For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీరదోసకాయతో ఫేస్ మాస్క్ వేసుకొనే సులభ పద్ధతులు

|

మహిళలు అందాన్ని రెట్టింపు చేసుకోవడంలో ఫేస్ మాస్క్ లు వేసుకుంటుంటారు. బ్యూటీపార్లర్స్ కు వెళ్ళి ఖరీదైనా ఫేస్ మాస్క్ ల కన్నా, ఇంట్లో తయారుచేసుకొనే ఫేస్ మాస్క్ లు చాలా ఎఫెక్టివ్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయపడుతాయి. ఈ ఫేస్ మాస్క్ లు చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేయడంతో పాటు చర్మ యొక్క అందాన్ని మెరుగుపరుస్తాయి.

కాబట్టి మార్కెట్లో ఫేస్ మాస్క్ లకన్నా హోం మేడ్ ఫేస్ మాస్క్ లు ఎక్కువ ఫలితాలనిస్తాయి. మరియు నేచురల ఫ్రెష్ నెస్ ను అందిస్తాయి. ఎటువంటి దుష్ప్రభాలు కలిగించవు. నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే నేచురల్ ఫేస్ ప్యాక్ ల కంటే మరేది బెటర్ గా ఉండదు. ఖీరా దోసకాయ గింజలు, ఇతర సహజ తత్వాలతో తయారైంది కుకుంబర్ ఫేస్ ప్యాక్. సహజసిద్దమైన క్లీన్సర్ గా మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మానికి చక్కని పోషణ అందిస్తుంది

అటువంటి నేచురల్ ఫేస్ ఫ్యాక్ ఐటమ్ కీరకాయ. కీరకాయను అనేక బ్యూటీ ట్రీట్మెంట్ లో ఉపయోగిస్తుంటారు. కీరకాయలో ఎక్కువ బ్యూటీ ప్రయోజనాలు ఉండటం వల్ల దీన్ని ఫేస్ మాస్క్ గా వేసుకోవడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది . అలాగే ప్రకాశవంతమైన చర్మ సౌందర్యానికి కీరదోసకాయ ఫేస్ మాస్క్ ఉత్తమ ఎంపిక. కీరకాయతో ఫేస్ మాస్క్ వేసుకోవడానికి కొన్ని సులభ చిట్కాలు క్రింది విధంగా...

Best Ways To Apply A Cucumber Face Mask

ఫేస్ క్లెన్సింగ్: ప్రకాశవంతమైన చర్మం పొందడానికి కీరదోసకాయతో ఫేస్ మాస్క్ వేసుకోవడానికి మీరు ముఖంను శుభ్రం చేసుకోవాలి. ఫేస్ మాస్క్ వేసుకోవడానికి ఇది మొదటి స్టెప్. ఫేస్ మాస్క్ వేసుకొనే ముందు మీ ముఖం మీద ఎటువంటి కెమికల్స్ లేదా కాస్మోటిక్స్ ఉండకూడదు. కాబట్టి, ఒక సారి ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి. ముఖం శుభ్రం చేసుకొన్న తర్వాత కీరకాయతో ఫేస్ మాస్క్ వేసుకోవాలి.

పుదీనా ఆకులు: కాంతివంతమైన చర్మం పొందడానకి కీరదోసకాయతో పాటు, పుదీనా లేకుండా ఫేస్ మాస్క్ పూర్తికాదు. మొటిమలతో బాధపడుతున్నప్పుడు కీరదోసకాయకు పుదీనా ఆకులు చేర్చి పేస్ట్ చేసి ముఖానికి పట్టించడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా మొటిమలను నివారించి, ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది.

కీరకాయఫేస్ మాస్క్: కీరకాయ ఫేస్ మాస్క్ ను తయారుచేసుకోవడానికి ముందు కీరదోసకాయను తురుము అలాగే నేరుగా ముఖానికి పట్టించివచ్చు లేదా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి తర్వాత ముఖానికి అప్లై చేయాలి.

ఎగ్ వైట్ : ఒక ఎఫెక్టివ్ ఫేస్ మాస్క్ ఇది. కీరదోసకాయ పేస్ట్ కు ఎగ్ వైట్ మిక్స్ చేసి ఫేస్ కు మాస్క్ గా వేసుకొంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

ఇతర పదార్థాలతో మిక్స్ చేయండి: ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకొన్నప్పుడు ఇతర పదార్థాలను కూడా మిక్స్ చేయవచ్చు. కీరదోసకాయ పేస్ట్ కు నిమ్మరసం, లేదా పెరుగు లేదా తేనె మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ లా వేసుకొంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

ఫేస్ మాస్క్ ను అప్లై చేసే విధానం: కీరదోసకాయతో తయారుచేసిన ఎటువంటి ఫేస్ ప్యాక్ అయినా సరే ప్యాక్ వేసుకొనే ముందు ముఖం శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత ప్యాక్ వేసుకొని అరగంట అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.

English summary

Best Ways To Apply A Cucumber Face Mask

Cucumber has been heavily popular as far as face masks are concerned. You can apply a bit of cucumber face mask across your face and get some skin pampering moments. Cucumber face mask for glowing skin is the best option for you to look good and stunning.
Story first published: Saturday, May 24, 2014, 12:37 [IST]
Desktop Bottom Promotion