For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖం మీద ఉన్న మచ్చలను తొలగించటం ఎలా

By Super
|

మోటిమలు చాలా బాధించే ఒక సాధారణ చర్మ సమస్య అని చెప్పవచ్చు. మోటిమలకు సరైన మందులు మరియు చర్మ సంరక్షణ ద్వారా నయం చేయవచ్చు. అయితే, మోటిమలు మీ చర్మ అందంను నాశనం చేసే మార్కులు మరియు మచ్చలను వదులుతాయి. మీకు మార్కెట్ లో అందుబాటులో ఉండే సాధారణ చర్మ క్రీమ్స్ తో మచ్చలను తగ్గించటం సాధ్యం కాదు. కొంతమంది ప్రజలు ఈ మచ్చలను వదిలించుకొనే క్రమంలో లేజర్ చికిత్స కోసం వెళ్ళతారు. అదృష్టవశాత్తూ, మీకు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మోటిమల మచ్చలను వదిలించుకోవటానికి సహాయపడే కొన్ని సహజ నివారణలు ఉన్నాయి.

ముఖం మీద మచ్చలను తొలగించటానికి కొన్ని హోం రెమడీస్ క్రింద ఇవ్వబడ్డాయి. అయితే,మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి కొన్ని రోజులు మరియు స్టెప్స్ ను అనుసరించే ఓపిక ఉండాలి.

ముఖం మీద మచ్చలు తొలగించటానికి సహజ నివారణలు

ఆలివ్ నూనె

ఆలివ్ నూనె

ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. ముఖానికి ఆయిల్ రాసాక లైట్ గా ఆవిరి పట్టాలి. అప్పుడు రంధ్రాల క్లియర్ అవుట మరియు మచ్చలు తగ్గటం జరుగుతుంది.

గంధం

గంధం

గంధం రాసుకుంటే మచ్చలు తగ్గటానికి సహాయపడుతుంది. గందంలో రోజ్ వాటర్ లేదా పాలు కలిపి పేస్ట్ చేసి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఒక గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాదంపప్పు

బాదంపప్పు

పాలు లేదా నీటిలో బాదంపప్పులను 12 గంటలు నానబెట్టాలి. ఆ తరవాత నానిన బాదంపప్పు పై తొక్క తీసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో రోజ్ వాటర్ కలిపి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి.

నిమ్మ రసం

నిమ్మ రసం

నిమ్మ రసంను ప్రతి రోజు మూడు సార్లు త్రాగితే మచ్చలు తగ్గుతాయి. ఈ విధంగా రెండు వారాల పాటు చేయాలి.

స్క్రబ్బింగ్

స్క్రబ్బింగ్

బేకింగ్ సోడా తో మీ ముఖాన్ని స్క్రబ్బింగ్ చేస్తే మచ్చలు తగ్గటానికి సహాయపడుతుంది. బేకింగ్ సోడా లో కొంచెం నీరు పోసి కలిపి ముఖానికి పట్టించి రెండు నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో కడగాలి. అయితే దీనిని క్రమం తప్పకుండా చేయాలి.

ముల్లంగి విత్తనాలు

ముల్లంగి విత్తనాలు

ముల్లంగి విత్తనాలను పేస్ట్ చేసి క్రమం తప్పకుండా ముఖానికి రాయాలి. ఇది మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బంగాళాదుంప

బంగాళాదుంప

బంగాళాదుంప మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సల్ఫర్ మరియు పొటాషియంలను కలిగి ఉంటుంది. పచ్చి బంగాళదుంప గుజ్జు నుంచి తీసిన రసంను మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి.

English summary

How to Remove Facial Scars

Acne is a common skin disorder that can be quite annoying. Acne can be treated with proper medication and skincare. However, acne leaves behind marks and scars that can ruin the beauty of your skin.
Story first published: Wednesday, August 27, 2014, 17:54 [IST]
Desktop Bottom Promotion