫెక్ట్స్ ను ముందుగానే తెలుసుకోవాలి. అలాగే ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ఎటువంటి ఫెయిర్ నెస్ క్రీమ్ ను ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకొనే ముందు ఫెయిర్ నెస్ క్రీమ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ను ఈ క్రింది విధంగా ఉన్నాయి. వాటిని మీరు తెలుసుకోవడం చాలా అవసరం.

5 Harmful Effects Of Fairness Creams

చర్మం దురదు: ఫెయిర్ నెస్ క్రీమ్ వల్ల ఒక హానికరమైన స్కిన్ ఎఫెక్ట్, స్కిన్ ఇరిటేషన్. ఫెయిర్ నెస్ క్రీమ్ అప్లై చేసిన కొంత సమయం తర్వాత ఈ లక్షణం కనబడుతుంది . ఇలాంటి లక్షణం కనిపించిన వెంటనే ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలని సలహా .

అలర్జీ: ఫెయిర్ నెస్ క్రీమ్ లలో రసాయనాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల అలర్జీలు మొదలై స్కిన్ ఇరిటేషన్, రెడ్ నెస్, దురద మరియు తీవ్ర సమస్యలను గురిచేస్తుంది, ఇది ఓయిడీమాకు కారణం అవుతుంది . కాబట్టి, ఎటువంటి అలర్జీలక్షణాలు లేనటువంటి క్రీమ్ లను ఎంపిక చేసుకోవాలి.

స్కిన్ క్యాన్సర్: స్కిన్ క్యాన్సర్ కు ఫెయిర్ నెస్ క్రీమ్ లు కూడా ఒక కారణం అవుతుంది. హై క్వాలిటీ ఉన్నటువంటి ఫెయిర్ నెస్ క్రీమ్ లను ఎంపిక చేసుకోవాలి. కొన్ని ఫెయిర్ నెస్ క్రీములలో ఉపయోగించే కెమికల్స్ క్యాన్సర్ కారణం అవుతాయి. ముఖ్యంగా ఈ క్రీములలో హైడ్రోక్వినైన్, మెర్క్యురి,లేదా స్టెరాయిడ్స్ బేస్డ్ స్కిన్ లైట్నర్స్ ను ఉపయోగించన క్రీములను తప్పనిసరిగా నివారించాలి.

డ్రై స్కిన్: మీరు మీ చర్మానికి ఫర్ ఫెక్ట్ గా సూట్ అయ్యే ఫెయిర్ నెస్ క్రీములను ఎంపిక చేసుకోవాలి. లేదంటే చర్మం పొడి బారడం లేదా పాలిపోవడం జరుగుతుంది . ఫెయిర్ నెస్ క్రీములను కొనే ముందు చర్మ తత్వాన్ని తెలుసుకోవాలి . మీ చర్మతత్వానికి నప్పే ఫెయిర్ నెస్ క్రీమ్ లను ఎంపిక చేసుకోవాలి.

మొటిమలు: మీరు ఎంపిక చేసుకొనే క్రీములు మరీ ఆయిలీగా ఉన్నట్లైతే, చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంది. ఇది మొటిమలు ఏర్పడుటానికి కారణం అవుతుంది. ఇది మనకు తెలయకుండానే మన హానికలిగించే దుష్ప్రభావం . దీని ప్రభావం వల్ల చర్మం మీద ఎక్స్ ట్రా మార్క్స్ మరియు స్కార్స్ ఏర్పడుతాయి.

English summary

5 Harmful Effects Of Fairness Creams


 Unless there is no change in the concept that fair skin is the beautiful option, people will continue using fairness creams. Nowadays, many beauty experts are trying to create awareness that a healthy and flawless skin with an even tone will make the perfect skin. But, it will take a long time for all those fair skin freaks to accept this reality.
Story first published: Friday, July 4, 2014, 15:40 [IST]
Desktop Bottom Promotion