For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాస్మోటిక్స్ కు ప్రత్యామ్నాయంగా 7 నేచురల్ హెర్బ్స్

By Mallikarjuna
|

లిప్ గ్యాలస్, బాడీలోషన్, షాంపూ...ఇలా చెప్పకుంటూ పోతే సౌందర్య ఉత్పత్తులు అనేకం ఉన్నాయి . చాలా వరకూ చాలా మంది మహిళలు వివిధ రకాల కాస్మోటిక్స్ ను ప్రతి రోజూ ఉపయోగించుకుంటున్నారు కానీ, దీర్ఘకాలం పాటు ఇంటువంటి రసాయనికి సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చర్మం మరియు జుట్టుకు మంచిదేనా? ప్రస్తుతానికి ఎటువంటి ప్రభావం చూపకపోయినా, దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ప్రకాశవంతమైన చర్మం-ఆరోగ్యకరమైన జుట్టుకోసం 10 హేర్బ్స్ :క్లిక్ చేయండి

కాబట్టి, ప్రక్రతి పరంగా మన చర్మాన్ని రక్షించుకోవడానికి వివిధ రకాల మూలికా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇవి సురక్షితమైన మార్గంలో మన చర్మం మరయిు జుట్టుకు మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు . కాబట్టి, మీరు ప్రతి రోజూ రెగ్యులర్ గా ఉపయోగించే రసాయనికి బ్యూటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా కొన్ని నేచురల్ ఉత్పత్తులు సహాయపడుతాయి.

కొబ్బరి నూనె: బాడీలోషన్ మరియు యాంటీ డాండ్రఫ్ ఏజెంట్:

కొబ్బరి నూనె: బాడీలోషన్ మరియు యాంటీ డాండ్రఫ్ ఏజెంట్:

కొబ్బరినూనెలో ఫ్యాటీయాసిడ్స్, అధికంగా ఉంటాయి. కాబట్టి, చర్మాన్ని ముడతలు లేకుండా, పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరినూనె ఎంతగానో సహాయపడుతుంది. కానీ , అలా ఉపయోగించదల్చుకొన్నిప్పుడు, కొబ్బరి నూనెను మాత్రమే లేదా కొబ్బరి నూనెతో ఇతర నూనెలు లేదా హెర్బస్ ఉపయోగించి చర్మం మరియు జుట్టుకు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మం మరియు కేశాలకు రెండింటి సమానంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులోని గుణాలో కేశాలలోపలికి డీప్ గా చొచ్చుకొని పోయి జుట్టు సాఫ్ట్ గా చేస్తుంది. అలాగే చర్మాన్ని కూడా సున్నితంగా మార్చుతుంది. కొబ్బరి నూనె కండిషనర్ గా పనిచేయడంతో పాటు చర్మం మరియు కేశాలకు తగినంత తేమను అంధిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్స్ గాపిలవబడే విటమిన్ ఇ మరియు ఇతరాలు ఉన్నాయి. కాబట్టి, దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించినా, చర్మంలో ఉండే ముడుతలను నివారిస్తుంది.

హెన్నా -హెయిర్ డై

హెన్నా -హెయిర్ డై

హెయిర్ డైలు తక్షణ ప్రభావం చూపిస్తూ మ్యాజిక్ చేస్తాయి. అందువల్ల హెయిర్ డైలు మనల్ని టెప్ట్ చేస్తాయి . తెలజుట్టును మరియు ఇతర జుట్టు సమస్యలను కప్పిపుచ్చడానికి హెయిర్ డైల మీద ఎక్కువ మగ్గు చూపుతారు. కానీ, చాలా వరకూ సింతటిక్ హెయిర్ డైలలో సెకండరీ అమైన్స్ గా లేదా తార్ డెరవేటివ్స్ గా పిలవబడే కెమికల్స్ ఉండటం ఇవి క్యాన్సర్ కు అనుసందానం కలిగి ఉంటాయి. కాబట్టి, ఇటువంటి కెమికల్స్ హెయిర్ డైలకు దూరంగా ఉండి నేచురల్ హెయిర్ డైలకు ప్రాదాన్యత ఇవ్వండి. జుట్టు యొక్క సహజ రంగు కోసం ప్రాచీన కాలం నుండి హెన్నాను ఉపయోగిస్తున్నారు. నువ్వుల నూనె మరియు కరివేపాకు, లేదా బీట్ రూట్ జ్యూస్ లేదా ఒక కప్పు పెరుగు , నిమ్మరసం మరియు టీ వంటివి జోడించి హెన్నా తయారుచేసుకొని తర్వాత తలకు పట్టించి మీకు కావల్సిన రంగు జుట్టును పొందవచ్చు. మరియు ఇది మీ శరీరంను చల్లగా ఉంచుతుంది.

