For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి చర్మానికి : వేసవి జాగ్రాత్తలు

|

వేసవికాలం వచ్చిందంటే ఉష్ణతాపానికి ముఖం వడలిపోవడమే గాక, రంగు కూడా తగ్గిపోతుంది. చదువు కోసం ఉద్యోగ నిమిత్తం స్త్రీ, పురుషులు, ఎండలో తిరగవలసి రావటం సహజం. కనుక వేసవి బారి నుండి శరీరాన్ని రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఎండలో తిరగడం వలన ముఖం వర్చస్సును కోల్పోయి, కమిలిపోయినట్లయితే ఏం చేయాలన్న సమస్య స్త్రీ, పురుషులను వేధిస్తూ వుంటుంది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకొని అర స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, ఒక స్పూన్‌ నిమ్మరసం, మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడ వెనుక, చేతులకు రాసుకొని అరగంట తర్వాత సున్నిపిండి లేక శనగ పిండి, అవీకాకపోతే పెసర పిండితో ముఖం , చేతులు, మెడ వెనుక శుభ్రంగా చల్లని నీటితో కడిగేయాలి. టాయెలెట్‌ సోప్స్‌ను మాత్రం ఉపయోగించకూడదు. రాత్రి సమయంలో సబ్బులు వాడకూడదు. ముఖం, చేతులు, కడిగిన తర్వాత ఎలాంటి మేకప్‌ చేసుకోకుండా వుంటే చాలు. ఈ విధంగా వారం రోజులు చేస్తే ఫలితం మీకే తెలుస్తోంది.

బ్లాక్‌హెడ్స్‌ : కొద్దిగా నిమ్మరసం, అందుకు సమానంగా గ్లిసరీన్‌ కలపాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని స్నానం చేయబోయే సమయానికి అరగంట ముందుగా ముఖం మీద మసాజ్‌ చేసినట్లుగా రాయాలి. అరగంట తర్వాత శనగ పిండితోగాని, సున్నిపిండితోగానీ స్నానం చేయాలి. సబ్బులు మాత్రం ఉపయోగించరాదు. ఇలా మూడు నాలుగు రోజులకొకసారి చొప్పున, ఒక నెల రోజులపాటు చేసినట్లయితే ముఖం మీద మొటిమలు బ్లాక్‌ హెడ్స్‌ వలన ఏర్పడిన మచ్చలు నల్లమచ్చల బారి నుండి విముక్తి పొందవచ్చు.

Dry Skin Care Tips for Summer Season

పొడి చర్మంతో జాగ్రత్తలు : కొందరికి చర్మం జిడ్డు కారుతూ తాత్కాలికంగా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. పొడి చర్మం అయితే ఎక్కువ కాలం మనస్తాపాన్ని కలిగిస్తుంది. పొడి చర్మం త్వరగా ముడతలు పడి, మృదుత్వాన్ని నశింపజేసి త్వరలో ముఖం మీద వృద్దాప్య లక్షణాలను తెచ్చిపెడుతుంది. ఈ ప్రమాదం బారిన పడకుండా వుండాలంటే, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పొడి చర్మం... ముఖం ఎంత తేమగా, మహాజిడ్డుగా వుండే జిడ్డు ముఖం గలవారికి ఇది మంచి మాస్క్‌. వారంలో రెండు సార్లు ఇలా చేయండి. నాలుగైదు సార్లు చేశారంటే మంచి ఫలితం తప్పక వుంటుంది.

ముఖంపై మచ్చలు : ముఖం మీద రకరకాల మచ్చలు వున్నాయా? సబ్బులతోటి, క్రీములతో ఈ మచ్చల్ని వదిలించడం మీకు సాధ్యం కాలేదా? ఇందుకు బంగాళదుంప మహత్తరంగా మీకు సహకరిస్తుంది. పచ్చి బంగాళాదుంపను సన్నని ముక్కలుగా తరిగి జ్యూస్‌ తయారుచేయండి. మూతటైట్‌గా వున్న సీసాలో దీన్ని భద్రం చేసుకొని ఫ్రిజ్‌లో వుంచుకుంటే నాలుగైదు రోజులు దీన్ని ఉపయోగించవచ్చు. ఈ చల్లని బంగాళాదుంప జ్యూస్‌తో నిత్యం ఒకటి, రెండు సార్లు ముఖం కడిగేసుకొని, ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. 40 రోజుల్లో మీరాశించిన విధంగా మార్పు కనపడుతుంది. ముఖంపై వున్న మచ్చలు మాయమవుతాయి. ఇక ఆలస్యం ఎందుకు వెంటనే చేసి చూడండి మరి.

English summary

Dry Skin Care Tips for Summer Season

With the enhanced flow of skin's oily discharge, epidermal layer may be prone to dullness, loss of luster and blemishes. Secondly, owing to the increased susceptibility to the damaging UV rays of sun, there is a consequential increase in the formation of patches and wrinkles. In order to overcome the seasonal blemishes and loss of collagen, it is important to comply with certain skin care regimen.
Story first published: Monday, April 28, 2014, 12:05 [IST]
Desktop Bottom Promotion