For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో తయారుచేసిన ప్రకృతిసిద్దమైన లెమన్ ఫేస్ ప్యాక్

By Super
|

నిమ్మకాయను విస్తృతంగా అనేక సౌందర్య చికిత్సలలో వాడతారు. నిమ్మకాయలో విటమిన్ సి ఉన్నది, ఈ విటమిన్ లోతుగా చర్మం రంధ్రాలలోకి వెళ్ళి శుభ్రపరచి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నిమ్మకాయలో అనామ్లజనకాలు ఉండటంవలన చర్మంలో రక్త ప్రసరణకు సహాయపడుతుంది. నిమ్మకాయను విస్తృతంగా ఇంట్లో ముఖానికి వేసుకునే మాస్క్ గా, ఫేషియల్స్ లోను ఉపయోగిస్తారు. నిమ్మకాయ, సిట్రస్ పండ్ల జాతికి చెందుతుంది మరియు దీనివలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలతోపాటు నిమ్మకాయ సౌందర్య ప్రయోజనాలను కూడా అందిస్తున్నది ఎందుకంటే దీనిలో విటమిన్ సి,అనామ్లజనకాలు ఉన్నాయి.

నిమ్మ రసంతో 15 ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్:క్లిక్ చేయండి

నిమ్మకాయను సహజమైన చర్మ క్లీనర్ గా కూడా ఉపయోగించవచ్చు. నిమ్మకాయను, తేనె వంటి సహజమైన గృహపదార్థాలతో, శనగపిండి, గుడ్డు, పెరుగు మొదలైన వాటితో కలిపి వాడితే చర్మానికి లాభదాయకమైన ఫలితాలను అందిస్తుంది. కాబట్టి నిమ్మకాయను ఇంట్లో వాడే ఫేస్ ప్యాక్లుగా ప్రయత్నించండి.

పొడి చర్మం: హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్: క్లిక్ చేయండి

నిమ్మకాయను ఫేస్ ప్యాక్ గా ఎలా ఉపయోగించాలి?

నిమ్మకాయ & పెరుగు ముఖ ప్యాక్

నిమ్మకాయ & పెరుగు ముఖ ప్యాక్

ఒక గిన్నె లో ½ కప్ పెరుగు తీసుకుని దానికి తాజా నిమ్మరసం జోడించండి. ఈ రెండింటిని బాగా కలపండి. నిమ్మరసానికి బదులుగా నిమ్మనూనేను కూడా వాడవొచ్చు. ముఖం మరియు మెడ మీద ఈ పేస్ట్ వర్తింపచేయండి. 10 -15 నిమిషాల తరువాత చల్లని నీటితో ఫేస్ ప్యాక్ ను కడిగివేయండి. ఈ మాస్క్ ముఖాన్ని ప్రకాశవంతంగా మరియు తేమగా ఉంచుతుంది. నిమ్మకాయ చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు పెరుగు చర్మాన్ని ఆర్ద్రతగా ఉంచుతుంది.

నిమ్మకాయ & తేనె ఫేస్ మాస్క్

నిమ్మకాయ & తేనె ఫేస్ మాస్క్

ఒక గిన్నెలో తాజా నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ తీసుకోండి మరియు ఈ నిమ్మరసానికి, తేనె 1 టేబుల్ స్పూన్ జోడించండి. రెండింటిని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయండి. 10 నిమిషాలవరకు ఆరేదాకా ఉంచుకోండి మరియు తరువాత చల్లటి నీటితో ముఖం కడగండి. ఈ ఫేస్ ప్యాక్, ఎండ వలన కలిగే నలుపును మరియు ముఖ చర్మరోగాలను తొలగిస్తుంది. మంచి ఫలితాల కోసం ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

నిమ్మకాయ & దోసకాయ ఫేస్ ప్యాక్

నిమ్మకాయ & దోసకాయ ఫేస్ ప్యాక్

తాజా దోసకాయ రసం 1 టేబుల్ స్పూన్ మరియు తాజా నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ తీసుకుని,రెండింటిని బాగా కలపండి. ఇప్పుడు దూది ఉండను తీసుకుని, ఈ మిశ్రమంలో ముంచి, ఈ దూది ఉండతో సున్నితంగా గుండ్రంగా ముఖంమీద రుద్దండి. ముంచండి మరియు రుద్దండి, ఈ విధంగా ఐదు నిముషాలవరకు చేయండి. తరువాత ఒక ఐదు నిముషాల వరకు ఆరనీయండి. తరువాత చల్లటి నీతితో ముఖాన్ని కడగండి. ఈ ఫేషియల్ ముఖ చర్మం మీద జిడ్డును తీసివేసి కాంతివంతంగా చేస్తుంది.

నిమ్మకాయ & ముల్తాని మిట్టీ ఫేస్ ప్యాక్

నిమ్మకాయ & ముల్తాని మిట్టీ ఫేస్ ప్యాక్

ముల్తాని మిట్టీ 2 టేబుల్ స్పూన్లు మరియు నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ తీసుకుని రెండింటిని బాగా కలపండి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి సమంగా వర్తింపచేయండి. 10-15 నిమిషాల వరకు అలానే ఉంచి, తరువాత గోరు వెచ్చని నీటితో మీ ముఖం కడగండి. జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ చాలా మంచిది.

నిమ్మకాయ & టమోటా ఫేస్ ప్యాక్

నిమ్మకాయ & టమోటా ఫేస్ ప్యాక్

టమోటా రసం 3-4 టేబుల్ స్పూన్లు మరియు నిమ్మరసం 1-2 టేబుల్ స్పూన్లు మరియు వోట్మీల్ పొడి 3-4 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఈ మూడింటిని బాగా పేస్ట్ అయ్యేవరకు కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి సమంగా పట్టించండి. పది నిముషాల వరకు ఆరనిచ్చి, తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖం మీద ఉన్న మచ్చలు, చుక్కలు తొలగించడానికి సహాయపడుతుంది.

నిమ్మకాయను

నిమ్మకాయను

నిమ్మకాయను, సౌందర్య చికిత్సలలో అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. నిమ్మకాయ,అన్ని చర్మరక్షణకు సంబంధించిన సమస్యలకు ఖచ్చితమైన,అందమైన పరిష్కారాలను ఇస్తుంది. కాబట్టి ఇంట్లో నిమ్మకాయలతో ఫేస్ ప్యాక్లు ప్రయత్నించండి మరియు అన్ని చర్మం సమస్యలకు వీడ్కోలు చెప్పండి.

Desktop Bottom Promotion