For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం 10 రోజుల్లో స్వచ్ఛమైన చర్మ సౌందర్యం

|

ప్రతి ఒక్క మహిళలు ఒక అందమైన, స్వచ్చమైన చర్మం సౌందర్యాన్ని కోరుకుంటుంది. అయితే, చాలా మంది మహిళలు మొటిమలు, డార్క్ సర్కిల్స్ మరియు ఇతర చర్మ సమస్యల భారీన పడుతుంటారు. కొన్ని రకాల చర్మ సమస్యల వెనుక స్కార్స్ మరియు స్పాట్స్ ముఖం మీద దాగి ఉంటాయి.

ఇటువంటి చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు, చిట్కాలను అనుసరించి ఉంటాయి. ఇంకా, కొన్ని రకాల క్రీమ్స్ మరియు జెల్స్ వంటివి అప్లై చేసినా కూడా అనుకొన్న ఫలితాలను ఇవ్వలేకపోవడంతో నిరాశ చెందుతుంటారు. కాబట్టి, మీ ముఖ చర్మంలో ఎటువంటి మచ్చలు, మొటిమలు, స్కార్స్ లేకుండా ఒక స్వచ్చమైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నించండి. ఈ నేచురల్ రెమెడీస్ వినియోగం వల్ల ఫలితం కొంత ఆలస్యం కావచ్చు. కానీ ఇది శ్వాసత పరిష్కారం ఇస్తుంది. అటువంటి నేచురల్ హోం రెమెడీస్ కేవలం 10రోజుల్లోనే మంచి ఫలితాలను ఇవ్వడానికి సహాయపడుతాయి.

స్వచ్చమైన చర్మం సౌందర్యం పొండానికి ఫ్రూట్ ఫేస్ ప్యాక్:క్లిక్ చేయండి

ఒక స్వచ్చమైన చర్మ సౌదర్యం పొందడానికి చాలా సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. అందుకు మీరు చేయాల్సిందల్లా మీరు కొన్ని బేసిక్ టిప్స్ ను అనుసరించాల్సిందే. అప్పుడే మీరు అనుకొన్న ఫలితాలను మీరు గమనించగలరు. ఉదా : మీరు ప్రతి రోజూ నాలుగు సార్లు మీ ముఖంను శుభ్రం చేసుకోవడం వల్ల, చర్మలో మొటిమలు, మచ్చలు, ఏర్పడటానికి కారణం అయ్యే మలినంతో పాటు బ్యాక్టీరియా తొలగిపోతుంది.

చర్మ రంగును కాంతివంతం చేసే ఫ్రూట్ ఫేస్ ప్యాక్: క్లిక్ చేయండి

అదే విధంగా రోజుకు సరిడా నీళ్ళు త్రాగడం మరియు డిటాక్స్ ఫుడ్స్ తినడం వల్ల కూడా శరీరంలో హార్మ్ ఫుల్ టాక్సిన్స్ ను తొలగించి, ఎటువంటి చర్మ సమస్యలను ఏకుండా ఒక స్వచ్చమైన చర్మ సౌందర్యం ఇస్తుంది.. మీరు తీసుకొనే ఆహారం కూడా మీ ఆరోగ్యం మీద మాత్రమే ప్రభావం చూపకుండా, మీచర్మం మీద కూడా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. కేవలం 10 రోజుల్లో స్వచ్చమైన చర్మసౌందర్యం పొందడానికి సహాయపడుతుంది.

ఫేస్ వాష్:

ఫేస్ వాష్:

కాంతివంతమైన ఫర్ ఫెక్ట్ క్లియర్ స్కిన్ పొందడానికి ఒది ఒక సింపుల్ హోం రెమెడీ . ప్రతి రోజు ముఖాన్ని మూడు, నాలుగు సార్లు ముఖం కడుక్కోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ కు కారణం అయ్యే బ్యాక్టీరియా, టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

షుగర్ అండ్ లెమన్:

షుగర్ అండ్ లెమన్:

క్లియర్ స్కిన్ పొందడానికి ఇది ఒక బెస్ట్ స్కిన్ కేటర్ టిప్. నిమ్మ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది మరియు పది రోజుల్లో చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే షుగర్ కూడా నేచురల్ ఎక్స్ ఫ్లోయేట్. ఈ రెండింటి కాంబినేషన్లో చర్మానికి స్క్రబ్ చేయాలి.

ఎక్స్ ఫ్లోయేట్:

ఎక్స్ ఫ్లోయేట్:

స్వచ్చమైన చర్మసౌందర్యం పొందడానికి, వారానికి ఒకసారి మీ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేయాలి. ఇలా కొన్ని సార్లు చేస్తుంటే మీ చర్మం శుభ్రపడుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. తాజా చర్మంను అంధిస్తుంది.

పాలతో శుభ్రం చేయడం:

పాలతో శుభ్రం చేయడం:

ఇది మరొక కామన్ స్కిన్ కేర్ చిట్కా. ఒక స్వచ్చమైన కాంతివంతమైన చర్మంను పొందడానికి పాలతో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడటంతో పాటు, చర్మం మంచి షైనింగ్ తో ఉంటుంది. ఇంకా డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ మరియు సన్ టాన్ నేచురల్ గా తొలగిస్తుంది.

