For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి ఎండలకు చర్మం నల్లగా మారుతుంటే ఇలా చేయండి

|

కొంతమందికి శరీరంపై వివిధ భాగాల్లో చర్మం నల్లబడుతుంటుంది. మరీ ముఖ్యం గా ఎండ వేడి తాకే ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎండలోకి వెళ్తే చాలు... చర్మం పై మంట పుడుతుంది. ఎండ తాకిన ప్రాంతం నల్లబడుతుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. ఈ విధమైన సమస్యలను పిగ్మెంటేషన్‌ సమస్యలుగా చెబుతుంటారు.

హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌ సంబంధిత సమస్యలు, దీర్ఘకాలంగా వాడుతున్న కొన్ని రకాల మందుల కారణంగా, శిరోజాలకు క్రమం తప్పకుండా రంగు వేసుకునే వారికి ఈ విధమైన పిగ్మంటేషన్‌ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి సూర్యుడి అతి నీలలోహిత కిరణాల వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు వచ్చిన తరువాత తగు చర్యలు తీసుకోవడం కంటే కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు. ఆరంభ దశలోనే ఈ సమస్యలను గుర్తిస్తే పరిష్కారం కూడా సులువే అవుతుంది.

కొన్ని చిట్కాలు...

 వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తాగాలి.

 వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి.

 వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

బయటకు వెళ్ళడానికి 30 నిమిషాల ముందే సన్‌క్రీమ్‌ లోషన్‌ ముఖానికి రాసుకోవాలి.

 వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని ఆ తరువాత చన్నీళ్ళతో స్నానం చేయాలి.

 వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

కొంచెం క్యారెట్‌, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్‌ కలిపి మిక్సర్‌లో వేసి పేస్ట్‌గా తయారు చేసి, దానిలో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై నల్లమచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.

 వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

పిగ్మెంటేషన్‌ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి వస్తే, ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్‌ కావాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

 వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

విపరీతమైన ఎండలతో చర్మం కండి పోతుంది. ఇలాంటి సమయంలో చర్మానికి చలువ చేసే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మానికి పునరుత్తేజం తీసుకురావచ్చు.

 వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

టీస్పూన్స్ ఓట్‌మీల్, 1టీస్పూన్ చందనపు పొడి, తేనె, నిమ్మకాయపొడి, గుడ్డులోని తెల్లసొన కలిపి ముద్దలా చేసి మీ చేతులకు, కీళ్ళకు, వేళ్ళ మధ్యలో సమానంగా పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. చిక్కని పాలతో ఆరిన దానిపై రుద్దాలి. తర్వాత చన్నీటితో కడిగేయండి. దీంతో చేతులు మృదువుగా చిన్న పిల్లల చర్మంలా తయారవుతుంది.

 వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

వేసవి ఎండలకు చర్మం నల్లబడుతుంటే?సులభ చిట్కాలు

మెడ, వీపు భాగానికి బాడీలోషన్‌ను ఎప్పటికీ మరువకూడదు. మీకు ప్రకృతి సిద్ధమైన లోషన్ కావాలంటే.. మందార, లావెండర్, ఆప్రికాట్ నూనెలను కలిపి మర్దన చేస్తే సరిపోతుంది. ఇది చర్మని మృదువుగా చేయడమే కాక సూర్య కాంతి నుంచి కూడా కాపాడుతుంది.

English summary

Home Remedies for Sun Tanned Skin

Tanned skin may be as natural as day or moonlight, but in the realm of beauty and good looks it is likely to draw a line in the sand separating the world of grooming and style and that without them. While there are ones to opt for overall tanning as part of styling strategy, partial tanning of skin can not only make you feel off color, but exposes your quotients of grooming and styling to risk. But there are ways whereby you can tide over the commonly recurring issue of uneven skin tanning.
Story first published: Friday, April 18, 2014, 13:00 [IST]
Desktop Bottom Promotion