For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం నుండి మురికిని తొలగిండానికి నేచురల్ టిప్స్

|

మురికి చర్మం మీద పడటం సహజం. అది వాతావరణంలోని కాలుష్యం, నీటిప్రభావం, ఎండవేడిమి, పొగ, ఇలా రకరకాలుగా చర్మం మురికిపడటానికి కారణాలున్నాయి. ముక్యంగా కొన్నిమనకు కనిపించని ప్రదేశాల్లో అంటే, మెడ, గొంతు, జాయింట్స్, చంకలు, మోచేతులు, మోకాలు, వీపు వంటి ప్రదేశాల్లో ఎక్కువగా మురికి పడుతుంటుంది. వీటిని సరిగా శుభ్రం చేయకపోతే, ఆ ప్రాంతాల్లో మరింత కఠినంగా మారి మురికిగా కనబడుతుంది. కాబట్టి, రెగ్యులర్ బాతింగ్ లోనే ఈ ప్రదేశాలను కూడా శుభ్రంగా రుద్ది స్నానం చేయాల్సి ఉంటుంది.

చర్మం మీద ఏర్పడ్డ మురికిని తొలగించుకోవడానికి స్ర్కబ్బింగ్, ఎక్స్ ఫ్లోయేటింగ్ మరియు క్లెన్సింగ్ చాలా ప్రభావవంతంగా, చర్మం మీద మురికిని తొలగించుకోవచ్చు . అందుకు అన్ని రకాల సాల్వెట్స్, సోపులు, క్లీనింగ్ ఏజెంట్స్, స్ర్కబ్బింగ్స్ మార్కెట్లో వివిధ రకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే, రసాయనికి ఉత్పత్తులకు డబ్బు ఖర్చుచేయడం కంటే , మన ఇంట్లో నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే పదార్థాలను ఎంపిక చేసుకుంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు, మరియు డబ్బు కూడా ఖర్చు అవ్వదు.

చర్మం మీద ఏర్పడ్డ మురికిని తొలగించుకోవడానికి వివిధ రకాల నేచురల్ రెమెడీస్ ఉన్నాయి. ఉదాహారణకు: ఆయిల్ మసాజ్ కూడా చర్మంలో పేరుకొన్న మురికిని చాలా సులభంగా తొలగిస్తుంది. బాడీ ఆయిల్ తో మీ చర్మం మీద మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసిన తర్వాత 20 నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. చేతి వేళ్ళతో బాగా రుద్దడం వల్ల చర్మంలో పేరుకొపోయిన మురికి సులభంగా తొలగిపోతుంది. కాబట్టి, ఇటువంటి హోం రెమడీలు మరికొన్ని మీకోసం క్రింది విధంగా....

హాట్ ఆయిల్ మసాజ్:

హాట్ ఆయిల్ మసాజ్:

హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల రిలాక్స్ అవ్వడం మాత్రమే కాదు, ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు అన్ని మూలల్లో చేరిన మురికిని తొలగిస్తుంది. గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసి 20నిముషాలు అలాగే ఉంచి తర్వాత బాగా రుద్ది మురికి తొలగించి తర్వాత హాట్ షవర్ చేసుకోవాలి.

బాడీ లోషన్:

బాడీ లోషన్:

ముందుగా చేతలను నీటితో శుభ్రంగా కడిగి తర్వాత, బాడీలోషన్ ను చేతులకు, మురికి ప్రభావితమైన ప్రదేశాల్లో అప్లై చేయాలి. గోళ్ళు ఉపయోగించి మురికిని బాగా రుద్ది తొలగించాలి.

తడి టవల్ ను ఉపయోగించాలి:

తడి టవల్ ను ఉపయోగించాలి:

చర్మం మీద నేచురల్ గా మురికిని తొలగించడానికి ఇది ఒక సింపుల్ మార్గం. ముందుగా టవల్ ను తడిపి తర్వాత నీరు మొత్తం పిండేసి, తర్వాత ఆ టవల్ తో శరీరం మొత్తం తడి తుడుచుకొనేటప్పుడు కొద్దిగా ప్రెస్ చేసి చర్మం మీద తుడవటం వల్ల చర్మంలోపలున్న మురికి కూడా తొలగిపోతుంది. మరీ ఎక్కువగా రుద్దకూడదు. లేదంటే చర్మం మంట పుడుతుంది. ఐడియల్ గా ఇలా చర్మానికి ఆయిల్ మసాజ్ చేసినప్పుడు చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నిమ్మరసంతో స్ర్కబ్బింగ్:

నిమ్మరసంతో స్ర్కబ్బింగ్:

నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది, మరియు క్లియర్ గా ఉంచుతుంది . నిమ్మరసం మీద కొద్దిగా ఉప్పు వేసి, తర్వాత చర్మం మీద మర్ధన చేయాలి. ఇది చర్మాన్ని తెల్లగా మార్చడంతో పాటు, మురికిని కూడా తొలగిస్తుంది.

హాట్ షవర్:

హాట్ షవర్:

హాట్ షవర్ వల్ల చర్మం యొక్క రంధ్రాలు తెరచుకుంటాయి. అప్పుడు, చర్మం మీద మురికి తొలగించడం మరింత సులభం అవుతుంది . అందుకు నాణ్యమైన స్ర్కబ్బింగ్ ఉపయోగించి తర్వాత స్నానం చేయడం వల్ల క్లియర్ స్కిన్ పొందవచ్చు.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ స్క్రబ్బింగ్ లో ఎక్కువ ప్రయోజనాలున్నాయి. మీరు ఓట్ మీల్స్ కి కొద్దిగా పాలు మిక్స్ చేసి తర్వాత దీన్ని చర్మానికి అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత నిధానంగా స్ర్కబ్బింగ్ చేసి, వేడినీటితో శుభ్రం చేసుకోవాలి.

షుగర్ స్ర్కబ్:

షుగర్ స్ర్కబ్:

చర్మం మీద మురికి తొలగించుటకు మరో మార్గం షుగర్ స్ర్కబ్. తడి చర్మం మీద కొద్దిగా పంచదార వేసి రుద్దడం వల్ల చర్మం క్లియర్ గా మారుతుంది.

English summary

7 Top Ways To Remove Dirt From Skin Naturally

Dirt often gets accumulated on the skin gradually. Dirt build-up is most commonly seen on hidden parts of skin such as neck, joints, calves, armpits, elbows and back. The dirt build-up become stubborn with time and do not get removed from the skin even when you bathe regularly.
Story first published: Monday, April 14, 2014, 17:13 [IST]
Desktop Bottom Promotion