For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల ముఖం మీద మొటిమలు& మచ్చలు: ఉత్తమ చిట్కాలు

|

సాధారణంగా మొటిమలు మచ్చలు ఎక్కువగా టీనేజ్ గర్ల్స్ కు, మహిళలకు బాధిస్తుంటాయి. ఈ మొటిమలు చర్మ సమస్య కంటే ఎక్కువగానే కనిపిస్తుంటాయి. టీనేజ్ గర్ల్స్ మహిళలకు మాత్రమే కాదు, పురుషుల్లో కూడా చర్మ సమస్యలతో పాటు మొటిమలు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. మరియు ఇవి కలుగుటకు గల కారణం కూడా యవ్వన వయసులో కలిగే హార్మోన్'ల ప్రభావం లేదా మార్పు అని చెప్పవచ్చు. ఈ మొటిమల తగ్గుదల కోసం క్షౌరశాలలో చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, కానీ అవి ఖచ్చితంగా తగ్గిస్తాయని నమ్మకం మాత్రం తక్కువే అని చెప్పవచ్చు. ఈ రకమైన క్రీమ్'లు రసాయనాలతో తయారు చేస్తారు కొంత మందికి ఇవి పనిచేయవచ్చు మరికొంత మందిలో ఇవి పని చేయకపోవచ్చు. ఎలాంటి ఖర్చు, దుష్ప్రభావాలు లేకుండా మీ ముఖం పైన కలిగిన మొటిమలను తగ్గుంచుకోవాలి అనుకుంటున్నారా... అయితే మీ కోసం ఇక్కడ కొన్ని రకాల ఔషదాలు తెలుపబడ్డాయి...

నారింజ పండు తొక్క

నారింజ పండు తొక్క

నారింజ పండు తొక్క మొటిమలకు ఇంట్లో ఉండే సహజ సిద్ద ఔషదంగా చెప్పవచ్చు. ఇది పుష్కలంగా విటమిన్ 'C'లను కలిగి ఉండి, చర్మ కణాలలో విటమిన్ 'C' స్థాయిలను వేగంగా పెంచి, మొటిమలలో కలిగే ఇన్ఫ్లమేషన్'లను స్థంభింప చేస్తుంది. ఇలా నారింజ పండు తొక్కలను చర్మానికి వాడటం వలన చర్మం సహజసిద్ధంగా మారుతుంది అని చెప్పవచ్చు. ఇందులో మొదటగా నారింజ పండు తొక్కలను తీసుకొని వాటిని మెత్తగా దంచాలి; వీటికి నీటిని కలుపుతూ ఒక పేస్ట్'లా తయారు చేయాలి. ఈ పేస్ట్'తో ముఖానికి ఒక మాస్క్'లాగా వేసుకొని 15 నిమిషాల పాటూ అలాగే ఉంచుకోవాలి. ఒకవేళ మీరు దురదలు, చర్మం ఎర్రగా మారటం వంటి వాటిని గమనించినట్లయితే, నారింజ పండు పేస్ట్'ని మళ్ళి వాడకండి కారణం- మీ చర్మం విటమిన్ 'C'కి సున్నితత్వాన్ని కలిగి ఉండి, బహిర్గతం అవటం వలన అలర్జీలకు లోనవుతుంది అని అర్థం.

మంచు

మంచు

మొటిమలకు చికిత్సగా మంచును వాడటం వలన చర్మ కణాలలో రక్త ప్రసరణను పెంచి మొటిమలను తగ్గు ముఖం పట్టిస్తుంది. మంచు వలన చర్మం పైన ఉండే రంధ్రాలను స్థంభింపచేసి, వాటిలో ఉండే దుమ్ము ,ధూళి తోలగిస్తాయి. సౌకర్యవంతమైన విధంగా మంచు పొడి లేదా మంచు గడ్డలను వాడండి. మొదటగా, మంచు గడ్డలను లేదా ముక్కలను ఒక గుడ్డలో చుట్టి ప్రభావిత ప్రాంతాలలో రెండు లేదా మూడు సెకన్'ల పాటు ఉంచండి. తిరిగి కాస్త సమయం అయ్యాకా తిరిగి ఇలాగే చేయండి. ఈ పద్దతి వలన మీరు త్వరిత ఫలితాలను పొందే అవకాశం ఉంది -

టూత్ పేస్ట్

టూత్ పేస్ట్

టూత్ పేస్ట్ కాలిన గాయాల నుండి ఉపశమనాన్ని కలిగించే ఔషదంగా అందరికి తెలిసిందే. కానీ, టూత్ పేస్ట్ చర్మం పైన కలిగే మొటిమలను త్వరగా తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుందని చెప్పవచ్చు. మంచు ముక్కలను వాడిన తరువాత టూత్ పేస్ట్ రెట్టింపు శక్తివంతంగా పని చేస్తుంది అని చెప్పవచ్చు. మీరు వాడే క్రీమ్'ల కన్నా ఇది శక్తివంతంగా పని చేస్తుంది. మీరు రాత్రి పడుకునే సమయానికి ముందుగా మొటిమల ప్రభావిత ప్రాంతంలో ఈ టూత్ పేస్ట్'ను రాసి, ఉదయాన లేసిన తరువాత నీటితో కడిగివేయండి. అద్బుతమైన ఫలితాలను గమనిస్తారు.