పసుపు మరియు పండ్లుతో ప్రకాశవంతమైన ఫేస్ ప్యాక్

పసుపు మరియు పండ్లుతో ప్రకాశవంతమైన ఫేస్ ప్యాక్

మీకు బ్యూటీ ఫార్లర్ కు వెళ్ళ సమయం లేకున్నా , తక్షణం మీ చర్మం కాంతిని ప్రకాశవంతంగా మార్చుకోవాలంటే, పసుపుతో తయారుచేసే ఫేస్ ప్యాక్ నువేసుకోవచ్చు. టీవీ యాడ్స్ లో లేదా బ్యూటీ పార్లర్స్ లో చూపించే కమర్షియల్ ఫేస్ ప్యాక్ కొద్దిగా కెమికల్స్ మిక్స్ కాబడి ఉంటాయి. అందువల్ల దీర్ఘకాలంలో ఇలా నిల్వ చేసిన వాటితో ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం మీ చర్మసౌందర్యానికి సురక్షితం కాదు. చర్మ సౌందర్యం కాపాడుకోవడానికి మరియు చర్మానని సాఫ్ట్ గా ఉంచుకోవడానికి వీటికి ప్రత్యామ్నాయంగా మన వంటగదిలో ఉండే చాలా సింపుల్ పదార్థాలను ఉపయోగించండి . కొద్దిగా పసుపు తీసకొని అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. లేదా బాగా పండిన బొప్పాయిని లేదా టమోటోలను గుజ్జులా తయారుచేసి ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే బ్లాక్ స్పాట్స్, మొటిమలు నివారించబడుతాయి.

పొడి చర్మానికి అలోవెరా మాయిశ్చరైజ్:

పొడి చర్మానికి అలోవెరా మాయిశ్చరైజ్:

సాధారణంగా స్కిన్ మాశ్చరైజింగ్ క్రీమ్స్ లో పెట్రోలాటమ్ వంటి కెమికల్ ఉండుట వల్ల ఇవి హానికరమైన కెమికల్స్ గా చర్మానికి హాని కలిగిస్తాయి. ఇటివంటి రిస్క్ ను తీసుకోవడం కంటే, నేచురల్ గా మనకు అందుబాటుల ఉండే మాయిశ్చరైజర్ ను ఉపయోగించి చర్మాన్ని సాఫ్ట్ గా చేసుకోవచ్చు. అందుకు అలోవెరా అద్భుతంగా సహాయపడుతుంది. అందుకు తాజాగా ఉండే అలోవెరా లీవ్ ను సింపుల్ గా కట్ చేసి, దాన్ని నుండి జెల్ ను వేరుచేసి నేరుగా చర్మానికి అప్లై చేసుకోవచ్చు .

వెల్లుల్లి మరియు చందనం: మొటిమలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి:

వెల్లుల్లి మరియు చందనం: మొటిమలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి:

యాంటిఆక్సిడెంట్స్ కు నేచురల్ పవర్ హైస్, వెల్లుల్లి రక్తంను శుద్ది చేస్తుంది మరియు చర్మానికి ఒక ప్రత్యేక మెరుపును అందిస్తుంది. అయితే, మొటిమలను తక్షణం నివారించడం కోసం వీటిని డైరెక్ట్ గా చర్మం మీద ఉపయోగించుకోవచ్చు. వెల్లుల్లి పొట్టు తీసి మొటిమలున్న ప్రదేశంలో రుద్ది కొద్దిసేపయ్యాక చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

చందనం: మొటిమలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి:

చందనం: మొటిమలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి:

మొటిమల నివారణకు మరో అద్భుతమైనటువంటి యాంటీ ఏన్స్ క్రీమ్ చందనం. మరియు ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. బాదం నూనెలో కొన్ని చుక్కల శాండిల్ వుడ్ ఆయిల్ వేసి మిక్స్ చేసి చర్మానికి మసాజ్ చేయాలి. లేదా లేదా వేడి నీళ్ళలో వేసి ఆవిరి పట్టవచ్చు.

