For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేనికాంతిని పెంచే 9 యోగ భంగిమలు

|

వయసులో ఉన్నవారి నుంచి వయసు పైబడిన వారి వరకూ అందరి దృష్టీ చర్మకాంతిపైనే! మేని చర్మం నిగనిగలాడుతూ ఉండాలని ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ, చర్మకాంతికి పై పూతగా వాడే క్రీములు పది శాతం మాత్రమే పనిచేస్తాయి. మిగతా అంతా మనం తీసుకునే జాగ్రత్తలు, ఆహారం, ఆహ్లాదరకరమైన జీవనవిధానమే శాసిస్తుంది.

నేడు తీరికలేని పనులు, మానసిక ఒత్తిడుల వల్ల సరిగ్గా శ్వాస పీల్చడం కూడా మర్చిపోతున్నాం. బాల్యంలో సక్రమంగా ఉండే ఉచ్ఛ్వాస నిశ్వాసలలో వయసు పెరుగుతున్న కొద్దీ జీవనవిధానంలో వచ్చే తేడాల వల్ల అపసవ్యత చోటుచేసుకుంటుంది. ఫలితంగా ప్రాణవాయువు శరీరంలోని అన్ని భాగాలకూ సక్రమంగా అందక ఆరోగ్యం దెబ్బతింటుంది. చర్మం కాంతి కోల్పోతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా, చర్మకాంతి పెరగాలంటే యోగసాధన సరైన మార్గం అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఉదయం 45 నిమిషాలు యోగా చేయడం వల్ల శరీర అంతర్గత అవయవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మకాంతి పెరుగుతుంది.

యోగ వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో స్కిన్ సెల్స్ కు రీచార్జ్ గా సహాయపడుతాయి . దాని వల్ల శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతాయి. కాబట్టి రెగ్యులర్ గా యోగాను ప్రాక్టిస్ చేయడం చాలా అవసరం. మేనికాంతిని మెరిపించడంలో యోగా భంగిమలు ఒత్తిడిని తగ్గించడంతో మీ చర్మం హెల్తీగా కనబడుతుంది.

యోగా ఆరోగ్యాన్ని కాపాడుట మాత్రమే కాదు, ఇది వయస్సును కూడా తగ్గిస్తుంది . కాబట్టి మీరు రెగ్యులర్ బేస్ లో యోగాను ప్రాక్టీస్ చేస్తే మీ నిజరూపం, ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది. మీ మేని సౌందర్యంను పెంచడానికి అవసరం అయ్యే కొన్ని యోగాసనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

పద్మాసన:

పద్మాసన:

లోటస్ భంగిమలో కూర్చొని, మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ లెవల్స్ క్రమంగా తగ్గుతాయి. మీరు అందంగా కనబడాలంటే, తప్పనిసరిగా మీరు ప్రతి రోజూ యోగా చేయాలి.

సుఖాసన:

సుఖాసన:

సుఖాసన ఒక యోగా భంగిమ మీరు చాలా సులభంగా కూర్చొనే భంగిమ. ఈ భంగిమ మీ ముఖ కండరాలను రిలాక్స్ చేస్తుంది మరియు ముడుతలను నివారిస్తుంది.

వరున్ ముద్ర:

వరున్ ముద్ర:

ప్రాథమిక యోగా ముద్రల్లో, వరున్ ముద్ర ఒకటి. ఇది శరీరంలోని నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది . శరీరంలో మరియు చర్మానికి తగినంత నీటిని సప్లై చేస్తూ, చర్మం ఎల్లప్పుడూ తేమగా మరియు మెరుస్తూ ఉండేలా చేస్తుంది.

ప్రాణాయామం:

ప్రాణాయామం:

రోజులో 5-6 నిమిషాలు ప్రాణాయామానికి కేటాయించాలి. పద్మాసనం పద్ధతిలో విశ్రాంతిగా కూర్చోవాలి. ఛాతీ నిండుగా గాలి పీల్చి, వదిలేయాలి. ఇలా ఐదు సార్లు చేసిన తర్వాత ఒక వైపు నాసికా రంధ్రాన్ని బొటనవేలితో మూసి, రెండవ నాసిక రంధ్రం గుండా శ్వాస తీసుకోవాలి. ఆ వెంటనే మూసి ఉన్న నాసికపై వేలు తీసేసి లోపలి గాలిని బయటకు పంపించాలి. వయసును బట్టి ఐదు సెకండ్లు ఊపిరితీసుకోవడం, ఐదు సెకండ్లు వదిలేయడం చేయాలి. ప్రాణాయామాన్ని సరిగ్గా చేయడం వల్ల వయసు కారణంగా చర్మంపై ఏర్పడే ముడతలు, చర్మం పొడిబారడం, కొంత విహీనం అవడం వంటి సమస్యలు తగ్గి చర్మ కాంతి రోజురోజుకూ పెరుగుతుంది.

సూర్య నమస్కారం:

సూర్య నమస్కారం:

యోగసనాల్లో సూర్యనమస్కారం ప్రప్రథమైనది. సూర్యనమస్కారం పూర్తిగా మీ చర్మం మరియు శరీరం మీద ప్రభావం చూపుతుంది . మీ శరీరంలో జీవక్రియలను మెరుగుపరిచి చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

సిరసాసన:

సిరసాసన:

హెడ్ స్టాండ్(తలక్రిందులు)గా నిలబడటం. ఇది నిజంగా చాలా ఎఫెక్టివ్ భంగిమ. ఈ భంగిమలో రక్త ప్రసరణ బ్రెయిన్ కు మరియు శరీరం మొత్తనికి మంచిగా ప్రవహిస్తుంది.

శర్వాంగాసన:

శర్వాంగాసన:

ఈ షోల్డర్ స్టాండ్ రక్తప్రసరణ బ్యాక్ పోర్షన్ కు చాలా బాగా అందుతుంది. ఈ షోల్డర్ స్టాండ్ భంగిమ ముఖానికి రక్తప్రసరణను మెరుగుపరిచేలా చేస్తుంది.

హలాసన:

హలాసన:

ఈ హలాసన చేయడానికి మీ శరీరాన్ని ఈ ఫోటోలో చూపిన విధంగా బెండ్ చేయాల్సి ఉంటుంది . ఈ భంగి వేయడం వల్ల మీ జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. జీవక్రియల రేటు బాగున్నప్పుడు మీ చర్మం కూడా ఎప్పుడూ మెరుస్తుంటుంది.

శవాసన:

శవాసన:

ఈ శవాసనం భంగిమ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. శరీరం విశ్రాంతి పరిచి, చల్లబరుస్తుంది. ఈ యోగ భంగిమ వల్ల మీ శరీరంలో అన్ని కండరాలు రిలాక్స్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఇది మీ చర్మం రిలాక్స్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది.

English summary

9 Yoga Poses For Healthy Glowing Skin

Beauty always comes from within. And in order to get that glow from within, you need a workout for your body and soul. Yoga is one of the best ways to get glowing skin. Yoga for skin glow is a concept that is effective and increasingly catching up with young men and women.
Story first published: Monday, September 1, 2014, 16:28 [IST]
Desktop Bottom Promotion