For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానసిక ఒత్తిళ్ళు తగ్గించుకొంటే మొటిమలు మాయం...

|

ఒక్క చిన్న మొటిమ కనబడితే ఎంత పెద్ద మనిషైనా ఉలిక్కి పడతాడు. మొటిమకు ఉన్న పవర్‌ అలాంటిది. అలాంటి మొటిమలను చిన్న గిల్లుడు గిల్లితే చాలు ముఖం అందవికారంగా తయారయిపోతుంది. ఈ మొటిమల సమస్య చిన్నగానే కనిపించినా, దాని ప్రభావం మనుషులపై చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే వైద్యులు ఈ మొటిమలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. వీటిని పూర్తిగా నివారించటానికి అనేక కొత్త వైద్య పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి.

దాదాపు 80 శాతం మందికి మొటిమల సమస్య ఉంటుంది. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహార పానీయాల్లో వచ్చిన తేడాలు, మానసిక ఒత్తిళ్లు ఈ మొటిమలు రావడానికి గల కారణాల్లో కొన్ని. ఇటీవల కాలంలో మానసిక ఒత్తిళ్ల వల్ల మొటిమలు రావటం బాగా పెరిగింది. మానసిక ఒత్తిళ్లు శరీరంలోని హార్మోన్‌ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. దీని ప్రభావం వల్ల మొటిమలు వస్తాయి. కొంత మంది పిల్లల్లో 8 ఏళ్ల వయసులోనే మొదలయ్యే ఈ సమస్య 40 ఏళ్ల వయసు దాకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కారణాలతో పాటుగా ఆహారంలో హార్మోన్లను కలపటం వల్ల కూడా మొటిమలు వస్తున్నాయి. పాల ఉత్పత్తి పెంచడానికి ఆవులకు, గేదెలకు, బరువు పెరగటానికి కోళ్లకు ఇచ్చే ఆహారంలో హార్మోన్లు కలుపుతుంటారు. ఆ మాంసం తిన్న వారిలో సహజంగానే హార్మోన్‌పరమైన సమస్యలు మొదలై, అవి మొటిమలకు దారి తీస్తాయి. కొన్ని సార్లు తల్లుల్లో హార్మోన్‌ సమస్యలు ఉంటే అవి పిల్లలకు సంక్రమించి మొటిమలు వస్తాయి. ''మొటిమలు రావటానికి ఒక కారణమని చెప్పలేం. దీర్ఘకాలికంగా వేసుకొనే మందుల దగ్గర నుంచి తలనొప్పి వస్తోందని తరచూ రాసుకొనే బామ్‌ల దాకా కారణాలే.''

How to Heal Acne Caused by Stress

ఇన్‌ఫెక్షన్లు కూడా కారణమే..

ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం మొటిమలు రావటానికి రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయి. వీటిలో మొదటిది చర్మరంధ్రాలు మూసుకుపోవటం. రెండోది ఇన్‌ఫెక్షన్లు రావటం. చర్మగ్రంధులు మూసుకుపోవటం సమస్య అయితే రెటినాయిడ్‌ క్రీములు రాస్తే తగ్గిపోతాయి. ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే మొటిమలు చీము పడతాయి. అలాంటి మొటిమల్ని తగ్గించటానికి యాంటీ బ్యాక్టీరియల్‌ క్రీములను ఇస్తారు. కొన్ని సార్లు లోపల ఇన్‌ఫెక్షన్‌ బాగా పెరిగిపోతే- ఈ క్రీములు పనిచేయవు. అలాంటి సమయాల్లో యాంటీ బయాటిక్స్‌ ఇస్తారు. వీటిని కూడా దీర్ఘకాలం వాడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు వీటికి కూడా మొటిమలు లొంగవు. ఈ మందులు వేసుకున్నా మొటిమలు వస్తూనే ఉంటాయి. అలాంటి సమయాల్లో లివర్‌ పనితీరులో ఏమైనా తేడాలు ఉన్నాయా? క్లోమగ్రంధిలో ఏమైనా తేడాలు ఉన్నాయా? లిపిడ్‌ ప్రొఫైల్‌ ఎలా ఉంది? మొదలైన అంశాలను పరిశీలించటానికి పరీక్షలు చేయిస్తారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే- పిసిఓడి ( పాలిసిస్టిక్‌ ఓవరియన్‌ డిసీజ్‌) ఉండడం వల్ల కూడా మొటిమలు రావచ్చు. వీళ్లకు హార్మోన్‌ చికిత్స చేయాల్సి ఉంటుంది. మొటిమలు తగ్గుముఖం పట్టే సమయంలో కొందరు మందులను మానేస్తారు. దీనివల్ల సమస్య మళ్లీ ముందుకు వస్తుంది. అలాంటి సమయాల్లో మళ్లీ మందులను వాడాల్సి ఉంటుంది.

ఒత్తిళ్లను అధిగమించాలి..

మొటిమల నుంచి పిసిఓడి దాకా మానసిక ఒత్తిళ్లతో వచ్చేవే. ఈ ఒత్తిళ్లు మొత్తం హార్మోన్‌ వ్యవస్థనే అస్తవ్యస్తం చేస్తున్నాయి. పిల్లల్లో స్కూలు చదువులకు సంబంధించిన ఒత్తిళ్లయితే, కాస్త పెద్దవాళ్లల్లో వృత్తి పరమైన ఒత్తిళ్లు ఉంటున్నాయి. అయితే, ఆ ఒత్తిళ్లను అధిగమించే మానసిక పరిణతి గానీ, కనీసం క్రమం తప్పకుండా వ్యాయామం చేసే సమయంగానీ లేవన్నది చాలా మంది యుక్త వయస్కుల సమాధానం. కానీ, ఈ సమాధానం ఎవరిని ఒప్పించడానికి? మన సమాధానం కోసం ఎదురుచూసే వారెవరూ అవతల లేరు. వ్యాయామం చేయకపోతే ఒత్తిళ్లు పెరగడం ఖాయం. మొటిమలు మరింతగా పెరిగిపోవడమూ ఖాయం. మానసిక ఒత్తిళ్లు మొత్తం మానసిక ఒత్తిళ్లు బాగా పెరిగిపోవడం వల్ల మొటిమలు రావడం ఒక్కటే కాదు. పిసిఓడికి కూడా అది దారి తీస్తుంది. ఇటీవలి కాలంలో థైరాయిడ్‌ సమస్యలు పెరిగిపోవడానికి కూడా ఈ ఒత్తిళ్లే కారణం కదా! పిన్న వయస్కుల్లో మానసిక పరిణతి గురించి ఆశించలేం గానీ, శారీరక వ్యాయామమైతే చేయవచ్చు. శారీరక వ్యాయామం నాడీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఒత్తిళ్లను అవలీలగా ఎదుర్కొనే శక్తినిస్తుంది. అది మొటిమల నుంచి పిసిఓడి దాకా అన్ని సమస్యల్నీ అధిగమించేందుకు పూర్తిగా తోడ్పడుతుంది.

English summary

How to Heal Acne Caused by Stress

You suddenly notice in your early 30s that the dreaded pimples that you thought you have got rid of once and for all in your teens are making a reappearance yet again. The fact is you are not alone in your misery. Studies show that one in five women between the ages of 25 and 40 suffer from adult acne.
Story first published: Wednesday, July 23, 2014, 18:27 [IST]
Desktop Bottom Promotion