For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మోకింగ్ వల్ల ప్రాణాంతక చర్మ సమస్యలు?

|

స్మోకింగ్ (ధూమపానం) చేసేవారికి మాత్రమే కాదు, స్మోక్ చేసే వారికి పక్కన ఉన్నవారికి కూడా హానిజరుగుతుంది. ధూమపానం వల్ల అనేక దుష్ప్రభావాలున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య పరంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు గురిచేస్తుంది. శ్వాససంబంధిత సమస్యలకు కారణం అవుతుంది మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. స్మోకింగ్ వల్ల ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా హాని జరుగుతుంది. స్మోకింగ్ ద్వారా విడుదలయ్యే పొగలో అనేక టాక్సిన్స్ ఉండి అది శరీరాన్ని పాడుచేస్తుంది. ఒక్క సింగిల్ సిగరెట్ త్రాగితే చాలు మీ జీవితంలో కొన్ని నిముషాలు కోల్పోవల్సి వస్తుంది.

ఒక వ్యక్తి స్మోక్ చేస్తున్నప్పుడు, ఆమె లేదా అతను కొన్ని టాక్సిక్ కాంపౌండ్స్ ను (విషాలను)లోనికి గ్రహిస్తారు, ఇవి శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. స్మోకింగ్ వల్ల టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశించడం వల్ల బహిర్గతంగాను, అంతర్గతంగాను అనేక సమస్యలకు దారితీస్తుంది.

అలాగే ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల చర్మ కణాలను డ్యామేజ్ చేస్తుంది మరియు స్కిన్ టిష్యూష్ చర్మాన్ని, ప్రస్తుతం ఉన్న వయస్సుకంటే వయస్సు పైబడిన వారిలా కనబడేలా చేస్తుంది. వృద్దాప్య ఛాయలను ఏర్పరచి వయస్సైన వారిలా కనబడేలా చేస్తుంది. అందువల్ల, స్మోకింగ్ చర్మం మీద ఎలా దుష్ప్రభావం చూపుతుంది. స్మోకింగ్ వల్ల కొన్ని ఘోరమైన దుష్ప్రభావాల గురించి చర్చించడం జరిగింది.

వృద్ధాప్యం:

వృద్ధాప్యం:

స్మోకింగ్ నేరుగా ప్రీమెచ్యుర్ ఏజింగ్ తో సంబందం కలిగి ఉండి, వయస్సైపోయిన వారిలా కనబడేలా చేస్తుంది . చర్మం త్వరగా ముడుతలు పడటానికి, వయస్సైన వారిలా కనబడేలా చేయడానికి ముఖ్యకారణం స్మోకింగ్. స్మోక్ చేసే సమయంలో సిగరెట్ హీట్ చర్మ కణాలను బర్న్ చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన చర్మం వృద్ధి చెందకుండా చర్మం యొక్క కణజాలలను దెబ్బతీస్తుంది. ఇది చర్మం యొక్క స్ట్రక్చర్ ను మరియు చర్మం యొక్క ఫైబర్ కంటెంట్ ను పాడు చేస్తుంది. క్రమంగా అది చర్మం మీద ముడుతలు మరియు గీతలు పడటానికి దారితీస్తుంది . స్మోకింగ్ వల్ల చర్మంలోని తేమ తగ్గడం వల్ల చర్మం పొడిబారి, ప్యాచులుగా కనబడుతుంది . స్మోకింగ్ వల్ల రక్తకణాల్లో రక్తం యొక్క మందాన్ని తగ్గించి చర్మానికి రక్తప్రసరణను తగ్గిస్తుంది. ఫలితంగా చిన్న వయస్సులోనే, త్వరగా వయస్సైపోయిన వారిగా కబడుతారు.

