For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశించే చర్మసౌందర్యానికి 5హోంమేడ్ ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్

|

"ఆరెంజ్‌ క్లాటస్‌ ఆరంటమ్‌" అనే శాస్త్రీయ నామం కలిగిన నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌, సంస్కృతంలో "నారంగ-ఐరావతి", హిందీలో "నారంగీ, సంతరా", బంగ్లాలో "కమలా రేఖ" అనే పేర్లతో పిలుస్తుంటారు. అందం అనేది చూసే కళ్ళల్లో వుంటుంది అన్నారు పెద్దలు. అయితే చూపు తిప్పుకోలేని అందాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు నేటి మహిళలు. ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్‌, వ్యాయామాలు, ఫేస్‌ప్యాక్‌లతో డబ్బును, సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ బిజీలైఫ్‌, కాంపిటివ్‌ ప్రపంచంలో ప్రతి మహిళకు ఇంత సమయాన్ని కేటాయించడం సాధ్యం కాదు. అటువంటి వారికి ఓ శుభవార్త. తమ అందాన్ని ఎటువంటి కష్టంలేకుండా, సమయం వృధా చేయకుండా పెంపొందించుకోవచ్చు. మరి ఆ సులువైన పద్ధతి ఏమిటన్నది తెలుసుకుందామా!

మనకు తక్కువ ఖర్చుతో మార్కెట్‌లో ఈజీగా దొరికే కమలాపండు (ఆరెంజ్‌). ఆదేమిటి ఆరెంజ్‌తో మరింత అందంగా ఎలా అవుతారు? అబ్బా! ఆరెంజ్‌ తొక్కలను ఎండబెట్టాలి, పౌడర్‌ చేయాలి, దానిలో ఏవేవో కలపాలి అంటూ ఆలోచిస్తున్నారు కదూ! వద్దు! వద్దు!! మీరు అంత కష్టపడటం మాకు ఇష్టం లేదు. అందుకే మీకో సునాయాస మార్గం. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఓ గ్లాసు ఆరెంజ్‌ జ్యూస్‌ సేవించండి చాలు. ఈజీ కదా!!

బ్యూటీ ఎక్స్‌పర్ట్స్‌, న్యూట్రీషనిస్టుల ప్రకారం ఆరెంజ్‌ జ్యూస్‌ను సేవించడం వల్ల మీ చర్మమే కాక జుట్టు, గోళ్ళు కూడా అందంగా వుంటాయి. ఆరెంజ్‌లో వున్న విటమిన్‌ ''సి'', ఫోలిక్‌ యాసిడ్‌, పొటాషియం మీ అందాన్ని రెట్టింపు చేయడంలో తమవంతు తోడ్పాటును అందిస్తాయి. వీటి వల్ల మీ చర్మం రెట్టింపు అందాన్ని సంతరించుకుంటుంది. దీనికి తోడు జుట్టు, గోళ్ళు కూడా అందంగా మారుతాయి. ఆరెంజ్‌లో వున్న ఎల్లోపిగ్మెంట్‌ చర్మ నిగారింపుతో పాటు, దాని ఎలాక్టిసిటీని కూడా కాపాడుతుంది. మీరు చేయాల్సిందల్లా రోజూ ఒక గ్లాసు అంటే 200మిలీ.ల ఆరెంజ్‌ జ్యూస్‌ తాగడమే. అలాకాకుండా మేము ప్యాక్ వేసుకోవడానికి కూడా సిద్దమే అనుకొనే వారికోసం కొన్ని ఆరెంజ్ హోం మేడ్ ఫేస్ ప్యాక్ లాను ఈక్రింది విధంగా అందిస్తున్నాము...

1. నారింజ తో పేస్ ప్యాక్:

మీరు దీనిని మెత్తగా చేయాల్సిన పని లేదు. మీరు చేయాల్సిందల్లా నారింజ గుజ్జుని తీసుకొని ముఖం మీద రుద్దడమే. రుద్దిన తర్వాత ఒక 5 నిముషాలు వదిలి వేయాలి. తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ ముకం ప్యాక్ వాళ్ళ చర్మాన్ని బిగిస్తుంది ఇంకా చర్మం లోని ఆయిల్ నీ తీసివేస్తుంది. దీని వలన వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం అవుతది. మీరు స్నానం చేసుకునే ముందు క్రమం తప్పకుండా దీనిని వేసుకోవచ్చు.

2. పాలు మరియు ఆరంజ్ జ్యూస్ తో పేస్ ప్యాక్:
ఇది చేర్మాన్ని బాగా శుభ్ర చేస్తుంది. ఇది చనిపోయిన కణాలు, దుమ్మధూళిని చర్మం నుంచి తీసివేస్తాది. మాంచి ప్రకాశించే చర్మం కోసం ఈ పేస్ ప్యాక్ ని మొహానికి వేసుకొని ఒక నిమిషం మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగివేయాలి.

3. పెరుగు మరియు నారింజ తొక్కతో పేస్ ప్యాక్:
దీన్ని విశ్రుతంగా మహిళలు మరియు పురుషులు ఉపయోగించే ఫేస్ స్క్రబ్. నారింజ తొక్కలని ఎండలో బాగా ఎండబెట్టాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీనిని ఇంట్లో వేసుకొనే పేస్ ప్యాక్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ పేస్ ప్యాక్ కోసం ఒక టీ స్పూన్ పెరుగును ఒక కప్ లో తీసుకోవాలి దీనికి అర టీ స్పూన్ నారింజ తొక్క పౌడర్ కలుపుకోవాలి దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు గనక మొటిమలు ఉంటె కొన్ని చుక్కలు నిమ్మ రసం కూడా వేసుకోవచ్చు. ఇపుడు దీనిని మొహానికి వేసుకొని కొంచెం సేపు అరేదాకా వెయిట్ చేయండి తర్వాత చల్లని నీటితో కడిగేయండి.

4. నిమ్మ, పెరుగు తో ఆరెంజ్ జ్యూస్:
నిమ్మ మరియు పెరుగు ఇంట్లో దొరికే వస్తువులు. వీటితో మనం ఇంట్లోనే పేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. విటితో కనక నారింజ రసం కలిపి పేస్ ప్యాక్ లాగా వేసుకుంటే చెర్మం ఎంతో బాగుంటుంది. ఈ ప్యాక్ వల్ల చెర్మం తెల్లగా మరియు సన్ టాన్ నుండి కాపాడుతుంది.

5 Homemade Orange Facemasks For Glowing Skin

5. నారిజ తొక్క మరియు వోట్ తో పేస్ ప్యాక్:
ఇది సహజ మైన పేస్ ప్యాక్ ఇది చాల సులబమైన పేస్ ప్యాక్. ఈ ప్యాక్ వల్ల చెర్మం లోని చనిపోయిన కణాలు తీసివేస్తాది. సన్ టాన్ నుంచి కూడా కాపాడుతుంది. ఈ కొన్ని చిట్కాలు పాటించి మనమే ఇంట్లో మాంచి పేస్ పాక్స్ తయారుచేసుకోవచ్చు.

English summary

5 Homemade Orange Facemasks For Glowing Skin

“Fruits offer a lot of health as well as beauty benefits”. Fruit packs are quite popular and orange is one of the favourites, as they are very gentle. It is rich in vitamin C, antioxidants, folic acid, calcium, zinc, etc. The whole fruit, like the juice, peel, pulp, has magical effect on your skin. It revives and tones the skin, tighten the pores and cures acne effectively. It will give your skin a glowing and healthy look.
Story first published: Friday, October 31, 2014, 13:48 [IST]
Desktop Bottom Promotion