మొటిమలకు వ్యతిరేకంగా పెరుగు పంచదార

మొటిమలకు వ్యతిరేకంగా పెరుగు పంచదార

ఒక కప్పు పెరుగులో, అర టీస్పూన్ పసుపు, చిటికెడు చందనం మరియు ఒక టీస్పూన్ పంచదార వేసి పేస్ట్ లా తయారుచేసి ముఖానికి మసాజ్ చేయాలి. సర్కులర్ మోషన్ లో అరనిముషం పాటు మర్దన చేయాలి. తర్వాత పదినిముషాలు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

సోప్ నట్స్ (రీటా) మరియు శీకాకాయ –క్లీనింగ్ షాంపు

సోప్ నట్స్ (రీటా) మరియు శీకాకాయ –క్లీనింగ్ షాంపు

మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే షాంపులను కొన్ని రకాల రసాయనాలు సోడియం లౌర్లీ ఇది మురికిని వదించడానికి మరియు జిడ్డును తొలగించడానికి ఉపయోగిస్తున్నారు. కానీ, ఈ రసాయనిక ఉత్పత్తులు వీటితో పాటు, జుట్టు పోషనకు అవసరం అయ్యే తలమాడు మీద ఉండే చర్మంలోని నూనె గ్రంథులను కూడా తొలగించేస్తాయి. కాబట్టి, జుట్టుకు డ్యామేజ్ కు కారణం అయ్యే వీటికి ప్రత్యామ్నాయంగా శీకాకాయ కాంబినేషన్ లో రీటా మరియు సోప్ నట్ మరియు శీకాకాయ పౌడర్ వంటివి గోరువెచ్చని నీటిలో పేస్ట్ చేసి , వీటిని ఉపయోగించి మీ జుట్టును శుభ్రం చేసుకోవచ్చు.

దానిమ్మ గింజలు: నేచురల్ లిప్ కలర్

దానిమ్మ గింజలు: నేచురల్ లిప్ కలర్

ఎండలో తిరగడం, స్మోకింగ్, డీహైడ్రేషన్, మరియు ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల మీ పెదాలను నల్లగా మార్చుతాయి. అయితే ఈ డార్క్ లిప్స్ ను కప్పిపుచ్చుకోవడానికి ప్రతి రోజూ ఎక్కువ సమయం లిప్ స్టిక్స్ ను ఉపయోగిస్తుంటారు. ఈ కెమికల్ బేస్డ్ లిప్ స్టిక్ వల్ల ముందు ముందు పెదాలు పొడి బారిపోతాయి. కాబట్టి, వీటికి ప్రత్యామ్నాయంగా నేచురల్ గా పింక్ లిప్స్ ను పొందడానికి దానిమ్మ గింజలతో పెదాల మీద స్ర్కబ్ చేయాలి. దానిమ్మగింజలను మెత్తగా చేసి, వాటికి కొద్దిగా పాలక్రీమ్ మిక్స్ చేసి మీ పెదాలకు ప్రతి రోజూఅప్లై చేయాలి. దాంతో మీ పెదాలు నేచురల్ లిప్ కరల్ రెడ్ గా మరియు ఫుల్ గా ఉంటాయి. అలాగే దానిమ్మ గింజల పేస్ట్ కు కొద్దిగా షుగర్ మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను కూడా ఉపయోగించి పెదాల మీద రుద్దుకోవచ్చు.

Story first published: Tuesday, June 10, 2014, 11:28 [IST]
Desktop Bottom Promotion