For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గులాబీ రంగు చెక్కిళ్ళను సహజంగా పొందటం ఎలా

By Super
|

ప్రకాశించే గులాబి రంగు చెక్కిళ్ళు పొందాలని ఎవరికీ మాత్రం ఉండదు. చెక్కిళ్ళు సహజమైన కాంతితో చర్మంను చాలా ఆరోగ్యకరముగా కనిపించేలా చేస్తాయి. దీని కోసం మీరు సహజ మార్గం ద్వారా ఇంట్లో తయారు చేసిన ప్యాక్స్ ను ఉపయోగించవచ్చు.

బీట్రూట్ గుజ్జు

బీట్రూట్ గుజ్జు

బీట్రూట్ చర్మానికి ఒక గులాబీ రంగు ప్రభావాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. రెండు బీట్రూట్స్ తీసుకోని ఉడికించి మెత్తగా గుజ్జు చేయాలి. దీనికి మూడు స్పూన్ల చైన పౌడర్(ఇది స్థానిక కెమిస్ట్ షాప్ వద్ద సులభంగా అందుబాటులోఉంటుంది) ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడ మీద రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి.

మసూర్ దాల్ మరియు పాలు

మసూర్ దాల్ మరియు పాలు

పచ్చి పాలలో మసూర్ దాల్ వేసి అర గంట నానబెట్టాలి. ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలో కొంచెం చైన పౌడర్ కలిపి మీ ముఖానికి రాసి 20 నిముషాలు అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

శనగపిండి,పాల మీగడ, గోధుమ ఊక మరియు పెరుగు

శనగపిండి,పాల మీగడ, గోధుమ ఊక మరియు పెరుగు

ఒక మృదువైన బ్లష్ వంటి ప్రభావం పొందడానికి,రెండు లేదా మూడు స్పూన్ల శనగపిండిలో పాలమీగడ, గోధుమ ఊక మరియు మూడు టీ స్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి బాగా పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి.

 దోసకాయ గుజ్జు

దోసకాయ గుజ్జు

నిస్తేజంగా ఉన్న మీ చర్మం మరియు చనిపోయిన చర్మ కణాలు బయటకు ఎక్స్ ఫ్లోట్ అవటం చాలా ముఖ్యం. మీ ముఖం మీద దోసకాయ గుజ్జును రాస్తే,అది అద్భుతమైన చర్మ సౌందర్య ఏజెంట్ గా పనిచేస్తుంది. అంతేకాక డార్క్ సర్కిల్లు తగ్గటానికి సహాయం చేస్తుంది.

దోసకాయ,నిమ్మకాయ,పాలు మరియు తేనె పేస్ట్

దోసకాయ,నిమ్మకాయ,పాలు మరియు తేనె పేస్ట్

మీరు ఇంటిలోనే ఈ ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. తురిమిన దోసకాయలో పావు కప్పు నిమ్మరసం,5 స్పూన్స్ పాలు,5 స్పూన్స్ తేనే కలిపి పేస్ట్ చేయాలి. ఇది కొంచెం మందంగా మారటానికి కొద్దిగా పిండిని కలపాలి. ఈ మిశ్రమంను 5-6 గంటలు రిఫ్రిజరేటర్లో ఉంచండి. మీ ముఖం మీద ఈ చల్లని ప్యాక్ ను వేసి 15-20 నిమిషాల పాటు ఉంచితే ప్రకాశించే గులాబీ చెక్కిళ్ళు మీ సొంతం అవుతాయి.

 నిమ్మకాయ మరియు పాల మసాజ్

నిమ్మకాయ మరియు పాల మసాజ్

మసాజ్ అనేది చర్మంను యవన్నంగా మరియు ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. దీని కోసం, పాలలో 1/4 వ కప్పు నిమ్మ రసంను కలపాలి. మీ ముఖం మీద నిమ్మకాయ మరియు పాలతో మసాజ్ చేస్తే రక్త ప్రసరణ సులభతరం అవుతుంది.

బాదం పేస్ట్

బాదం పేస్ట్

ప్రకాశించే ఆరోగ్యకరమైన చర్మానికి తేమ అవసరం. కొన్ని బాదం పప్పులు,కొన్ని గులాబి రేకులను కలిపి పేస్ట్ చేసి దానిలో 5 స్పూన్స్ పుదీనా రసం మరియు తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని 5-6 రోజులు ఫ్రిజ్లో ఉంచుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్ ఒక వారంలోనే మీ చర్మం మీద ఫలితాన్ని చూపించటం ప్రారంభిస్తుంది. ఈ ఫేస్ మాస్క్ ను పడుకునే ముందు రాయవచ్చు.

ఈ ఫేస్ ప్యాక్స్

ఈ ఫేస్ ప్యాక్స్

ఈ ఫేస్ ప్యాక్స్ ద్వారా మంచి పలితాలను పొందాలంటే క్రమం తప్పకుండా ఆచరించాలి. ఇవి సులభమైన మరియు సహజమైన ఉత్తమమైన పద్దతులు. ఇప్పటికీ ఖచ్చితంగా చర్మం ప్రకాశ వంతముగా ఉండటాన్ని చూడవచ్చు.

English summary

How to get pink cheeks naturally


 Glowing, pink cheeks can outdo any blush on or make-up. The natural radiance on the cheeks makes the skin look so much healthier. You can ditch your usual blush and go the natural way with some home-made packs:
Desktop Bottom Promotion