For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలతో చిరాకు పడుతున్నారా?సింపుల్ టిప్స్ మీకోసమే

|

మీరు మొటిమలతో బాధపడుతున్నారా? చాలా రోజుల నుండి మొటిమల సమస్యతో చిరాకు పడుతున్నట్లైతే అందుకు మీరు అధనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు రెగ్యులర్ క్లీనింగ్ కూడా చాలా అవసరం . మొటిమల ఫలతంగా చర్మం జిడ్డుగా మార్తుంది. మరియు రక్తంను మలినం చేస్తుంది. అంతర్గతంగా రక్తం మలినం కావబడం వల్ల మొటిమలకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి బహిర్గతంగానే కాదు, అంతర్గతంగా కూడా క్లీనింగ్ అనేది చాలా అవసరం. ముఖ చర్మంలో మొటిమలను నివారించుకోవడం కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

రక్త శుద్ది కోసం సిరఫ్స్, టానిక్స్ మరియు ఆహారాలు కూడా తీసుకోవల్సి ఉంటుంది. ఆహారాలు కాకుండా, మరియు డైట్ బ్యాలెన్స్ చేయడంతో పాటు తగినంత వరకూ అన్ని సులభ చిట్కాలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ సింపుల్ టిప్స్ మీ చర్మం సంరక్షణలో భాగంగా చర్మంలోని మలినాలన్నింటిని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

కాలేజ్ లేదా ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి రాగానే మీ చర్మంను శుభ్రపరచుటకు కొన్ని ప్రాధమిక విషయాలను అనుసరించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ ముఖంలో దుమ్ము, ధూళి లేకుండా జాగ్రత్త తీసుకోవాలి . మొటిమలను నివారించడం కోసం నీళ్ళు కూడా ఒక ఉత్తమ రెమెడీ.

మొటిమలను నివారించడం చాలా సులభం, మొటిమలను నివారించడానికి మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి....

ముఖంను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి

ముఖంను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి

ఇది మీ దినచర్యలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాలుష్యంప్రభావం చర్మం మీద ఏ మాత్రం పడకుండా చర్మాన్ని ఎల్లప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే ముఖాన్ని మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల ముఖంలో దుమ్ముధూళి తొలగిపోవడంతో పాటు ఫ్రెష్ గా మారుతుంది . అంతే కాదు ముఖంలో ఆయిల్ తొలగిపోతుంది. దాంతో మొటిమలను నివారించవచ్చు.

ఆయిల్ హెయిర్ ను నివారించాలి

ఆయిల్ హెయిర్ ను నివారించాలి

చర్మంలో మొటిమలు ఏర్పడుటకు ప్రధాన కారణం ఆయిల్ హెయిర్. జిడ్డుగా ఉన్న లేదా ఆయిల్ హెయిర్ చర్మంకు తగలడం వల్ల మొటిమలు ఏర్పడుతాయి . కాబట్టి, మీ చర్మంను శుభ్రపరచుకోవడంతో పాటు, రెగ్యులర్ హెయిర్ వాష్ కూడా ముఖ్యం. మీ జుట్టు నుండి అదనపు నూనెను తొలగించాలి. మీ చర్మంకు ఆయిల్ హెయిర్ టచ్ కాకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేయడం వల్ల మొటిమలను నివారించవచ్చు.

డైట్

డైట్

దినచర్యలో మీరు తీసుకొనే ఆహారం చాలా ముఖ్యం. మీరు మొటిమలు లేని చర్మం పొందాలని కోరుకుంటే, మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం తగినన్ని ప్రోటీన్స్ మరియు విటమిన్స్ కలిగి ఉండేలా చూసుకోవాలి. అది మీ ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టుకు బాగా సహాయపడుతుంది.

మొటిమలున్నప్పుడు వాటిని చేతితో తాకకండి

మొటిమలున్నప్పుడు వాటిని చేతితో తాకకండి

చాలా మంది ఇది ఒక చెడు అలవాటుంటుంది. అది మకు చూడటానికి సాధారణంగా అనిపించవచ్చు. అయితే రెగ్యులర్ గా అలా చేయడం వల్ల, మీరు మొటిమలను ఆహ్వానిస్తున్నట్లే . మీరు చేత్తో వాటిని ముట్టుకోవడం వల్ల మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

తేనెతో ప్యాక్

తేనెతో ప్యాక్

తేనె చాలా బంకగా ఉంటుంది. ఇది మీ చర్మం నుండి అదనపు ఆయిల్ తొలగించడానికి సహాయపడుతుంది. మొటిమల వల్ల కూడా ముఖం జిడ్డుగా మారుతుంది . కాబట్టి, ఈ సమస్య నివారించాలంటే, తేనెను వారంలో రెండు సార్లు ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది. దాంతో మీ చర్మం ఫ్రెష్ గా భావిస్తారు మరియు ఆయిల్ లేకుండా చర్మం క్లియర్ గా ఉంటుంది . మొటిమలను నివారించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

నిమ్మరసం

నిమ్మరసం

మీ ముఖంలో మొటిమలతో పాటు ,చర్మం జిడ్డుగా ఉన్నట్లైతే, నిమ్మరసం ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు. నిమ్మరసం చర్మంలో జిడ్డును తొలగించడం మాత్రమే కాదు ఇది చర్మంలోని బ్యాక్టీరియాను నివారించి చర్మంలోని ఎరుపుదనంను తొలగిస్తుంది. నిమ్మరసంను నేరుగా ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే చేత్తో కాకుండా, కాటన్ బాల్స్ ఉపయోగించి అప్లై చేయడం మంచిది.

English summary

Simple Ways To Avoid Acne


 
 Suffering from acne problem? Well, you are in right page then. Acne-prone skin requires extra care and regular cleaning. You need to realise that acne is a result of oily skin as well as impure blood. Internal impurity can cause acne on a regular basis. Right from internal cleaning to external cleaning, you need to perform all the necessary steps to ensure that acne is taken care of.
Story first published: Friday, October 24, 2014, 15:17 [IST]
Desktop Bottom Promotion