For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతిగా ఫేస్ వాష్ చేయడంతో అనార్థాలెన్నో..

|

చాలా మంది మహిళలు ఎప్పుడు అందంగా, ఫ్రెష్ గా ఉండాలని సమయం సందర్భం లేకుండా మొహం కడిగేసుకుంటుంటారు. అటువంటి వంటి వారి ఎన్ని సార్లు ముఖం కడుగుతామ్ అంటే క్లీన్ గా ఉంటే తప్పేంటి అంటుంటారు? క్లీన్ గా ఉండటం తప్పు కాదు...కానీ దానికి కూడా ఒక పరిమితి అంటూ ఉంటుంది కదా!అలా ఎప్పుడు పడితే అప్పుడు ముఖం కడుక్కుంటే, శుభ్రంగా ఉండే మాట పక్కన పెట్టి, లేనిపోని సమస్యలు ఎదుర్యే అవకాశం లేకపోలేదు.
ఎందుకంటే, ఏవిషయంలోనైనా అతి పనికిరాదని పెద్దలు ఊరికే అంటుంటారా. ఫేస్ వాష్ విషయంలో కూడా అంతే!మరి, ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేస్తే ఏమవుతుంది? అసలు ఎప్పుడు, ఎలా ఫేస్ వాష్ చేసుకుంటే, మంచిది ??ఈ విషయాల్నీ ఈ క్రింది విధంగా తెలుసుకోండి.

చీటికిమాటికి ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపై పేరుకునే దుమ్ము పోయిశుభ్రంగా ఉంటుంది. మనలో చాలా మంది ఇది నిజమే అనుకుంటారు. కానీ, అది పొరపాటు. ఎందుకంటే, ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మం ఉత్పత్తి చేసే ‘సెబమ్' అనే ద్రవం తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం సంబంధిత వ్యాధులు సైతం తలెత్తే అవకాశాలు లేకపోలేదు. అంతే కాకుండా చర్మం మరింత పొడిబారిపోయి, గరుగ్గా మారిపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకూ బాగా అవసరం అనిపిస్తేనే ఫేస్ వాష్ చేసుకోవడం ఉత్తమం. అంటే రోజుకు 2 నుంచి 3 సార్లు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అది కూడా గాఢత తక్కువ ఉండే సబ్బులు లేదా లిక్విడ్ ఫేస్ వాష్ లతో మాత్రమే.

చర్మ తత్వంను బట్టి ఫేస్ వాష్: ఒక్కొక్కరికి చర్మం ఒక్కోలా ఉంటుంది. కొందరిది నార్మల్ గా ఉంటే, మరికొందరిడి డ్రైగా ఉంటుంది. ఇంకొందరిది ఆయిలీగా ఉంటుంది. ఇంతకీ మీ చర్మం ఎలాంటిదో మీకు తెలుసా? తెలియకపోతే వెంటనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి తెలుసుకోండి. మీరు తీసుకోవల్సిన జాగ్రత్తలు మీ చర్మం మీద ఆధారపడి ఉంటాయ. ఉదా మీకు నార్మల్ చర్మతత్వమైతే మీరు రోజులో 1 లేదా 2 సార్లు ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. తాజాగా ఉండటంతో పాటు మీ చర్మంలో ఉండే తేమ అలాగే నిలిచి ఉంటుంది. అలాగే జిడ్డు చర్మ తత్వం ఉన్నవారు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ ని ఉపయోగిస్తే కాస్త ఎక్కువ సమయం ఫ్రెష్ గా కనిపించే అవకాశం ఉంటుంది.

Side Effect of using Face Wash Many Times

ఎలాంటి ఫేస్ వాష్ ఎంపిక చేసుకోవాలి: మీ చర్మతత్వానికి తగిన ఫేస్ వాష్ లిక్విడ్ లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అయితే కొందరికి ఎలాంటి ఫేస్ వాష్ లిక్విడ్స్ అయినా సెట్ అవుతాయి. ఎలాంటి సమస్యలూ తలెత్తవు. కానీ, మరికొందరికి చర్మం అవసరారలు వేరే ఉండవచ్చు. అందుకే మన చర్మం అవసరాలకు అనుగుణంగా ఉన్న లిక్విడ్స్ నే పేష్ వాష్ గా ఎంపికచేసుకోవడం ఉత్తమం. అయితే వీలైనంత వరకూ గాఢత తక్కువ కలిగి ఉండే వాటిని ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

తేమని కాపాడుకోవాలి: చర్మంలోనిని తేమను కాపాడుకోవాలి. అప్పుడు ముఖం తాజాగా కనిపిస్తుంది. ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి సున్నితత్వం కోల్పోతుంది. ఫలితంగా ముఖం బాడిపోయినట్లు కనిపిస్తుంది. అందుకే ఎంత వీలైతే అంత తక్కువగా ఫేస్ వాష్ చేసుకోవడం మంచిది.

బాదం నూనె: స్నానం చేయడానికి ముందు బాదం నూనెను ముఖానికి బాగా పట్టించాలి. అలాగంట పాటు వదిలేస్తే చర్మం పోషణకు అవసరం అయ్యే పోషకాలను , తేమను చర్మగ్రంధులు పీల్చుకుంటాయి. తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కుంటే ఎంత సున్నితంగా మారుతుందో మీరే గమనించవచ్చు.

ఫేస్ వాష్ కు ప్రత్యామ్నాయంగా : మార్కెట్లో అందుబాటులో ఉండే వైట్ వైవ్స్ తో ముఖం తుడుచుకుంటే చాలు. చర్మం శుభ్రమవడమే కాకుండా, తాజాదన్ని కూడా సంతరించుకునేలా చేస్తుంది. అలాగే ఫేస్ వాష్ చేసుకొనే ప్రతి సారీ సబ్బు లేదా లిక్విడ్ వాష్ ఉపయోగించుకుండా నీటితో కడుక్కోవడం కూడా కొంచెం మంచి పద్దతే. ఫలితంగా కెమికల్స్ ఎఫెక్ట్ తక్కువగా ఉండటం చేత చర్మ నిగనిగలాడుతుంటుంది.

English summary

Side Effect of using Face Wash Many Times?


 Almost all men and women use face wash these days. Earlier men would use soap to wash their faces but now even they have become beauty conscious and know the various benefits of using mild cleansers on their face. Facial skin is much thinner and delicate when compared to the rest of the body. So, you need a specialised face wash to cleanse your skin.
Story first published: Monday, July 7, 2014, 12:10 [IST]
Desktop Bottom Promotion