For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫర్ ఫెక్ట్ స్కిన్ కోసం ప్రతిరోజూ వీటిని మిస్ కాకుండా తినాలి

|

అందాన్ని పెంచుకోవడం కోసం, మీరు రెగ్యులర్ గా ఏవేవో ఖరీదైన మరియు ఇన్ ఎఫెక్టివ్ ఉత్పత్తులను ఉపయోగించి విసిగిపోయారా? అటువంటి విలువలేని అన్ని ఉత్పత్తులను భయటపడేయాడనికి ఇది ఒక మంచి సమయం. ఎందుకంటే ఫర్ ఫెక్ట్ స్కిన్ పొందాలంటే, ఈ రోజు నుండి ఫర్ ఫెక్ట్ తినడం ప్రారంభించండి. ఎటువంటి పై మెరుగులు, ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ లేకుండానే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

రతి ఒక్క మహిళలు ఒక అందమైన, స్వచ్చమైన చర్మం సౌందర్యాన్ని కోరుకుంటుంది. అయితే, చాలా మంది మహిళలు మొటిమలు, డార్క్ సర్కిల్స్ మరియు ఇతర చర్మ సమస్యల భారీన పడుతుంటారు. కొన్ని రకాల చర్మ సమస్యల వెనుక స్కార్స్ మరియు స్పాట్స్ ముఖం మీద దాగి ఉంటాయి. ఇటువంటి చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు, చిట్కాలను అనుసరించి ఉంటాయి. ఇంకా, కొన్ని రకాల క్రీమ్స్ మరియు జెల్స్ వంటివి అప్లై చేసినా కూడా అనుకొన్న ఫలితాలను ఇవ్వలేకపోవడంతో నిరాశ చెందుతుంటారు. కాబట్టి, మీ ముఖ చర్మంలో ఎటువంటి మచ్చలు, మొటిమలు, స్కార్స్ లేకుండా ఒక స్వచ్చమైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే ఆహారాలు కూడా ప్రధాన పాత్రపోషిస్తాయి.

ఆహారం ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా ప్రభావితం చేస్తుందన్న విషయం మీకు తెలుసా? కొన్ని ఆహారాలు ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తే, మరికొన్ని ఆహారాలు శరీర సౌష్టవం, చర్మం సౌదర్యం, కేశ సౌందర్యం మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం మీ చర్మ నాణ్యతను తెలుపుతుంది. ఉదాహారణకు మీరు తీసుకొనే ఆహారం ఆయిల్ ఫుడ్ అయితే, అప్పుడు ఖచ్చితంగా మీ చర్మం మొటిమలకు, మచ్చలకు దారితీస్తుంది. అదే విధంగా ఆరోగ్యకరమైన ఆహారాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరం మొత్తం ఆరోగ్యం మరియు కాంతివంతమైన చర్మంకు గొప్పగా సహాయపడుతాయి. మరి మీ ఫర్ ఫెక్ట్ స్కిన్ పొందడానికి సహాయపడే ఆ ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయి ఒక వండర్ ఫుల్ ఫ్రూట్. ఇందులో అనే న్యూట్రీషియన్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా తక్కువ క్యాలరీలున్నాయి మరియు కొలెస్ట్రాల్ ఉండదు . కాబట్టి, బరువు తగ్గాలంటే పపాయ తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి మరియు బీటాకెరోటీన్ ఎక్కువగా ఉండి ఇన్ఫ్లమేషన్, మొటమలు మచ్చలు తొలగిస్తుంది.

బెల్ పెప్పర్:

బెల్ పెప్పర్:

బెల్ పెప్పర్ చాలా రుచికరమైన వెజిటేబుల్. వీటిని ఉడికించి తినవచ్చే లేదా పచ్చిగా అలాగే కూడా సలాడ్స్ రూపంలో తినవచ్చు. రెడ్ బెల్ పెప్పర్ లో వందశాతం విటమిన్ సి ఉంటుంది. ఇది మీ చర్మానికి ఎంతో అవసరం అవుతుంది అంతే కాదు ఇందులో ఉండే ఫైబర్, మరియు విటమిన్ బి6 కూడా చర్మ అందాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్ ముడుతలను తగ్గించి బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ మీ చర్మాన్ని సున్నితంగా మార్చడం మాత్రమే కాదు, హానికరమైన యూవీ కిరణాలను నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది. డార్క్ చాక్లెట్ చర్మానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మరియు చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. చాక్లెట్ ను ఎంపిక చేసుకొనేటప్పుడు బార్ చాక్లెట్ ను ఎంపిక చేసుకోవాలి. అందులో కోక కంటెంట్ ఎక్కువ ఉంటుంది. డార్క్ చాక్లెట్ చాలా వ్యసనపరులుగా మార్చుతుంది కానీ, చర్మానికి మంచి ప్రయోజనాలను అంధిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

మీరు మీ చర్మంలో మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నట్లైతే, జస్ట్ గ్రీన్ టీని రెగ్యులర్ గా ప్రతి రోజూ సిప్ చేయండి. తర్వాత మీ చర్మంలో మ్యాజికల్ ఎఫెక్ట్ ను గమనించండి. గ్రీన్ టీలో గ్రేట్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మం ను ఫ్యూరిఫై చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది . కాబట్టి, రెగ్యులర్ గా తీసుకొనే కాఫీ, టీలకు చెక్ పెట్టి, గ్రీన్ టీకి అలవాటు చేసుకొని డిఫరెన్స్ ను చూడండి.

సాల్మన్:

సాల్మన్:

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గించడంలో అద్భుతమైన ఆహారం. అంతే కాదు, ఇది మీకు అవసరం అయ్యే విటమిన్ డి ని పుష్కలంగా అంధిస్తుంది. సాల్మన్ ఫిష్ లో హెల్తీ ఫ్యాట్ కలిగి ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి, సూర్య రశ్మినుండి రక్షణ కల్పిస్తాయి మరియు ఆరోగ్యకరమైన చర్మకణాల నిర్వాహణకు సహాయపడుతుంది. మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మీ చర్మ రంధ్రాలు మూసుకుపోయినట్లైతే, సాల్మన్ ఫిష్ తినడం ఒక మంచి మార్గం.

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

సాచురేటెడ్ ఫ్యాట్స్ కు కొబ్బరి నూనె ఒక గొప్ప మూలం. ఇది 90శాతం క్యాలరీలు సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటుంది. ఇందులో లౌరిక్ ఆసిడ్ కలిగి ఉండి యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. చర్మానికి సంబంధించిన వైరన్, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, మొటిమలు నివారిస్తుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి కావల్సిన అన్ని రకాల విటమిన్స్, మినిరల్స్, ప్రోటీనులు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా అంధించి చర్మఆరోగ్యానికి, కాంతి పెంచడానికి ఎంతో సహాయపడుతాయి.

సెలరీ(సెలరీ):

సెలరీ(సెలరీ):

ఫర్ ఫెక్ట్ స్కిన్ పొందడానికి మరో ఆహారం సెలరీ. సెలరీలో విటమిన్ కె పుష్కలంగా ఉండి, ఇది శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. మరియు హై బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది . ఇది స్ట్రెస్ లెవల్స్ తగ్గిస్తుంది. దాంతో చర్మఆరోగ్యం మెరుగుపడుతుంది.

English summary

8 Foods to Eat Every Day for Perfect Skin

Are you tired of using different expensive and ineffective beauty products? It’s time to throw away all those ineffective products and start eating foods for perfect skin. I went from terrible acne five months ago to not having acne now. It was hard, but it was possible, and less expensive than turning to pricey products.
Desktop Bottom Promotion