స్టీమింగ్:

స్టీమింగ్:

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం రంధ్రాలు తెరుచుకొనే చేసి చర్మం లోపలినుండి మలినాలను శుభ్రం చేస్తుంది. దాంతో చర్మం స్వచ్ఛంగా మారుతుంది . మీ ముఖానికి ఆవిరి పట్టడానికి సమయం లేనప్పుడు, వేడినీటిలో ముంచి టవల్ ను బాగా నీళ్ళు పిండేసి , వేడి టవల్ ను మీ ముఖం మీద వేసుకోవాలి. 15నిముషాల తర్వాత తీయాలి. అప్పుడు చర్మ రంధ్రాలు తెరచుకొని, చర్మంరంధ్రాల్లో పూడుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించి మొటిమలు మచ్చలే రాకుండా కాపాడుతుంది.

ఫేస్ ప్యాక్స్:

ఫేస్ ప్యాక్స్:

మీకున్న చర్మసమస్యలకు సంబంధించిన ఫేస్ ప్యాక్ లను మాత్రమే వేసుకోవడం వల్ల చర్మ సమస్యలను నివారించవచ్చు . ఉదా: బెర్రీస్, టమోటో, నిమ్మ మరియు గ్రేఫ్ ప్రూట్ వంటిని మొటిమలు, మచ్చలు, సన్ టాన్ వంటి అనేక చర్మ సమస్యలను నివారిస్తాయి .

మేకప్ తొలగించండి:

మేకప్ తొలగించండి:

మీరు ఇంటికి చేరుకొన్నాక, అసట, నిద్రమత్తు, బద్దకంగా భావిస్తుంటే, జస్ట్ మేకప్ ను తొలగించండి.

మొటిమలను గిల్లకూడదు:

మొటిమలను గిల్లకూడదు:

మొటమలున్న ప్రదేశంలో చాలా మంది వాటిని ముట్టుకోవడం, లేదా వాటిని గిల్లడం చేస్తుంటారు.అలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్ ఏర్పడుతాయి. కాబట్టి, అటువంటి పనులు మానుకోవాలి.

చర్మ తప్పిదాలను నివారించాలి:

చర్మ తప్పిదాలను నివారించాలి:

మొటిమలను గిల్లడం, చీము తియ్యడం వంటి పనులు చేయడం కంటే వాటి మీ టూత్ పేస్ట్ రాయండి, ఇది సమస్యను తగ్గిస్తుంది .

నీళ్ళు:

నీళ్ళు:

పది రోజుల్లో ఒక స్వచ్చమైన చర్మం పొందడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ . ప్రతి రోజూ తగినన్ని నీరు త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ మరియు హానికరమైన కెమికల్స్ శరీరం నుండి బయటకు నెట్టివేసి, స్వచ్చమైన చర్మాన్ని అంధిస్తుంది.

మంచి నిద్రపొందాలి:

మంచి నిద్రపొందాలి:

నిద్రలేమి వల్ల చర్మం ప్రభావితం అవుతుంది . పది రోజుల్లో ఒక స్వచ్చమైన చర్మ సౌందర్యం పొందడానికి సరైన నిద్ర కనీసం ఒక రోజుకు 8గంటల నిద్ర అవసరం. అలాగే మీ పిల్లో కవర్స్ ను మార్చుతుండాలి. లేదంటే పిల్లోకున్న హెయిర్ ఆయిల్ చర్మంలో మొటిమలకు దారితీస్తుంది.

సన్ స్క్రీన్ లోషన్:

సన్ స్క్రీన్ లోషన్:

మీ చర్మాన్ని యూవీ కిరణాలు డ్యామేజ్ చేస్తాయి. దాంతో చర్మంలో డార్క్ స్పాట్స్ ఏర్పడుతాయి . కాబట్టి ప్రతి రోజూ బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా అప్లై చేయాలి.

టోనింగ్:

టోనింగ్:

ఫేష్ వాష్ తో పాటు, మీరు ఖచ్చితంగా టోనర్ ను కూడా ఉపయోగించండి. ఇది బ్యాక్టీరియా, మురికి తొలగించడానికి సహాయపడుతుంది . దాంతో చర్మంలో డార్క్ స్పాట్స్ మరియు స్కార్స్ ను నివారించి స్వచ్చమైన చర్మాన్ని అందిస్తుంది.

ఫాస్ట్ ఫుడ్స్ నివారించండి:

ఫాస్ట్ ఫుడ్స్ నివారించండి:

ఆయిల్ మరియు ఫాస్ట్ ఫుడ్స్ చర్మం మీద ప్రభావన్ని చూపుతుంది. ఈ ఆయిల్ ఫుడ్స్ చర్మ సమస్యలకు గురిచేస్తుంది. కాబట్టి, ఎట్టిపరిస్థితుల్లోనూ వీటి జోలికి పోకండి.

English summary

Get Clear Skin In Just 10 Days!

Every woman desires for a fair and flawless skin. However, most of the women become victims of skin problems like acne, dark circles and blemishes. These are some of the skin problems that leaves behind scars and spots on the face.
Desktop Bottom Promotion