For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు లేని చర్మం పొందడానికి: సింపుల్ రెమెడీస్

By Super
|

చర్మ సమస్యల్లో మొటిమలు, మచ్చలు ఒక సాధారణ సమస్య సహజంగా ఈ సమస్యను టీనేజ్ నుండి మద్యవయస్సు వారికి వరకూ ఎదుర్కొంటారు. అయితే అటువంటి చర్మ అందాన్ని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. అటువంటి వారిలో మీరు ఒక్కరైతే, ఎటువంటి మొటిమలు, మచ్చలు లేని కాంతివంతమైన చర్మాన్ని మీరు పొందాలని కోరుకుంటున్నట్లైతే ఈ ఆర్టికల్ చివరకూ మీరు చదవగలిగితే మీ సమస్యకు ఎటువంటి పరిష్కారం కావాలో మీకు అందుతుంది.

ముఖం మీద మొటిమలు ఉండటం, ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా మహిళలకు ఇబ్బంది పెడుతుంది. కొంత మంది మహిళలు ఈ మొటిమలను నివారణకు డాక్టర్ల వరకూ కూడా వెలుతుంటారు. మొటిమలు నివారించుకోవడాని మెడికేషన్స్ మరియు సప్లిమెంట్స్ కోసం ఎక్కువ డబ్బును ఖర్చుచేస్తుంటారు . అలాకాకుండా ఈ సింపుల్ చిట్కాలను మీరు అనుసరించినట్లైతే మీ సమస్యకు మంచి పరిష్కారం ఉంటుంది. ఇంటి వద్ద మొటిమలను ఎఫెక్టివ్ గా తగ్గించుకోవడానికి కొన్ని పద్దతుల మీకోసం క్రింది విధంగా అంధిస్తున్నాం..

Simple Remedies For Acne Free Skin

మీ ముఖంను తరచూ శుభ్రం చేసుకుంటుండాలి:
వేసవి కాలంలో మీ చర్మంలోని నూనె గ్రంధులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ఫలితంగా అప్పుడప్పుడు మీ ముఖం ఆయిలీగా మరియు జిడ్డుగా మారుతుంది. ఈ చిన్న కారణం చేత మీ ముఖంలో మొటిమలు ఏర్పుడుతాయి . అందుకు మీరు చేయాల్సిందల్లా మీ ముఖంను తరుచూ శుభ్రం చేసుకుంటుండాలి. రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. మంచి క్లెన్సర్ ను ఉపయోగించాలి. రోజుకు ఒక సారి శుభ్రం చేసుకోవడం వల్ల ఒకవేళ పనిచేయవచ్చు. మీరు ప్రయత్నించి రోజుకు ఒకసారా లేదా రెండు మూడు సార్లుకు ఫలితం ఉంటుందో తెలుసుకోండి.
మేకప్ తొలగించండి:
సాధారణంగా మహిళలు వారు అందంగా కనిపించడం కోసం మేకప్ సామాగ్రికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. ఇది మొటిమలకు దారితీస్తుంది. మీరు రాత్రి నిద్రించడానికి ముందు మీ మేకప్ ను తప్పనిసరిగా తొలగించుకోవాలి . అలా మీరు తొలగించుకోకపోయినట్లైతే మీరు మొటిమలకు ఆహ్వానం పలికినట్లే .

స్మోకింగ్ నిలిపివేయాలి:
అవును, మీరు మొటిమలు నివారించుకోవాలంటే, ధూమపానంను నివారించాలి. స్మోకింగ్ వల్ల చర్మం ప్రభావితం అవుతుంది.

ఇవి చాలా సింపుల్ టిప్స్ మరియు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మొటిమలను రాకుండా పూర్తిగా నివారిస్తాయి . ప్రారంభంలోనే నిర్లక్ష్యం చేస్తే దీని వల్ల చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి, ఈ సింపుట్ చిట్కాలు, వేసవికాలంలో అనుసరించి మొటిమలు లేని అందమైన చర్మాన్ని పొందండి.

Desktop Bottom Promotion