హీలింగ్:

హీలింగ్:

ఎక్కువగా స్మోక్ (చైన్ స్మోక్)చేసే వారిలో చర్మంమీద దద్దుర్లుగా, ఎర్రగా మార్చుతుంది ఫలితంగా చర్మం ప్రమాదానికి గురి అవుతుంది. మనకు తెలినంత వరకూ స్మోకింగ్ రక్తప్రసరణను తగ్గిస్తుంది, అంతే కాదు, దాంతో పాటు, చర్మానికి ఆక్సిజన్ సరఫరాను కూడా తగ్గిస్తుంది. దాంతో స్కిన్ గ్రోత్ కూడా తగ్గుతుంది. అందువల్ల, చర్మంకు ఎదైనా ప్రమాధం జరిగినట్లు తెలిస్తే, హీలింగ్ ప్రొసెస్ నిధానంగా తగ్గడం వల్ల ఇది ఇన్ఫెక్షన్స్ ను, రక్తం గడ్డకట్టించే సమస్యలు మరియు టిష్యు డ్యామేజ్ ను పెంచుతుంది. హీలింగ్ అనేదే చర్మానికి వన్ సైడ్ ఎఫెక్ట్.

స్కిన్ క్యాన్సర్:

స్కిన్ క్యాన్సర్:

స్మోకింగ్ వల్ల మరో ఘోరమైన దుష్ప్రభావం స్కిన్ క్యాన్సర్. ప్రాణాంతక క్యాన్సర్లలో స్కిన్ క్యాన్సర్ ఒకటి. స్మోక్ చేయని వారికంటే, స్మోక్ చేసే వారిలో స్కిన్ క్యాన్సర్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. సిగరెట్ లో టాక్సిక్ మరియు క్యార్సినోజెనిక్ కాంపౌడ్స్ ఎక్కువగా ఉండి స్కిన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. కొన్నిరిపోర్ట్స్ ప్రకారం 75% స్మోకర్స్ లో స్కిన్ క్యాన్సర్ అభివృద్ది చెందినట్లు కనుగొన్నారు. అలాగే స్మోకర్స్ లో ఓరల్ క్యాన్సర్ మరియు సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటాయి

 మొటిమలు మరియు బొడిపెలు:

మొటిమలు మరియు బొడిపెలు:

స్మోకర్స్ ఎదుర్కొనే మరో సమస్య ముఖంలో మొటిమలు మరియు బొడిపెలు వంటి స్కిన్ బాయిల్స్ . అందుకు ప్రధానకారణం సిగరెట్ లో ఉండే టాక్సిన్స్. స్మోకింగ్ వల్ల స్కిన్ స్ట్రక్చర్ మరియు క్వాలిటి దెబ్బతింటుంది. స్మోకింగ్ వల్ల మొటిమలకు మరియు చంకల్లో, బ్రెస్ట్ క్రిందిభాగంలో మరియు మెడమీద బ్లాకేజ్ జరుగుతుంది. చర్మం మీద ఇలా బ్లాకేజ్ ఏర్పడుటకు సిగరెట్ లో ఉండే నికోటిన్ అనే పదార్థం. కాబట్టి, నికోటిన్ మరియు ఇతర ప్రాణాంతక టాక్సిన్స్ నుండి చర్మాన్ని రక్షించుకోవాలంటే స్మోక్ చేయడాన్ని నిలిపివేయండి.

పెదాల రంగు మారడం:

పెదాల రంగు మారడం:

స్మోకింగ్ వల్ల మరో స్కిన్ సమస్య పెదాలు రంగులో మార్పులు . చాలా మంది చైన్ స్మోకర్స్ లో పెదాలు నల్లగా మారి ఉంటాయి. ఇది స్మోకింగ్ వల్ల జరుగుతుంది. అందుకు కారణం స్మోకింగ్ వల్ల పెదాల మీద నేరుగా హీట్ తగిలి, బ్లడ్ సర్కులేషన్ తగ్గుతుంది. కాబట్టి, పెదాల రంగు బట్టి, వారు స్మోక్ చేస్తారా లేదా అని చెప్పవచ్చు .

Story first published: Tuesday, August 19, 2014, 14:42 [IST]
Desktop Bottom Promotion