వెల్లుల్లి

వెల్లుల్లి

రక్తంలో ఉండే మలినాల వలన మొటిమలు కలుగుతాయి. మీ చర్మం పైన కలిగే మొటిమలకు కారణం వైద్యుడిని కలిసి తెలుసుకోవటం చాలా మంచిది. ఒకవేళ రక్తంలో ఉండే మలినాల వలన మొటిమలు కలిగినట్లయితే, మీరు సహజసిద్దమైన మూలకాలను, ఉత్పత్తులను వాడటం మంచిది, ఈ సహజ ఉత్పత్తుల వాడకం వలన శరీరంలో ఉండే విషపూరిత పదార్థాలను వినాశనం చేస్తాయి. వీటిలో వెల్లుల్లి ఒక సహజ సిద్ద మూలకంగా చెప్పవచ్చు, ఇది విషపదార్థాలను తగ్గించటమే కాకుండా, జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. వెల్లుల్లి వాడకం వలన కొన్ని రోజులలోనే మంచి ఫలితాలను పొందుతారు.

కొత్తిమీర: మొటిమలను చల్లబరచండి

కొత్తిమీర: మొటిమలను చల్లబరచండి

కొత్తిమీర రసం మొటిమలను తగ్గించే శక్తివంతమైన ఇంట్లో ఉండే ఔషదంగా చెప్పవచ్చు, ముఖ్యంగా ఎండాకాలంలో చర్మం పైన ఏర్పడే మొటిమలను చల్లబరచి వాటిని విచ్చిన్నపరుస్తుంది. సగం చెంచా పసుపు మరియు కొత్తిమీర రసం లేదా పేస్ట్'లా చేసి, మీరు పడుకోటానికి ముందుగా మొటిమల ప్రభావిత ప్రాంతంలో ఈ ఔషదాన్ని రాయండి. ఈ ఔషదాన్ని పూర్తి రాత్రి వరకు ఉంచి, ఉదయాన కడిగివేయండి. పుదీనా కూడా మొటిమలను తగ్గించే ఒక మంచి ఔషదంగా చెప్పుకోవచ్చు. పుదీనా, ఎండాకాలంలో నుదుటి పైన చెమటల వలన కలిగే చిన్న చిన్న మొటిమలకు (చెమట కాయ) ఔషదంగా పనిచేస్తుంది.

పొడి చర్మంపై వచ్చే మొటిమలు: బాదం

పొడి చర్మంపై వచ్చే మొటిమలు: బాదం

పొడి చర్మం పైన మొటిమలు రావటం అసాధారణం అని చెప్పవచ్చు. పొడి చర్మంతో పాటూ మొటిమలు కలిగి ఉన్నవారు సాధారణంగా రెండు సమస్యలతో భాదపడుతుంటారు. మొదటిది, మొటిమలను కలిగి ఉన్నందు వలన తేమను ఉత్పత్తులను పొడి చర్మానికి వాడలేము, అంతేకాకుండా పొడి చర్మం గల వారి రంధ్రాలలో దుమ్ము, ధూళి పేరుకుపోయి ఉంటుంది. ఈ రకమైన చర్మానికి చికిత్సగా తేనే మరియు బాదాంలను కలిపి తయారుచేసిన పేస్ట్'లను వాడటం. మొటిమలతో ఉన్న పొడి చర్మానికి ఈ ఔషదం శక్తివంతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఈ ఔషదాన్ని తయారు చేసిన తరువాత ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత కడిగివేయండి. మంచి ఫలితాలను పొందుతారు.

మల్టి విటమిన్ : విటమిన్'లు మరియు జింక్

మల్టి విటమిన్ : విటమిన్'లు మరియు జింక్

మొటిమల విచ్చిన్నం తరువాత త్వరగా కోలుకోటానికి ముఖ్యంగా కొన్ని ప్రత్యేక విటమిన్'ల సేకరణ తప్పని సరి. విటమిన్ 'A'ను సాధారణంగా మొటిమలకు తగ్గించటానికి తయారుచేసే క్రీమ్'ల తయారీలో వాడుతుంటారు. కావున మీరు విటమిన్ 'A' తీసుకోటాన్ని అధికం చేయటానికి ఎక్కువగా చిలకడ దుంప (స్వీట్ పొటాటో), లీన్ మీట్, గుడ్డు వంటివి తినండి. మొటిమలను తగ్గించుటలో ముఖ్యపాత్ర పోషించే నియాసిన్ మరియు విటమిన్ 'B౩'లు ఉన్న ఆహర పదార్థాలను తినండి. జింక్ ఎక్కువగా కలిగి ఉండే పుప్పొడి పండు, టమాట వంటి వాటిని కూడా ఎక్కువ తినటానికి ప్రయత్నించండి.

English summary

Home Remedies for Acne and Pimples in Men

Acne or pimples are among the most common of skin problems with a global prevalence.
 Earlier, it was believed that only those in their teens or late-teens are prone to developing acne. Now, pimples due to stress, lifestyle choices, hormonal changes and various forms of adult acne have been discovered.
Story first published: Monday, September 22, 2014, 18:21 [IST]
Desktop Bottom Promotion