For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం మీద మచ్చలను నివారించే ఆలివ్ ఆయిల్

|

ఆలివ్‌ రుచినీ, సువాస ననీ, విటమిన్స్‌నీ, సహజ లక్షణా లనీ, గుణాలనీ పదిలపరచు కున్న సహజమైన ఫలరసం ఆలి వ్‌ ఆయిల్‌. ఆలివ్‌ పండులోంచి పిండగానే వెనువెంటనే ఎంతో స్వాదిష్టంగా సేవించగలిగిన ఆయిల్‌ ఇది ఒక్కటే. ఆలివ్‌ ఆయిల్‌ని ఎప్పుడూ సూర్యరశ్మి సోకే చోట వుంచకూడదు. సీసా మూత గట్టిగా మూసి, చల్లగా పొడిగా వుండే ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి. ఏ ఉష్ణోగ్రతలలోనైనా ఆలివ్‌ ఆయిల్‌కి కొద్దిగా గాలి సోకినా అందులో రాన్‌సిడిటీ పెరిగిపోతుంది. కనుక మన గుండె బలానికీ, క్యాన్సర్‌ నివారణకీ ఎంతగానో దోహదం చేసే ఆలివ్‌ ఆయిల్‌ని ఎంతో భద్రంగా పదిల పరచి వాడుకుంటే, నిస్సందేహంగా ఆలివ్‌ ఆయిల్‌ మనపాలిట సంజీవనిగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఆలివ్ ఆయిల్ చర్మ సంరక్షణలోనూ, జుట్టు సంరక్షణలోనూ ఎంతో ఉపయోగపడుతుంది.

Get Rid Of Acne Scars With Olive Oil

1. పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ఆరారగా రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉంటుంది. కాంతిగానూ, మృదువుగానూ మారుతుంది.
2. ఆలివ్‌ఆయిల్‌లో పసుపుపొడిని కలిపి పాదాల పగుళ్ళకు, వేళ్ళమధ్య పాసిన చర్మానికి రాస్తూంటే ఆ బాధ తగ్గిపోయి, చర్మం చక్కగా ఉంటుంది.
3. ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి పెదాలకు రాయడం వల్ల పెదాలు పగలవు.
4. ఆలివ్‌ఆయిల్‌లో టమాటోరసం, క్యారెట్‌జ్యూస్‌, పెరుగుకలిపి చర్మం మీద ఏర్పడ్డ మచ్చలు, ఛారల మీద రాస్తూంటే, తొలగిపోతాయి. ఆలివ్ ఆయిల్ గోళ్ళకు మసాజ్ చేస్తే గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి. ఆలివ్‌ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంటే, గోళ్ళ ధృడత్వం, అందం పెరుగుతాయి.
5. చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్‌ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.
6. ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
7. స్నానం చేసే నీటిలో ఆలివ్‌ ఆయిల్‌ని కలిపి, ఆ నీటితో స్నానం చేసినట్ల యితే చర్మానికి నూతన కాంతి కలుగుతుంది. 8. ఆలివ్‌ ఆయిల్‌తో చర్మాన్ని మసాజ్‌ చేయడం వల్ల చర్మానికి మృదుత్వం ఏర్పడుతుంది.
9. చెంచా గ్లిజరిన్‌, కొద్దిగా రోజ్‌వాటర్‌, రెండుచెంచాల ఆలివ్‌నూనె, కాస్త నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి చేతులకు పూతలా వేసుకోవచ్చు. ఆరాక కడిగేసుకుంటే చాలు... చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
10. చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్‌ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.

English summary

Get Rid Of Acne Scars With Olive Oil

Acne, one of the most frightful things on this earth, tends to give girls and women across the globe a sort of nightmare. You would not want to open your eyes to pimples early on in the morning, especially on a day when you are heading for an important meeting. Hiding the acne is another issue that you would need to deal with along with preparing for the meeting. It is an even bigger issue when you are heading for your first date and you see a pimple sitting happily on your face.
Story first published: Friday, March 28, 2014, 14:57 [IST]
Desktop Bottom Promotion