For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ గరుకు చర్మాన్నినునుపుగా మార్చే స్కిన్ కేర్ టిప్స్

|

సాధారణంగా చర్మ సమస్యల్లో రఫ్ స్కిన్(కఠిన చర్మం లేదా పొడి చర్మం) ఒక ప్రధాన సమస్య. రఫ్ గా మరియు డ్రైగా ఉన్నచర్మం సమస్య ఉన్న వారు చాలా బాధపడుతుంటారు . చర్మం పొడిగా ఉంటే, ముఖ్యంలో ప్యాచుప్యాచులగా చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను చాలా మందిలో తరచూ చూస్తూనే ఉంటాము. అటువంటి రఫ్ లేదా డ్రై స్కిన్ నివారించుట కొరకు వివిధ రకాల హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. సింథటిక్ మరియు రసాయనిక క్రీముల్ మరియు జెల్స్ వీటితో పాటు, నేచురల్ హోం రెమెడీస్ ఒకే విధంగా ఉంటాయి.

అందువల్ల , ఈ ఆర్టికల్లో రఫ్ స్కిన్ మరియు డ్రైస్కిన్ కలవారు, అనుసరించాల్సి కొన్ని స్కిన్ కేర్ టిప్స్ ను వివరించడం జరిగింది. ఈ చిట్కాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. ఈ హోం రెమడీస్ అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి, వీటిని అందరూ వినియోగించుకోవచ్చు..

మాయిశ్చరైజ్

మాయిశ్చరైజ్

డ్రై స్కిన్ కు ఒక ఉత్తమ పరిష్కార మార్గం చర్మానికి తగినంత హైడ్రేషన్ ను అందించడం. ఈ హైడ్రేషన్ కొరకు ఉత్తమ మాయిశ్చరైజ్ ను ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాలా మాయిశ్చరైజర్స్ అందుబాటులో ఉంటాయి. అయితే వాటిలో మీ స్కిన్ టోన్ కు సూట్ అయ్యే మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకోవాలి. ఈ మాయిశ్చరైజ్ కూడా నేచురల్ పదార్థాలతో తయారుచేసినదై ఉండాలి. ఇది మీ చర్మంను సాప్ట్ గా మరియు స్మూత్ గా తయారుచేస్తుంది.

స్ర్కబ్బింగ్

స్ర్కబ్బింగ్

రఫ్ మరియు డ్రై స్కిన్ కు ప్రధాన కారణం డెడ్ స్కిన్ సెల్సే. అందువల్ల, రఫ్ స్కిన్ ప్యాచ్ లను నివారించుటకు స్క్రబ్బింగ్ ను ఉపయోగించాలి. స్క్రబ్బింగ్ వల్ల డెడ్ స్కిన్ సెల్ మరియు అనవసరపు స్కిన్ సెల్స్ ను తొలగించి. వాటి స్థానంలో కొత్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. కొత్త కణాల ఉత్పత్తి అయితే, పాత కొణాల తొలగిపోతాయి. కాబట్టి, రఫ్ స్కిన్ కు అవసరం అయ్యే స్కిన్ కేర్ టిప్ ఒక మంచి స్ర్కబ్బింగ్ ముఖ్యంగా నట్స్ తో తయారుచేసిన స్క్రబ్బింగ్ ను ఎంపిక చేసుకోవాలి.

తేనె

తేనె

తేనె ఒక నేచురల్ హైడ్రేషన్ ఏజెంట్. ఇది మాయిశ్చైజ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అందువల్ల తేనెను రఫ్ స్కిన్ మరియు డెడ్ స్కిన్ ను ఫ్రెష్ గా ఉంచడానికి తేనెను ఉపయోగించవచ్చు. రఫ్ గా ఉన్న చర్మంకి వారానికొక సారి తేనెను అప్లై చేయాలి. కొన్ని వారాల సమయంలో మంచి డిఫరెన్స్ కనబడుతుంది. అలాగే మీరు స్కిన్ టాన్, స్కిన్ డ్యామేజ్ ను నివారించుకోవాలంటే, తేనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, రఫ్ స్కిన్ కు అప్లై చేయాలి

మిల్క్ అండ్ మిల్క్ క్రీమ్

మిల్క్ అండ్ మిల్క్ క్రీమ్

మీ చర్మంను సాఫ్ట్ గా మరియు స్మూత్ గా ప్రకాశవంతంగా మార్చే బ్యూటీ ప్రొడక్ట్స్ లో పాలు, మరియు పాలా క్రీమ్ ఒక ఉత్తమ వస్తువు నేచురల్ గా అందుబాటులో ఉంది. అందువల్ల రఫ్ ప్యాచులుగా ఉన్న చర్మం మీద నేరుగా మిల్క్ క్రీమ్ లేదా మిల్క్ ను అప్లై చేయాలి . ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే, కొన్ని వారాల్లో మంచి ఫలితం ఉంటుంది. అలాగే, స్నానం చేసేటప్పుడు, మీ చర్మానికి పసుపు అప్లై చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది.

ఫుల్లర్స్ ఎర్త్

ఫుల్లర్స్ ఎర్త్

ఫేస్ ప్యాక్ లను ఫుల్లర్త్ ఎర్త్ తో తయారుచేసినవి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది . ఇది రఫ్ మరియు డ్రై స్కిన్ కు ఒక ఉత్తమ పరిష్కారం . ఫుల్లర్స్ ఎర్త్ చర్మంను సాఫ్ట్ గా మార్చుతుంది. మరియు స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తుంది . అందువల్ల ఫుల్లర్స్ ఎర్త్ డ్రైస్కిన్ కు రెగ్యులర్ గా అప్లై చేయడం ఒక మంచి స్కిన్ కేర్ టిప్ . ఫుల్లర్స్ ఎర్త్ చాలా సులభంగా లభ్యం అవుతుంది. మరియు ఖరీదు కూడా తక్కువే.

వ్యాక్సింగ్

వ్యాక్సింగ్

వ్యాక్సింగ్ వల్ల అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. అయితే, చర్మంను డల్ గా మరియు డ్రై గా మార్చేడెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . అందువల్ల, రెగ్యులర్ వ్యాక్సింగ్ స్కిన్ సెల్స్ ను రిజ్యువేట్ చేస్తుంది మరియు స్కిన్ సెల్స్ పునరుత్పత్తికి సహాయపడుతుంది. వ్యాక్సింగ్ ను ప్రతి 20-25రోజులకు ఒక సారి చేస్తుండాలి. ఇంకా వ్యాక్సింగ్ సన్ టాన్ మరియు మురికిని తొలగిస్తుంది.

English summary

Skin Care Tips For Rough Skin

Rough and dry skin is a horror for many. The dry patch looks ugly and can embarrass any person. There are many remedies for such dry and rough skin. There are synthetic and chemical based creams and gels along with natural home remedies for the same.
Story first published: Monday, March 24, 2014, 15:13 [IST]
Desktop Bottom Promotion